AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: కోడి పుంజు అదోలా అరుస్తూ కనిపించింది.. ఏంటని తొంగి చూడగా.. వామ్మో.!

విశాఖలోని ఓ కుటుంబానికి కోళ్లు పెంపకం ఓ హాబీ. రకరకాల కోళ్లు ఒకే చోట మనకు చూసేందుకు కనిపిస్తూ ఉంటాయి. ఆ కోళ్లు పక్షుల అరుపులు లేకపోతే ఆ కుటుంబానికి రోజు గొడవదు. కానీ ఓ రోజు.. ఓ కోడిపుంజు వింతగా అరుస్తోంది. అదేపనిగా ఆ పుంజు ఎందుకు అరుస్తుందో ఆ కుటుంబానికి అర్థం కాలేదు.

Andhra: కోడి పుంజు అదోలా అరుస్తూ కనిపించింది.. ఏంటని తొంగి చూడగా.. వామ్మో.!
Andhra News
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Apr 14, 2026 | 8:21 AM

Share

విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలోని వెంకటపురం గ్రామంలో గట్టెం బాబురావు కుటుంబం నివాసం ఉంటుంది. ఆ ఫ్యామిలీకి పెంపుడు జంతువులంటే మహా ఇష్టం. వాటిల్లోనూ పక్షు జాతులను ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. రకరకాల కోళ్లు, కోడిపుంజులు అక్కడ చూసేందుకు కనిపిస్తాయి. నాటు కోళ్లు, గిరిరాజా కోళ్లు, కడకనాథ్, పందెం కోళ్లతో పాటు.. మరికొన్ని రకాల పక్షులు కూడా అక్కడ ఉంటాయి. వాటిని.. పెంచుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది ఆ కుటుంబం. ఉదయం లేచిన దగ్గర్నుంచి.. రాత్రి నిద్రపోయే వరకు ఆ కోళ్ల శబ్దాలు లేనిదే వారికి రోజు గడవదు. అయితే.. రోజులు మాదిరిగానే కోళ్లకు దానా వేశారు. అన్ని కోళ్లు దానా తిన్నాయి. ప్రశాంతంగా ఉన్నాయి. ఇంతలో ఒక్కసారిగా ఓ పుంజు.. వింతగా అరవడం ప్రారంభించింది. ఆ అరుపులు విని మిగతా కోళ్లు కూడా అరవడం మొదలుపెట్టాయి. ఇంతలో తేరుకున్నా బాబురావు కుటుంబం.. ఇంటి నుంచి బయటికి వచ్చింది. బాబురావుకు కూడా అంటే ఎంత ఇష్టమో.. అతనికి ఉన్న ఇద్దరు కుమార్తెలు కూడా తండ్రికి తగ్గట్టుగానే కంటికి రెప్పలా ఆ కోళ్లను కాపాడుకుంటూ ఉంటారు. సమయానికి దానా వేయడం.. వాటి బాగోగులు చూసుకోవడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఆ మూగజీవాలను భావిస్తూ ఉంటారు. అయితే ఆ కోడిపుంజు వింతగా అరవడంతో దగ్గరకు వెళ్లి చూశారు. కోడిపుంజుతోపాటు ఆ జాలిలో ఏదో ఉంది. ఆ పుంజు ఎగిరిగెంతుతూ కనిపించింది. బయటకు వచ్చేందుకు కోడిపుంజు ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యపడలేదు.

ఆ కోడిపుంజు ఎందుకు హడలెత్తిపోతుందా అని దగ్గరికి వెళ్లి కాపాడే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ కనిపించిన సీన్‌కు ఒక్కసారిగా షాక్ అయింది. ఒక్కసారిగా అడుగు వెనక్కు పడింది. అక్కడ ఉన్నదేంటో తెలుసా..? ఓ భారీ నాగుపాము..! ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎలా చేరిందో కానీ.. సన్నటి జాలి నుంచి లోపలికి చొరబడింది. దీంతో జాలిలో ఉన్న ఆ కోడిపుంజు హడలెత్తిపోయింది. ఈ క్రమంలో కోడిపుంజు తప్పించుకుని ప్రయత్నించింది. పాము కూడా.. కోడిపుంజు భారీ నుంచి భయపడి బయటకు వెళ్లేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో ఒకే జాలీలో ఒకవైపు పాము, మరోవైపు కోడిపుంజు.. ఒకరిపై ఒకరు భయంతో హడలెత్తాయి.

ఈ క్రమంలో నాగుపాము తనకు తాను రక్షించుకునేందుకు.. సహజంగా ప్రవర్తించింది. పడగ విప్పి, బుసలు కొట్టి తనకు తాను రక్షించుకునే క్రమంలో కోడిపుంజును కాటేసింది. దీంతో అప్పటికే ఎగిరి పడుతూ నాగుపాము నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన కోడిపుంజు.. చివరకు ప్రాణాలు విడిచింది. కళ్ళముందే తమ కోడిపుంజు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ.. ఏమి చేయాలని మీ సహాయ స్థితిలో ఉంది ఆ కుటుంబం. ఎంతో ప్రేమగా పెంచుకున్న ఆ కోడిపుంజు నాగుపాము కాటుతో ప్రాణాలు కోల్పోవడంతో నా కుటుంబ సభ్యులకు గుండె చివుక్కుమంది. ఒకవైపు కోడిపుంజు ప్రాణాలు కోల్పోయిందన్న బాధలో ఉన్నప్పటికీ.. విష సర్పానికి ఇటువంటి హాని తలపెట్టలేదు ఆ కుటుంబం. ఒకానొక సమయంలో జాలిలో చిక్కుకుని ఆ పాము విలవిల్లాడింది. నెమ్మదిగా ఆ జాలి నుంచి ఆ పామును తప్పించి.. సేఫ్‌గా పొదల్లోకి వెళ్లిపోయేలా చేశారు. ప్రాణానికి ప్రాణం అన్నది సరికాదు అని భావించి.. ఆ నాగుపామును అక్కడ నుంచి తరిమేశారు. అది విష సర్పమే అయినప్పటికీ.. ప్రాణ హాని తలపెట్టకుండా పంపేశారు. అయితే మరోసారి.. ఇలాంటి ఘటనలు జరగకుండా.. పాములు రాకుండా అవసరమైన అన్ని జాగ్రత్త తీసుకుంటున్నామని పేర్కొంది ఆ కుటుంబం.

ఇది చదవండి: ప్రామిసరీ నోటు మీద ఈ ఒక్కటి రాయకపోతే.. మీ డబ్బు అస్సలు తిరిగిరాదు..

Follow Us