కవ్విస్తున్న బిందు.. కుర్రాళ్ళకు కనుకే కరువు మేడమ్..
17-07-2026
Pic credit - Instagram
Phani Ch
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తనదైన నటన, అందంతో కుర్రకారు మనసు దోచుకున్న తెలుగమ్మాయి బిందు మాధవి గుర్తుపట్టని వాళ్లుండరు.
బిందు మాధవి కెరీర్ విషయానికి వస్తే.. 2008 వ సంవత్సరంలో వచ్చిన క్లాసిక్ హిట్ చిత్రం ‘ఆవకాయ్ బిర్యానీ’ సినిమాతో ఈమె టాలీవుడ్ లోకి డెబ్యూ చేసింది.
తన మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుని అందరి ప్రశంసలు అందుకుంది ముద్దుగుమ్మ బిందు మాధవి.
ఆ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వచ్చిన ‘రామ రామ కృష్ణ కృష్ణ’ సినిమాలో కీలక పాత్రలో నటించింది.
ఆ వెంటనే నేచురల్ స్టార్ నాని సరసన బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘పిల్ల జమీందార్’ సినిమాలోనూ హీరోయిన్‌గా నటించి మెప్పించింది.
ఆశించిన స్థాయిలో తెలుగు ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి సరైన అవకాశాలు దక్కించుకోలేకపోయినా తమిళ ఇండస్ట్రీలో మాత్రం బిందు మాధవి వరుస ఆఫర్లతో చాలా బిజీగా మారిపోయింది.
అక్కడ వైవిధ్యమైన పాత్రలు చేస్తూ స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు కూడా ఆమె చేతిలో రెండు క్రేజీ తమిళ సినిమాలు ఉన్నాయి.