AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: బుడ్డోడి ఫ్రెండ్‌తోనూ పరేషానే.. ఏకంగా 146 కిమీల వేగంతో బౌలింగ్.. కన్నేసిన ఐపీఎల్ టీంలు..!

Deepesh Devendran 146kph Bowling: క్రికెట్‌లో భారత యువ బౌలర్లు స్థిరంగా 145 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం అత్యంత అరుదైన విషయం. టీఎన్‌పీఎల్ లీగ్‌లో తొలి మ్యాచ్‌లోనే నిప్పులు చెరిగిన దీపేష్ దేవేంద్రన్‌పై రాబోయే ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలు కుమ్మరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Video: బుడ్డోడి ఫ్రెండ్‌తోనూ పరేషానే.. ఏకంగా 146 కిమీల వేగంతో బౌలింగ్.. కన్నేసిన ఐపీఎల్ టీంలు..!
Deepesh Devendran
Venkata Chari
|

Updated on: Aug 07, 2026 | 12:33 PM

Share

Deepesh Devendran 146kph Bowling: భారత అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో కీలక పాత్ర పోషించిన తమిళనాడు యంగ్ సంచలనం దీపేష్ దేవేంద్రన్ టీఎన్‌పీఎల్ అరంగేట్రంలోనే రికార్డు వేగంతో చెలరేగాడు. గంటకు 146 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ లాంటి బంతులు విసురుతూ ప్రత్యర్థి బ్యాటర్ల గుండెల్లో వణుకు పుట్టించాడు.

తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్) వేదికగా మధురై పాంథర్స్ తరఫున ఆడుతున్న 18 ఏళ్ల దీపేష్ దేవేంద్రన్ అరంగేట్ర మ్యాచ్‌లోనే సంచలనం సృష్టించారు. తిరుచ్చి గ్రాండ్ చోళాస్‌తో జరిగిన హోరాహోరీ పోరులో 4 ఓవర్లు వేసి 25 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశారు. తీసిన వికెట్లు ఒక్కటే అయినా, ఆయన విసిరిన డెలివరీల వేగం మైదానంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. స్థిరంగా గంటకు 140 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగాన్ని నమోదు చేస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

ఇవి కూడా చదవండి

146 కేఎంపీహెచ్ వేగంతో వికెట్లు చెల్లాచెదురు..

ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన దీపేష్, తొలి బంతికి ఏకంగా 146 కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేశాడు. ఆ ఓవర్‌లో ఏకంగా మూడుసార్లు 140 కిలోమీటర్ల మార్కును దాటుతూ కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతకుముందు జఫర్ జమాల్‌ను గంటకు 143 కిలోమీటర్ల వేగవంతమైన డెలివరీతో క్లీన్ బోల్డ్ చేసి మిడిల్ స్టంప్‌ను ఎగరగొట్టాడు. ఆరు అడుగుల ఎత్తు ఉన్న ఈ కుర్రాడు తన పేస్‌కు తోడు అదనపు బౌన్స్ కూడా రాబడుతుండటంతో బ్యాటర్లు పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

తండ్రి బాటలోనే కష్టపడి పైకి వచ్చి..

దీపేష్ తండ్రి వాసుదేవన్ దేవేంద్రన్ కూడా తమిళనాడు తరఫున దేశవాళీ క్రికెట్ ఆడారు. 2007లో తొలి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలిచిన తమిళనాడు జట్టులో ఆయన భాగస్వామి. తండ్రి అందించిన ప్రోత్సాహంతోనే దీపేష్ క్రికెట్‌లో వేగంగా ఎదుగుతున్నాడు. గతేడాది యు-19 ఆసియా కప్‌లో 14 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలోనూ, ఇటీవల అండర్-19 ప్రపంచకప్ విజయంలోనూ కీలక పాత్ర పోషించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us