AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: టీ20 వరల్డ్‌ కప్ మేనియా.. టీమిండియా గెలవాలని అభిమానుల ప్రత్యేక పూజలు.. ఎక్కడంటే?

T20 World Cup Final: ప్రస్తుతం దేశం మొత్తం టీ20 ప్రపంచ కప్ మేనియాతో ఊగిపోతోంది. భారత్ ఫైనల్‌లో విజేతగా నిలవాలని కోరుకుంటూ, అభిమానులు ఆలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు చేస్తున్నారు. భారత క్రికెటర్ల పేరుతో అర్చనలు నిర్వహిస్తున్నారు. టీమిండియాకు దైవశక్తి సమకూరాలని, ప్రపంచ కప్ కైవసం చేసుకోవాలని భక్తులు, జ్యోతిష్యులు సైతం ప్రార్థిస్తున్నారు.

T20 World Cup: టీ20 వరల్డ్‌ కప్ మేనియా.. టీమిండియా గెలవాలని అభిమానుల ప్రత్యేక పూజలు.. ఎక్కడంటే?
Indian Cricket Fans Perform Rituals For T20 World Cup Glory
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Mar 08, 2026 | 9:19 AM

Share

ప్రస్తుతం యావత్ దేశం మొత్తం టీ20 వరల్డ్‌ కప్ మేనినా నడుస్తోంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విశ్వ విజేతగా నిలవాలని యావత్ భారతదేశం కోరుకుంటుంది. భారత్ జట్టుకు మరింత శక్తి సమకూర్చాలని, భారత్ వరల్డ్ కప్ కైవసం చేసుకోవాలని కోరుకుంటూ కొందరు క్రికెట్ అభిమానులు ఏకంగా ఆలయాలలో పూజలు, అభిషేకాలు ,అర్చనలు హోమాలు నిర్వహిస్తున్నారు. భారత క్రికెటర్స్ పేరుతో ఆలయాలలో ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తున్నారు. పూజారులు భారత జట్టు క్రికెటర్స్ పేర్లతో హోమాలు నిర్వహించి టీమ్ ఇండియాకు దైవశక్తి సమకూరేలా చేశారు.

లీగ్ మ్యాచ్‌లలో ఆలోవకగా నెగ్గిన టీమ్ ఇండియా. సూపర్ – 8 మొదటి మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఓటమి పాలైంది.. ఆ ఓటమి నేర్పిన గుణపాఠంతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్ పై భారీ స్కోరుచేసి భారత ఫ్యాన్స్ అంచనాలు పెంచేసింది. ఆదివారం వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలబడబోతుంది.

ఇక నేటి ఫైనల్ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరుచేసి ప్రత్యర్థిని చిత్తు చేయాలని, వరల్డ్ కప్ కైవసం చేసుకోవాలని కోరుకుంటూ జనగామ జిల్లా పాలకుర్తిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో క్రికెట్ ఫ్యాన్స్ అభిషేకాలు నిర్వహించారు. టీ-20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ గెలవాలని పూజలు చేశారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేస్తూ ఇండియా కప్పు కొట్టాలని మొక్కులు మొక్కారు.భారత ఆటగాళ్ల పేర్లపై అర్చనలు చేపించారు.

వీడియో చూడండి..

మరోవైపు శ్రీ రాజ్యశ్యామల పీఠం జ్యోతిష్యులు దేవగిరి సంతోష్ శర్మ , శ్యామ్ శర్మ ఆధ్వర్యంలో హోమాలు, జపాలు నిర్వహించారు. కొడకండ్ల లోనీ ప్రముఖ దేవస్థానమైన శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో అభిమానులు, భక్తులు పెద్ద ఎత్తున దేవి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో భారత్ గెలవాలని యజ్ఞాలు, పూజలు చేశారు. భారత్ విశ్వ విజేతగా నిలవాలని దేశమంతా ఎదురుచూస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us