AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కరెంట్ స్తంభం ఎక్కి యువకుడి హల్‌చల్! సీన్‌కట్‌ చేస్తే..

ప్రేమ వ్యవహారాల్లో చిన్నచిన్న గొడవలు రావడం సహజమే. కానీ, కోపంలో కొందరు చేసే విపరీతమైన పనులు ఇతరులను దిగ్భ్రాంతికి గురిచేస్తుంటాయి. తాజాగా ఒక యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవపడి, ఆవేశంలో అత్యంత ప్రమాదకరమైన విద్యుత్‌ స్తంభం పైకి ఎక్కి తీవ్ర కలకలం సృష్టించాడు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ హైడ్రామాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కరెంట్ స్తంభం ఎక్కి యువకుడి హల్‌చల్! సీన్‌కట్‌ చేస్తే..
High Voltage Pole Incident
Jyothi Gadda
|

Updated on: Aug 07, 2026 | 12:57 PM

Share

ప్రేమ వ్యవహారాల్లో చిన్నచిన్న గొడవలు రావడం సహజమే. కానీ, కోపంలో కొందరు చేసే విపరీతమైన పనులు ఇతరులను దిగ్భ్రాంతికి గురిచేస్తుంటాయి. తాజాగా ఒక యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవపడి, ఆవేశంలో అత్యంత ప్రమాదకరమైన విద్యుత్‌ స్తంభం పైకి ఎక్కి తీవ్ర కలకలం సృష్టించాడు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ హైడ్రామాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవపడి కోపంలో ఒక యువకుడు ఏకంగా హై ఓల్టేజ్‌ కరెంట్‌ స్తంభం పైకి ఎక్కి రచ్చ చేసిన విచిత్ర ఘటన సోషల్‌ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. తన ప్రేయసితో ఏదో విషయమై తీవ్రమైన వాగ్వాదం జరిగిన తర్వాత, ఆ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కోపంలో నిగ్రహం కోల్పోయి, రహదారి పక్కనే ఉన్న ఎత్తైన స్ట్రీట్ లైట్ పోల్ పైకి వేగంగా పాకుకుంటూ వెళ్లిపోయాడు. పోల్ పైభాగానికి చేరుకుని అక్కడ ప్రమాదకర స్థితిలో కూర్చున్నాడు. అతనిని చూసిన బాటసారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై కిందకు దిగమని ఎంత కోరినా అతడు వినలేదు.

పరిస్థితి చెయ్యి దాటిపోతుండటంతో స్థానికులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే అతడు కిందకు దిగడానికి నిరాకరించడంతో, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టక తప్పలేదు. వెంటనే ఒక హైడ్రాలిక్ క్రేన్ ను తెప్పించి, సిబ్బంది దాని ద్వారా స్తంభం పైభాగానికి చేరుకున్నారు. యువకుడి దృష్టి మరల్చి, ఎంతో చాకచక్యంగా అతడిని పట్టుకుని సురక్షితంగా కిందకు దించారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

పోలీసులు అతడిని సురక్షితంగా కిందకు దించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పోలీసులు ఆ యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మొత్తం డ్రామాను అక్కడ ఉన్న కొందరు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి నెట్టింట పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. కోపం వస్తే కరెంట్‌ స్తంభాలు ఎక్కడమేంటి సామీ! అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ముగియనున్న ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు.. ఎప్పటి వరకు అంటే..!
ముగియనున్న ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు.. ఎప్పటి వరకు అంటే..!
స్కూల్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి!
స్కూల్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి!
ఈ 5 ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లడం కష్టమే.. ఎందుకో తెలుసా?
ఈ 5 ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లడం కష్టమే.. ఎందుకో తెలుసా?
వాయమ్మో ఏంట్రా ఇది.. నాగుపామును మింగిన కప్ప.. ఇదిగో వీడియో
వాయమ్మో ఏంట్రా ఇది.. నాగుపామును మింగిన కప్ప.. ఇదిగో వీడియో
గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కరెంట్ స్తంభం ఎక్కి యువకుడి హల్‌చల్! 
గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కరెంట్ స్తంభం ఎక్కి యువకుడి హల్‌చల్! 
రాహుల్ గాంధీ ఫేవరెట్ పొలిటిషియన్ బీజేపీ నేత..!
రాహుల్ గాంధీ ఫేవరెట్ పొలిటిషియన్ బీజేపీ నేత..!
వైభవ్ ఫ్రెండ్‌తోనూ పరేషానే.. నిప్పులు చెరిగే బౌలర్‌ భయ్యో..!
వైభవ్ ఫ్రెండ్‌తోనూ పరేషానే.. నిప్పులు చెరిగే బౌలర్‌ భయ్యో..!
ఇంట్లో మిగిలిపోయిన చపాతీలతో పిల్లలు ఇష్టపడే టేస్టీ బ్రేక్‌ఫాస్ట్!
ఇంట్లో మిగిలిపోయిన చపాతీలతో పిల్లలు ఇష్టపడే టేస్టీ బ్రేక్‌ఫాస్ట్!
మెరిసే గోళ్ల వెనక ఇంత పెద్ద కథ ఉందా.. నెయిల్ పాలిష్ సీక్రెట్స్..
మెరిసే గోళ్ల వెనక ఇంత పెద్ద కథ ఉందా.. నెయిల్ పాలిష్ సీక్రెట్స్..
మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే శరీరానికి ఏమవుతుంది? సంకేతాలివే!
మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే శరీరానికి ఏమవుతుంది? సంకేతాలివే!