తెలంగాణలో రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనిక. నకిలీ కార్డుల ఏరివేతే లక్ష్యంగా పౌర సరఫరాల శాఖ eKYCని తప్పనిసరి చేసింది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఈ నెల 31వ తేదీ చివరి గడువు. మీ దగ్గర్లోని రేషన్ డిపోలో మీ రేషన్ కార్డు, ఆధార్ నంబర్‌తో eKYC చేయించుకోవచ్చు. గడువులోగా పూర్తి చేయకపోతే వచ్చే నెల నుంచి రేషన్ పొందడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు.