AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: పదేళ్ల విధ్వంసాన్ని తుడిచేస్తున్నాం.. అడ్డుపడితే అడ్రస్ లేకుండా చేస్తాం.. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్..

"దేశానికి రెండు కళ్లు గాంధీ, అంబేద్కర్ అయితే.. ఈ ప్రభుత్వానికి వెన్నెముక దళిత, బడుగు బలహీన వర్గాలు అని సీఎం రేవంత్ అన్నారు. అంబేద్కర్ ఆశయాలను కేవలం మాటల్లో కాకుండా, చేతల్లో చూపిస్తున్నామని సీఎం ప్రకటించారు. 87 శాతం ఉద్యోగాలు బడుగులకే దక్కడం నుంచి, దళిత బిడ్డను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం వరకు.. తమ ప్రభుత్వం సాధించిన విజయాలను సీఎం వివరించారు.

Revanth Reddy: పదేళ్ల విధ్వంసాన్ని తుడిచేస్తున్నాం.. అడ్డుపడితే అడ్రస్ లేకుండా చేస్తాం.. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్..
Cm Revanth Reddy
Krishna S
|

Updated on: Apr 14, 2026 | 1:23 PM

Share

భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆ మహనీయునికి సీఎం రేవంత్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ ఆలోచనా విధానమే ఈ ప్రజా పాలనకు పునాది అని స్పష్టం చేశారు. గాంధీజీ శాంతితో యుద్ధాన్ని గెలిస్తే, అంబేద్కర్ రాజ్యాంగంతో దేశ గమనాన్ని మార్చారని కొనియాడారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయగలిగారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో బడుగు బలహీన వర్గాల పాత్ర మరువలేనిదని, పాటతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేసిన గద్దరన్న, జయ జయహే తెలంగాణ గీతాన్ని అందించిన అందేశ్రీ వంటి మన బిడ్డల కృషిని విస్మరించడం ఎవరి తరమూ కాదని అన్నారు.

దళితులకు పెద్దపీట.. అసెంబ్లీలో అరుదైన గౌరవం

గత ప్రభుత్వాలతో పోలిస్తే ఈ ప్రజా ప్రభుత్వంలో దళితులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని సీఎం వివరించారు. ‘‘ఒక దళిత బిడ్డ స్పీకర్ స్థానంలో ఉంటే.. ఆయన్ని గౌరవించకుండా అసెంబ్లీకి రాకుండా కొంతమంది అవమానిస్తున్నారు” అని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. దళిత బిడ్డలు ఆర్థిక, ఆరోగ్య శాఖ వంటి కీలక పదవుల్లో ఉండకూడదా? అని ప్రశ్నించిన ఆయన, దళితులను అవమానించిన వారే నేడు మైక్ కోసం దళితులను అడిగేలా చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు.

విద్యే మా ఆయుధం.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్

విద్య ద్వారానే జీవితాలు మారుతాయన్న అంబేద్కర్ నమ్మకాన్ని నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని సీఎం తెలిపారు. కులాల అంతరం తొలగించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ హాస్టళ్లలో డైట్ ఛార్జీలు పెంచామని, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. సంక్షేమ పథకాల్లోనూ తమ ప్రభుత్వం దూసుకుపోతోందని సీఎం గణాంకాలతో వివరించారు. రెండేళ్లలో ఇచ్చిన 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీలకే దక్కాయన్న సీఎం.. ప్రభుత్వ ఉద్యోగాల్లో 87 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే లభించాయని వెల్లడించారు.

దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి

నియోజకవర్గాల పునర్విభజన పేరుతో కేంద్రంలోని బీజేపీ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని సీఎం ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల సీట్ల కోటా తగ్గించి మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేసేలా కుట్ర జరుగుతోందని, ప్రో రేటా ప్రకారం సీట్ల పెంపు కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.

గోతులు తవ్వేవారిని అక్కడే పాతిపెట్టాలి

‘‘మేం పదేళ్ల విధ్వంసాన్ని సరిదిద్దుతూ నిరంతరం పనిచేస్తుంటే.. వెనక నుంచి కొందరు కుట్రలు చేస్తూ గోతులు తవ్వుతున్నారు. ఆ గోతులు తవ్వే వారిని ఆ గోతిలోనే పాతిపెట్టే బాధ్యత ప్రజలదే’’ అని సీఎం ఘాటుగా హెచ్చరించారు. గత పదేళ్లలో పెద్ద పెద్ద ప్రసంగాలు చేసిన వారు ఒక్కసారైనా అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ప్రజలదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీఎం ముగించారు.

Follow Us
పదేళ్ల విధ్వంసాన్ని తుడిచేస్తున్నాం.. అడ్డుపడితే అడ్రస్ లేకుండా..
పదేళ్ల విధ్వంసాన్ని తుడిచేస్తున్నాం.. అడ్డుపడితే అడ్రస్ లేకుండా..
ఏపీ రైతుల కోసం కొత్త యాప్.. అన్నీ ఒకేచోట
ఏపీ రైతుల కోసం కొత్త యాప్.. అన్నీ ఒకేచోట
ఈ చిన్న పదార్థం మీ బంగారు నగలకు పెద్ద శత్రువు! జస్ట్‌ టచ్‌చేస్తే
ఈ చిన్న పదార్థం మీ బంగారు నగలకు పెద్ద శత్రువు! జస్ట్‌ టచ్‌చేస్తే
కావ్యా కోసం క్యూ కట్టిన ప్రేమికులు.. స్టేడియంలోనే గులాబీలతో ప్రేమ
కావ్యా కోసం క్యూ కట్టిన ప్రేమికులు.. స్టేడియంలోనే గులాబీలతో ప్రేమ
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
శంషాబాద్‌లో బుల్లెట్ రైళ్ల కోసం భారీ టెర్మినల్.. 600 ఎకరాల్లో..
శంషాబాద్‌లో బుల్లెట్ రైళ్ల కోసం భారీ టెర్మినల్.. 600 ఎకరాల్లో..
ఎండాకాలంలో తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి..
ఎండాకాలంలో తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి..
50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌!
50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌!
15 ఏళ్లకే టీమిండియాలోకి సూర్యవంశీ.. సచిన్ రికార్డు బ్రేక్
15 ఏళ్లకే టీమిండియాలోకి సూర్యవంశీ.. సచిన్ రికార్డు బ్రేక్
పాన్ ఇండియా ప్రాజెక్టులో బాలీవుడ్ బ్యూటీ..
పాన్ ఇండియా ప్రాజెక్టులో బాలీవుడ్ బ్యూటీ..