AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రైన్‌ వాష్‌రూమ్‌లో భార్య.. తెలియకుండా దిగిన భర్త.. 150కి.మీ వెళ్లిన తర్వాత ఊహించని ట్విస్ట్

మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. కాంచిగూడ నుంచి భగత్ కోఠి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న రాజస్థాన్‌కు చెందిన అదనపు జడ్జి భార్య వాష్‌రూమ్‌లో గుండెపోటు కారణంగా మృతి చెందింది. తాము దిగాల్సిన స్టాప్‌ నుంచి ట్రైన్ 150 కిలీమీటర్ల దూరంలో ఉన్న మరో స్టేషన్‌ వెళ్లిన తర్వాత వాష్‌రూమ్‌లో మహిళ మృతదేమాన్ని గుర్తించిన పోలీసులు భర్త తెలియజేయంతో అతను కన్నీటి పర్యంతమయ్యారు.

ట్రైన్‌ వాష్‌రూమ్‌లో భార్య.. తెలియకుండా దిగిన భర్త.. 150కి.మీ వెళ్లిన తర్వాత ఊహించని ట్విస్ట్
Rajasthan Judge Wife Found Dead Inside Train Toilet
Anand T
|

Updated on: Mar 08, 2026 | 11:49 AM

Share

రన్నింగ్‌ ట్రైన్‌లోని వాష్‌రూమ్‌లో ఓ జడ్జి భార్య గుండెపోటు కారణంగా మృతి చెందిన ఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ కు చెందిన అడిషనల్ జడ్జి రాజ్ కుమార్ చౌహాన్ తన భార్య ఉషతో కలిసి కాచిగూడ, బగత్ కీ కోటి ట్రైన్‌లో ప్రయాణస్తున్నారు. అయితే బుకింగ్ టైంలో ఇద్దరికీ విడివిడిగా బెర్త్‌లు రావడంతో ఇద్దరూ వేరుగావేరుగా కూర్చున్నారు. అయితే వారు దిగాల్సిన గమస్యస్థానం నిమ్బెహర స్టేషన్‌ రావడంతో దిగే ముందు భార్య వాష్‌రూమ్‌ వెళ్తానని రాజ్‌కుమార్‌కు చెప్పి వెళ్లింది.

అంతలో రాజ్‌కుమార్ తన లగేజీని తీసుకొని ట్రైన్ దిగేసాడు. అటు వైపు నుంచి భార్య కూడా తన కంటే ముందే ట్రైన్ దిగేసి ఉంటుందని అనుకున్నాడు. కానీ ప్లాట్‌ఫామ్‌ నుంచి ట్రైన్ వెళ్లిపోయినా భార్య కనిపించకపోవడంతో రాజ్‌కుమార్ ఆమె కోసం స్టేషన్ మొత్తం వెతికాడు. ఎక్కడా ఆచూకీ లభించకపోయే సరికి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్టేషన్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించి ఆమె ట్రైన్ దిగలేదని నిర్ధారించారు.

ఇక వెంటనే నెక్ట్స్ స్టేషన్‌ సిబ్బంది, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న జవోర స్టేషన్‌కు ట్రైన్ చేరుకోవడంతో అప్పటికే అక్కడికి వచ్చిన రైల్వే పోలీసులు రాజ్‌కుమార్ భార్య కోసం వెతకడం స్టార్ట్ చేశారు. వాళ్లు ప్రయాణించిన భోగిలోని వాష్‌రూమ్‌ డోర్ లాక్ చేసి ఉండడంతో దాన్ని పగలగొట్టి చూశారు. అక్కడ అపస్మారక స్థితిలో పడిపోయిన ఉన్న ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు గుండెపోటు కారణంగా మరణించినట్టు నిర్ధారించారు. అది విన్న భర్త కన్నీటి పర్యంతమయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పసికందును బిడ్డకు అప్పజెప్పి పనికి వెళ్లిన తల్లిదండ్రులు..
పసికందును బిడ్డకు అప్పజెప్పి పనికి వెళ్లిన తల్లిదండ్రులు..
చెప్పుకోండి చూద్దాం.! మనుషులను చూసి సిగ్గుపడే జంతువు ఏదో తెల్సా..
చెప్పుకోండి చూద్దాం.! మనుషులను చూసి సిగ్గుపడే జంతువు ఏదో తెల్సా..
పదేళ్ల విధ్వంసాన్ని తుడిచేస్తున్నాం.. అడ్డుపడితే అడ్రస్ లేకుండా..
పదేళ్ల విధ్వంసాన్ని తుడిచేస్తున్నాం.. అడ్డుపడితే అడ్రస్ లేకుండా..
ఏపీ రైతుల కోసం కొత్త యాప్.. అన్నీ ఒకేచోట
ఏపీ రైతుల కోసం కొత్త యాప్.. అన్నీ ఒకేచోట
మీ బంగారు నగలకు పెద్ద శత్రువు ఈ చిన్న పదార్థం ! జస్ట్‌ టచ్‌చేస్తే
మీ బంగారు నగలకు పెద్ద శత్రువు ఈ చిన్న పదార్థం ! జస్ట్‌ టచ్‌చేస్తే
కావ్యా కోసం క్యూ కట్టిన ప్రేమికులు.. స్టేడియంలోనే గులాబీలతో ప్రేమ
కావ్యా కోసం క్యూ కట్టిన ప్రేమికులు.. స్టేడియంలోనే గులాబీలతో ప్రేమ
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
శంషాబాద్‌లో బుల్లెట్ రైళ్ల కోసం భారీ టెర్మినల్.. 600 ఎకరాల్లో..
శంషాబాద్‌లో బుల్లెట్ రైళ్ల కోసం భారీ టెర్మినల్.. 600 ఎకరాల్లో..
ఎండాకాలంలో తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి..
ఎండాకాలంలో తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి..
50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌!
50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌!