AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బోనాల స్పెషల్: నోరూరించే బోటీ ఫ్రై.. ఇలా చేశారంటే ఇంటిల్లిపాది ఫిదా అవ్వాల్సిందే..!

ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండగ అంటేనే తెలంగాణలో నాన్‌వెజ్ వంటకాల ఘుమఘుమలు గుర్తుకొస్తాయి. చికెన్, మటన్‌లతో పాటు నాన్‌వెజ్ ప్రియులు ఎంతో ఇష్టపడే ఐటమ్ బోటీ. అయితే ఎప్పుడూ ఒకేలాగా రసంతో కూడిన కర్రీ కాకుండా, రెస్టారెంట్ స్టైల్‌లో కరకరలాడుతూ, కారకారంగా ఉండే బోటీ ఫ్రై చేసుకుంటే ఆ రుచే వేరు. ఇంట్లోనే ఎంతో సులభంగా, అద్భుతమైన రుచితో బోటీ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

బోనాల స్పెషల్: నోరూరించే బోటీ ఫ్రై.. ఇలా చేశారంటే ఇంటిల్లిపాది ఫిదా అవ్వాల్సిందే..!
Boti Fry Recipe
Jyothi Gadda
|

Updated on: Aug 07, 2026 | 8:53 AM

Share

బోనాల పండగ వాతావరణంలో నాన్‌వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే వంటకాల్లో బోటీ ఫ్రై ఒకటి. ఎప్పుడూ చేసుకునే సాధారణ కర్రీలా కాకుండా, ప్రత్యేకమైన పద్ధతిలో బోటీని ఫ్రై చేస్తే బ్రహ్మాండమైన రుచి వస్తుంది. ముందుగా బోటి ఉడకబెట్టుకోవడానికి పొయ్యి మీద గిన్నె పెట్టి నీళ్ళు వేడి చేసుకోవాలి. మరోవైపు బోటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఈ పేగుల్ని, గలబోటిని మొత్తాన్ని మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకోవాలి. వీటన్నిటినీ శుభ్రంగా కడుక్కున్న తర్వాత, పొయ్యి మీద పెట్టిన నీళ్లలో వేసేస్తే బాగా ఉడుకుతాయి. ఇందులోనే ఒక అర చెంచా పసుపు, ఒక చెంచా ఉప్పు వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేసి ఒక పావుగంట సేపు ఉడకనివ్వాలి.

పావుగంట అయ్యిన తరువాత బోటి ఉడికిపోతుంది. ఇప్పుడు తీసి ఒక జల్లెడలో పోసుకోవాలి. కడాయి పెట్టుకుని మూడు చెంచాల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కగానే… కోసిపెట్టుకున్న మూడు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఉల్లి పాయలు వేగిన తర్వాత, ఒక చెంచానర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు సన్న మంట మీద కలుపుకోవాలి. ఇప్పుడు బోటి వేసేసుకోవాలి. ఇదంతా ఇప్పుడు సన్న మంట మీద రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూనే ఉండాలి.

ఈ ప్రాసెస్ అంతా సన్న మంట మీదే జరగాలి.. మంట పొరపాటున కూడా ఎక్కువ పెట్టకూడదు. ఇలా రెండు మూడు నిమిషాలు కలుపుకున్నాక, ఒక అర చెంచా పసుపు, రెండు చెంచాల కారం, రుచికి సరిపడా ఉప్పు, అర చెంచా ధనియాల పొడి, పావు చెంచా జీలకర్ర పొడి, అర చెంచా గరం మసాలా. ఇలా పొడులన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఇదంతా బాగా కలిపేసుకున్నాక, మూత పెట్టుకుని సన్న మంట మీద పది నిమిషాల పాటు అలా వదిలేయాలి.

ఇవి కూడా చదవండి

పది నిమిషాల తరువాత మూత తీసి కాస్త కొత్తిమీర అలా వేసుకుని ఒక్క నిమిషం పాటు కలిపేసుకోవాలి. అంతేనండి, డన్! భలే రుచికరమైన బోటీ ఫ్రై తయారైనట్టే.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us