ప్రస్తుత కేవలం ఒకే ఒక్క ఇన్‌స్టాగ్రామ్ రీల్ లేదా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వీడియోతో ఓవర్‌నైట్ సెలబ్రెటీలుగా మారిపోతున్న ముద్దుగుమ్మలు ఎందరో ఉన్నారు.
అదే దారిలో పయనిస్తూ, ప్రస్తుతం గ్లామర్ ఇండస్ట్రీలో సరికొత్త సంచలనంగా మారింది బిగ్ బాస్ బ్యూటీ రమ్య మోక్ష.
తెలుగు రాష్ట్రాల్లో కేవలం 'రమ్య మోక్ష' అనే పేరు కంటే, 'పచ్చళ్ళ పాప' అంటే ఈమెను గుర్తుపట్టని నెటిజన్ ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఆ క్రేజ్‌తోనే రమ్య మోక్ష బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో అయిన 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9' లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.
హౌస్‌లోకి అడుగుపెడుతూనే తన అగ్రెసివ్ ఆటతీరుతో రెండు వారాల పాటు గట్టిగానే హడావిడి చేసింది. బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన తర్వాత కూడా రమ్య మోక్ష క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
అశ్విన్ బాబు హీరోగా వచ్చిన 'వచ్చినవాడు గౌతమ్' అనే సినిమాలో ఈ చిన్నది నటించినప్పటికీ, వెండితెరపై కంటే సోషల్ మీడియాలోనే ఈ భామకు తిరుగులేని ఫాలోయింగ్ ఉంది.
హీరోయిన్ మెటీరియల్‌కు కావాల్సిన అన్ని అర్హతలు రమ్య మోక్షకు ఉన్నాయని, త్వరలోనే ఈ పచ్చళ్ళ పాప సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్‌గా మెరవడం ఖాయమని అభిమానులు అంటున్నారు.