AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: అద్భుతం అంటే ఇదేనేమో.. దేవుడి సాక్షిగా గుండెల్ని హత్తుకునే ఘటన.. వీడియో వైరల్..

నమ్మకం ఉన్నచోట అద్భుతాలు జరుగుతాయని అంటారు.. ఈ సంఘటన చూస్తే అది అక్షర సత్యమనిపిస్తుంది. పవిత్ర వైష్ణో దేవి ఆలయ సన్నిధిలో ఐదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఎక్కడ ఉన్నాడో, ఏమయ్యాడో తెలియని కొడుకు కళ్లముందు ప్రత్యక్షమవ్వగానే ఆ తల్లి ఆవేదన, ఆ సోదరి కళ్ళలో వెల్లువెత్తిన ఆనందం చూస్తే కన్నీళ్లు ఆపుకోవడం ఎవరి వల్ల కాదు. ఈ వీడియోను మీరూ చూడండి..

Video: అద్భుతం అంటే ఇదేనేమో.. దేవుడి సాక్షిగా గుండెల్ని హత్తుకునే ఘటన.. వీడియో వైరల్..
Mother Meets Missing Son After 5 Years
Krishna S
|

Updated on: Apr 14, 2026 | 11:47 AM

Share

కొన్నిసార్లు వాస్తవాలు సినిమాలకంటే అద్భుతంగా ఉంటాయి. నమ్మకం, చెక్కుచెదరని ప్రేమే ఉంటే విధి కూడా తలవంచక తప్పదని నిరూపించే సంఘటన పవిత్ర వైష్ణో దేవి ఆలయ ప్రాంగణంలో చోటుచేసుకుంది. ఐదు సంవత్సరాల క్రితం తప్పిపోయిన తన కొడుకును ఒక తల్లి, సోదరి మళ్లీ కలుసుకున్న దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్‌ను కదిలిస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. ఐదేళ్ల తర్వాత తన కళ్లముందే ఉన్న కొడుకును చూడగానే ఆ తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమె నోట మాట రాలేదు.. కేవలం కన్నీళ్లు మాత్రమే వచ్చాయి. సోదరి తన తమ్ముడిని గట్టిగా కౌగిలించుకుని బావురుమంటూ ఏడుస్తుంటే, అక్కడ ఉన్న భక్తులందరూ ఆ అద్భుతాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. సంవత్సరాల తరబడి గుండెల్లో దాచుకున్న దుఃఖం, నిరాశ ఆ ఒక్క క్షణంలో ఆనందభాష్పాలుగా మారిపోయాయి.

విధి ఆడిన వింత నాటకం

ఈ కొడుకు ఎలా అదృశ్యమయ్యాడనే వివరాలు పూర్తిగా తెలియనప్పటికీ.. ఆ కుటుంబం మాత్రం ఆశ వదులుకోలేదు. ఐదు సంవత్సరాలుగా ప్రతి రోజు, ప్రతి నిమిషం అతని కోసం వెతుకుతూనే ఉన్నారు. ఎక్కడ ఉన్నాడో, ఏమయ్యాడో తెలియని అనిశ్చితిలో కూడా ఆ తల్లి మనసు నా కొడుకు వస్తాడు అని నమ్ముతూనే ఉంది. చివరకు ఆ తల్లి, సోదరి వైష్ణో దేవి దర్శనం కోసం వెళ్లినప్పుడు ఆ అద్భుతం జరిగింది. కోట్లాది మంది భక్తులు సందర్శించే ఆ పవిత్ర క్షేత్రంలో అనుకోకుండా తన సోదరుడిని ఆ సోదరి గుర్తించింది. ఇది కేవలం యాదృచ్చికం కాదు.. ఆ తల్లి ప్రార్థనల ఫలమని నెటిజన్లు అభివర్ణిస్తున్నారు.

నెటిజన్ల రియాక్షన్

ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్దిసేపటికే లక్షలాది వ్యూస్ సాధించింది. ఇది అరుదైన క్షణం అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. తల్లి ప్రేమ ముందు విధి కూడా ఓడిపోయింది అని మరికొందరు రాసుకొచ్చారు. భక్తికి, అనుబంధానికి ఈ సంఘటన ఒక నిలువెత్తు సాక్ష్యమని నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు. జీవితం ఒక్కోసారి చాలా కఠినంగా మారుతుంది. కానీ ఈ కథ మనకు ఒకే ఒక్క విషయాన్ని గుర్తు చేస్తోంది.. అదే నమ్మకం. ఎన్నడూ ఆశ వదులుకోని ఒక తల్లి, విశ్వాసాన్ని కోల్పోని ఒక సోదరి కలిసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.

Follow Us
AP EAPCET 2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే..
AP EAPCET 2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే..
దివ్యౌషధం.. ఉదయాన్నే టిఫిన్‌కు బదులు ఒక్క గ్లాస్ తాగండి చాలు..
దివ్యౌషధం.. ఉదయాన్నే టిఫిన్‌కు బదులు ఒక్క గ్లాస్ తాగండి చాలు..
బంగారం ధరలు మరోసారి పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..
బంగారం ధరలు మరోసారి పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..
కళ్ళజోడు రిటర్న్ చేద్దామనుకున్నాడు.. కస్టమర్‌ కేర్‌కు కాల్ చేశాడు
కళ్ళజోడు రిటర్న్ చేద్దామనుకున్నాడు.. కస్టమర్‌ కేర్‌కు కాల్ చేశాడు
కోట్లు సంపాదించినా సుఖం, సంతోషం లేదు
కోట్లు సంపాదించినా సుఖం, సంతోషం లేదు
మహిళల కోసం కేంద్రం కొత్త పథకం.. ప్రతీ నెలా రూ.7 వేలు
మహిళల కోసం కేంద్రం కొత్త పథకం.. ప్రతీ నెలా రూ.7 వేలు
లక్ష్మీ కటాక్షానికి ముందస్తు సంకేతాలు ఇవేనా? కలల్లో కనిపించే..
లక్ష్మీ కటాక్షానికి ముందస్తు సంకేతాలు ఇవేనా? కలల్లో కనిపించే..
ప్రభుత్వ ఉద్యోగాల్లో హారిజాంటల్‌ రిజర్వేషన్‌ ఎలా అమలు చేస్తారు?
ప్రభుత్వ ఉద్యోగాల్లో హారిజాంటల్‌ రిజర్వేషన్‌ ఎలా అమలు చేస్తారు?
టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. ఏదో తెలుసా?
టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. ఏదో తెలుసా?
వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది.. ఆకలితో ఉన్న సింహం ఎంత పని చేసింది
వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది.. ఆకలితో ఉన్న సింహం ఎంత పని చేసింది