AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మురారి వెనక ఇంత కథ ఉందా..!! విషయం తెలిస్తే కృష్ణవంశీని మెచ్చుకోకుండా ఉండలేరు

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‏లోనే ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘మురారి’. డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సోనాలి బింద్రే కథానాయికగా నటించింది. 2001 ఫిబ్రవరి 17న రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

మురారి వెనక ఇంత కథ ఉందా..!! విషయం తెలిస్తే కృష్ణవంశీని మెచ్చుకోకుండా ఉండలేరు
Murari
Rajeev Rayala
|

Updated on: Mar 08, 2026 | 12:20 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఇప్పటివరకూ పాన్ ఇండియా సినిమాలు చేయకపోయినా మహేష్ కు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఇక ఇప్పుడు పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జెట్ స్పీడ్ తో జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సంచారి సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.వాటిలో మురారి సినిమా ఒకటి. మురారి సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి సినిమా మంచి విజయన్ని అందుకుంది. ఈ సినిమాతో సోనాలి బింద్రే హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది.

అయితే ఈ సినిమా బ్యాక్ స్టోరీ గురించి కృష్ణవంశీ ఆసక్తికర విషయం తెలిపారు. గతంలో కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తెన్నేటి హేమలత అనే రైటర్ ఉన్నారు. ఆమె రాసిన మోహన వంశీ అనే కథ నన్ను బాగా ఆకట్టుకుంది. కృష్ణుడు బృందావనంలో ఉండే పార్ట్ వరకే కథగా రాసింది ఆమె.. ఆ బుక్ గుర్తుకు వచ్చింది. చేస్తే ఆ బృందావనం బ్యాక్ డ్రాప్ తో సినిమా చేయాలి అని అనుకున్నా.. బృందావనం, గొల్లభామలు, పచ్చదనం, కృష్ణుడు ఇలా అందంగా తీయాలని అనుకున్నా.. ఆ తర్వాత పోతన భాగవతం చదివి కృష్ణుడి గురించి తెలుసుకున్నా.. అని అన్నారు కృష్ణవంశీ.

ఆ తర్వాత నేను గోదావరి జిల్లాల్లో తిరుగుతూ ఉన్నాను. కారులో తిరుగుతూ ఉండగా కొంతమంది నా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ.. ఇలా ఇందిరాగాంధీ ఫ్యామిలీకి ఎదో శాపం ఉందని మాట్లాడారు.. ఆ ఫ్యామిలీలో అన్ని వరుస మరణాలు, బలన్మరణాలు అని చెప్పారు. ఆతర్వాత ఓ పెద్ద ఎంపీగారు.. ఆయనకు ఇద్దరో ముగ్గురో కొడుకులు ఉన్నారు. వాళ్లు మూడు నెలల గ్యాప్ లో చనిపోయారు. కారణం ఏంటి అంటే ఆ ఇంటి పనిమనిషి శాపం అని అన్నారు. దాంతో ఈ శాపం కాన్సెప్ట్ వచ్చింది. అలాగే శ్రీ కృష్ణుడి కథలో కూడా అదే కదా.. ఏడుగురు చనిపోయిన తర్వాత ఎనిమిదో వాడిగా పుట్టాడుగా కృష్ణుడు.. వాటిని లింక్ చేస్తూ కథను రాసుకున్నా.. అలా మురారి సినిమా వచ్చింది అని తెలిపారు కృష్ణ వంశీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గుప్త నవరాత్రుల్లో ఈ వస్తువులను దానం చేయండి.. అమ్మవారి అనుగ్రహంతో
గుప్త నవరాత్రుల్లో ఈ వస్తువులను దానం చేయండి.. అమ్మవారి అనుగ్రహంతో
‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’.. తెగ సంబరపడుతున్న మగానుభావులు
‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’.. తెగ సంబరపడుతున్న మగానుభావులు
మ్యాచ్ మధ్యలో బాంబ్ పేల్చిన గంభీర్.. కోహ్లీతోపాటు రోహిత్ ఎమోషన్
మ్యాచ్ మధ్యలో బాంబ్ పేల్చిన గంభీర్.. కోహ్లీతోపాటు రోహిత్ ఎమోషన్
గానుగలో తీసిన కొబ్బరి నూనె.. రిఫైన్డ్ ఆయిల్ కంటే మంచిదా..?
గానుగలో తీసిన కొబ్బరి నూనె.. రిఫైన్డ్ ఆయిల్ కంటే మంచిదా..?
మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ ఉపాధ్యాయుడి బాలగేయం..
మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ ఉపాధ్యాయుడి బాలగేయం..
రక్తహీనతను చిటికెలో తగ్గించే నేచురల్ పొడి.. ఒక్క చెంచాడు చాలు..
రక్తహీనతను చిటికెలో తగ్గించే నేచురల్ పొడి.. ఒక్క చెంచాడు చాలు..
స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు..ఇద్దరు విద్యార్థులు మృతి
స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు..ఇద్దరు విద్యార్థులు మృతి
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన