Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raksha Bandhan 2024: మీ సిస్టర్‌కు ఆర్థిక భద్రతనిచ్చే బహుమతులు ఇవి.. ఈ సారి రాఖీ పండుగకు ఇలా ట్రై చేయండి..

సాధారణంగా గిఫ్ట్‌ సెట్లు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు బహుమతులుగా ఇవ్వడం చేస్తుంటారు. అయితే ఈసారి కొత్తగా.. వారి భవిష్యత్తుకు భరోసాగా నిలిచేలా బహుమతి ఇస్తే ఎలా ఉంటుంది? ఆలోచించారా? ఇదిగో మీకు అలాంటి ఆప్షన్లకు మీకు పరిచయం చేస్తున్నాం. ఇచ్చేది నగదు బహుమతే అయినా.. కొత్త మార్గంలో అందించడం ద్వారా మీ సోదరీమణులను సర్ ప్రైజ్ చేయొచ్చు.

Raksha Bandhan 2024: మీ సిస్టర్‌కు ఆర్థిక భద్రతనిచ్చే బహుమతులు ఇవి.. ఈ సారి రాఖీ పండుగకు ఇలా ట్రై చేయండి..
Financial Gifts
Follow us
Madhu

|

Updated on: Aug 17, 2024 | 7:47 AM

మన దేశంలో రాఖీ పండుగ చాలా విశిష్టమైనది. అన్నా చెల్లెళ్లు, అక్కడ తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా దీనిని వేడుకగా నిర్వహిస్తారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఇంట్లోనూ దీనిని జరుపుకుంటారు. సోదరీమణులు, తమ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టడం ద్వారా తమ అనుబంధాన్ని చాటి చెబుతారు. అందుకు ప్రతిగా సోదరులు, సోదరీమణులకు బహుమతులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా గిఫ్ట్‌ సెట్లు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు బహుమతులుగా ఇవ్వడం చేస్తుంటారు. అయితే ఈసారి కొత్తగా.. వారి భవిష్యత్తుకు భరోసాగా నిలిచేలా బహుమతి ఇస్తే ఎలా ఉంటుంది? ఆలోచించారా? ఇదిగో మీకు అలాంటి ఆప్షన్లకు మీకు పరిచయం చేస్తున్నాం. నగదును ఎప్పుడు బహుమతిగా ఇచ్చినా ఎదుటి వారి కళ్లల్లో ఆనందాన్ని పంచుతుంది. అయితే దీర్ఘకాలంలో వారికి ఆధారంగా నిలిచేలా స్టాక్‌లు, బాండ్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌, ఈటీవీఎఫ్‌ వంటి ప్రాథమిక పెట్టుబడి ఆప్షన్లను సోదరీమణులకు బహుమతిగా పరిచయం చేయడం ద్వారా.. వారికి మంచి అలవాటు నేర్పడంతో పాటు భవితకు భరోసా చేకూరినట్లు అవుతుంది. అలాంటి ఆప్షన్లను అందిస్తున్నాం.

నగదు బహుమతి.. రాఖీ కట్టిన సోదరికి నగదును బహుమతిగా ఇవ్వడం మంచి ఆలోచన. ఇది ఒక క్లాసిక్ బహుమతి, అని చెప్పొచ్చు. ఈ నగదును ఇది ఆమె కోరుకున్న విధంగా ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది.

పెట్టుబడి నిధి.. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలతో ఆమెకు సహాయం చేయడానికి ఆమె పేరు మీద మ్యూచువల్ ఫండ్ లేదా సేవింగ్స్ ఖాతాను ప్రారంభించొచ్చు.

గిఫ్టింగ్ స్టాక్‌లు.. రక్షా బంధన్‌ సమయంలో గిఫ్టింగ్ స్టాక్‌లు ఆర్థిక సామర్థ్యాన్ని, దీర్ఘకాలిక విలువను అందిస్తాయి. ఇవి ఆలోచనాత్మకంగా ఉంటాయి. భవిష్యత్తుకు భరోసా ఇస్తాయి.

సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు.. మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టడానికి సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు(ఎస్‌ఐపీలు) క్రమశిక్షణతో కూడిన విధానాన్ని అందిస్తాయి. వీటిని రాఖీ బహుమతిగా మార్చవచ్చు.

బంగారం/వెండి నాణేలు.. విలువైన మెటల్ నాణేలు ఆచరణాత్మక, విలువైన బహుమతిగా ఉంటాయి.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు.. ఇవి శాశ్వతమైన, సురక్షితమైన బహుమతి ఎంపిక. ఇవి పెట్టుబడిపై హామీతో కూడిన రాబడిని అందిస్తాయి. మీ సోదరి ఆర్థిక భద్రత, భవిష్యత్తు ప్రణాళికకు దోహదపడతాయి.

మ్యూచువల్‌ ఫండ్స్‌.. ఈ బహుమతి ఆమెను మ్యూచువల్ ఫండ్ వృత్తిపరమైన నిర్వహణ, వైవిధ్యం నుంచి ప్రయోజనం పొందేందుకు అనుమతిస్తుంది, కాలక్రమేణా ఆమె సంపదను వృద్ధి చేస్తుంది.

గిఫ్ట్ కార్డ్.. ఆమెకు ఇష్టమైన స్టోర్ లేదా ఆన్‌లైన్ రిటైలర్‌కు సంబంధించిన బహుమతి కార్డ్‌ను బహుమతిగా ఇవ్వొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..