AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ రైతులకు భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి కొత్త యాప్.. ఒకే క్లిక్‌తో అన్నీ..

ఏపీ ప్రభుత్వం రైతులకు సేవలు అందించేందుకు ఒక యాప్ అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రస్తుతం ఇది అందుబాటులో ఉంది. దీని ద్వారా రైతులు సమాచారం మొత్తం ఒకేచోట ఇట్టే తెలుసుకోవచ్చు. వ్యవసాయ అధికారుల చుట్టూ తిరగాల్సిన పని కూడా ఉండదు.

Andhra Pradesh: ఏపీ రైతులకు భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి కొత్త యాప్.. ఒకే క్లిక్‌తో అన్నీ..
Farmers
Venkatrao Lella
|

Updated on: Apr 14, 2026 | 1:22 PM

Share

ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. రైతులకు వేగంగా సేవలు అందించేందుకు ఏపీ ఏఐఎంఎస్-2.0 యాప్ తీసుకొచ్చింది. ఏపీ అగ్రికల్చర్ ఇన్పర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా రైతులు సమగ్ర సమాచారం మొత్తం ఒకేచోట తెలుసుకోవచ్చు. ప్రభుత్వ పథకాల నుంచి సాగు పద్దతుల వరకు ప్రతీది ఒకేచోట తెలుసుకోవచ్చు. ఒకే క్లిక్‌తో రైతులకు ఉపయోగపడే ప్రతీ సమాచారం ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. ఈ యాప్ గురించి వ్యవసాయ సిబ్బంది ప్రతీ రైతుకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ యాప్ ఎలా ఉపయోగించాలనే దానిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీని వల్ల యాప్ సేవలను రైతులు మెరుగ్గా వాడుకునేలా చర్యలు చేపడుతున్నారు.

ఒకే క్లిక్‌తో సమాచారం మొత్తం

రైతులు ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. కేవలం యాప్ ద్వారానే క్షణాల్లో తెలుసుకోవచ్చు. దీని వల్ల గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని తప్పుతుంది. దీంతో రైతులకు సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయి. ఇక వ్యవసాయ సిబ్బంది కోసం రైతులు ఎదురుచూడాల్సిన పని కూడా ఉండదు. వ్యవసాయ సేవలను రైతులకు ఆన్ లైన్ ద్వారా అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈ యాప్ తీసుకొచ్చింది. గతంలోనే ఈ యాప్ తీసుకురాగా.. చాలామంది రైతులకు తెలియకపోవడంతో సేవలు వినియోగించుకోలేకపోతున్నారు. దీంతో రైతులందరూ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం మొబైల్ ఫోన్లకు మెస్సేజ్‌లు పంపుతుంది. దీంతో చాలామంది రైతులు యాప్ వాడుతున్నారని చెప్పవచ్చు.

యాప్ ఫీచర్లు ఇవే..

-ఏ సమయంలో పంటలు వేస్తే మంచిదనే సలహాలు, సూచనలు అందిస్తారు

-స్థానిక వ్యవసాయ అధికారుల ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంటాయి.

-తెగుళ్ల నివారణ, మందులకు సంబంధించిన వివరాలు ఉంటాయి

-ప్రభుత్వ పథకాలు, సబ్సిడీల సమాచారం ఉంటుంది

-ఇక అకాల వరదలు, వర్షాల సమయంలో పంట నష్టాన్ని అంచనా వేయవచ్చు

-యాప్ ద్వారా అధికారులకు ఫిర్యాదులు చేయవచ్చు

-స్ధానిక మార్కెట్లో ధరల వివరాలు తెలుసుకోవచ్చు

రిజిస్ట్రేషన్ ఎలా..?

-గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏపీ ఎఐఎంఎస్-2.0 యాప్ ఇన్‌స్టా్ల్ చేసుకోండి

-సమీపంలోని రైతు సేవా కేంద్రానికి వెళ్లండి

-మీ వివరాలతో అధికారులు రిజిస్ట్రేషన్ చేస్తారు

-ఒక ఐడీ, పాస్ వర్డ్ క్రియేట్ చేసి ఇస్తారు

-ఐడీ, పాస్ వర్డ్ ఆధారంగా మీరు యాప్‌లోకి లాగిన్ అయ్యి సేవలు పొందవచ్చు

-యాప్‌ను రైతులు డౌన్ లోడ్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది

Follow Us
ఏపీ రైతుల కోసం కొత్త యాప్.. అన్నీ ఒకేచోట
ఏపీ రైతుల కోసం కొత్త యాప్.. అన్నీ ఒకేచోట
ఈ చిన్న పదార్థం మీ బంగారు నగలకు పెద్ద శత్రువు! జస్ట్‌ టచ్‌చేస్తే
ఈ చిన్న పదార్థం మీ బంగారు నగలకు పెద్ద శత్రువు! జస్ట్‌ టచ్‌చేస్తే
కావ్యా కోసం క్యూ కట్టిన ప్రేమికులు.. స్టేడియంలోనే గులాబీలతో ప్రేమ
కావ్యా కోసం క్యూ కట్టిన ప్రేమికులు.. స్టేడియంలోనే గులాబీలతో ప్రేమ
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
శంషాబాద్‌లో బుల్లెట్ రైళ్ల కోసం భారీ టెర్మినల్.. 600 ఎకరాల్లో..
శంషాబాద్‌లో బుల్లెట్ రైళ్ల కోసం భారీ టెర్మినల్.. 600 ఎకరాల్లో..
ఎండాకాలంలో తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి..
ఎండాకాలంలో తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి..
50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌!
50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌!
15 ఏళ్లకే టీమిండియాలోకి సూర్యవంశీ.. సచిన్ రికార్డు బ్రేక్
15 ఏళ్లకే టీమిండియాలోకి సూర్యవంశీ.. సచిన్ రికార్డు బ్రేక్
పాన్ ఇండియా ప్రాజెక్టులో బాలీవుడ్ బ్యూటీ..
పాన్ ఇండియా ప్రాజెక్టులో బాలీవుడ్ బ్యూటీ..
హైదరాబాద్ బిర్యానీ కోసం వేల కిలోమీటర్లు దాటి.. ఫారిన్ టూరిస్టుల..
హైదరాబాద్ బిర్యానీ కోసం వేల కిలోమీటర్లు దాటి.. ఫారిన్ టూరిస్టుల..