వాయమ్మో.. నాగుపామును కరకర నమిలి మింగేసిన కప్ప.. నెట్టింట దుమ్ములేపుతున్న వీడియో..
సాధారణంగా పాములు కప్పలను మింగడం సహజమే. కానీ, దీనికి పూర్తి భిన్నంగా ఓ కప్ప చిన్న నాగుపాము పిల్లను నోటకరుచుకుని కనిపించిన అరుదైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొమ్మిది సెకన్ల ఈ వీడియోలో కప్ప పాము తోక భాగాన్ని పట్టుకుని మింగే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. అయితే పాము చివరకు తప్పించుకుందా? లేక కప్ప మింగిందా? అన్నది వీడియోలో చూపించలేదు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో స్పష్టత లేకపోయినా, నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కప్ప కనిపిస్తే పాముకు పండగ.. అమాంతం మింగేసి కడుపు నింపుకుంటుంది. కానీ, సహజత్వానికి భిన్నంగా కప్ప పామును మింగే ప్రయత్నం చేసింది.. అవును మీరు వింటున్నది నిజమే.. ఓ కప్ప చిన్న కింగ్ కోబ్రా పామును నోటకరుచుకుని కనిపిస్తుంది.. చాలా అరుదైన, అద్భుతమైన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో, సుమారు ఒకటి నుండి ఒకటిన్నర అడుగుల పొడవున్న నాగుపాము పిల్ల ఒక కప్ప నోటిలో చిక్కుకుని కనిపిస్తోంది. అయితే.. ఈ ఘటన ఎక్కడ జరిగింది. ఎప్పుడు జరిగింది అన్నది పూర్తిగా తెలియరాలేదు.. కానీ.. నెట్టింట మాత్రం తెగ వైరల్ అవుతోంది..
కప్ప నెమ్మదిగా వెనుక నుండి వచ్చి నాగు పాము తోక భాగాన్ని కొంచెం నోటకరుచుకుంది.. క్రమక్రమంగా పామును మొత్తంగా మింగే ప్రయత్నం చేస్తూ కనిపిస్తుంది. అయితే.. అది మింగిందా..? లేదా.. పాము విడిపించుకుందా అనేది చూపించలేదు.. కేవలం తొమ్మిది సెకన్ల ఈ వీడియోలో ఓ చిన్న పాము తోక భాగాన్ని కప్ప నోట పట్టుకున్నది మాత్రమే కనిపిస్తుంది.
నెట్టింట వైరల్ గా మారిన వీడియోను చూడండి..
A shocking reversal in the wild! 🐸🐍 The frog grabs hold of a cobra and attempts to swallow it alive. A rare and intense predator-vs-predator moment where the hunter suddenly becomes the hunted! 😱🔥 pic.twitter.com/tFM7QO2ehj
— Animal Admirer 🇺🇲 US (@Shreyansh892023) August 2, 2026
కప్ప ఒక చిన్న పాము పిల్లను తన నోటిలో పట్టుకుని కనిపించిన ఘటన ఎక్కడ జరిగిందనేది మాత్రం స్పష్టంగా తెలియరాలేదు..
అయితే.. వర్షాకాలంలో లేదా.. సాధారణంగా ఇళ్ల చుట్టూ జంతువులు, సరీసృపాలు కనిపిస్తే, భయపడి వాటిని చంపే బదులు, వెంటనే పాములను పట్టే స్నేక్ క్యాచర్స్ ను సంప్రదించాలని అటవీ శాఖ పౌరులకు విజ్ఞప్తి చేస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
