AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: ఈ వేసవిలో తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. మే 1 నుంచి మారనున్న దర్శనం రూల్స్.. కొత్త విధానం అమలు..

తిరుమల శ్రీవారి దర్శనానికి ఈ వేసవిలో వెళ్తున్నారా.. అయితే మీకు అలర్ట్. మే 1 నుంచి కొత్త దర్శనం రూల్స్ ప్రవేశపెట్టేందుకు టీటీడీ సిద్దమవుతోంది. వీఐపీ బ్రేక్ దర్శనానిని రద్దు చేయాలని భావిస్తోంది. అలాగే ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీని కూడా నిలిపివేయనుంది తెలుస్తోంది.

Tirumala: ఈ వేసవిలో తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. మే 1 నుంచి మారనున్న దర్శనం రూల్స్.. కొత్త విధానం అమలు..
Tirumala
Venkatrao Lella
|

Updated on: Apr 14, 2026 | 12:28 PM

Share

తిరుమల శ్రీవారి దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు అలర్ట్. టీటీడీ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. వేసవి సెలవుల కారణంగా తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవులు రావడంతో తమ పిల్లలతో సహా తల్లిదండ్రులు శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. దీంతో తిరుమలలో రద్దీ పెరగ్గా.. టీటీడీ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా సామాన్యులకు ఎక్కువమందికి దర్శన భాగ్యం కల్పించేందుకు కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్దమవుతోంది. వేసవిలో వీఐపీ దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ భావిస్తోంది. వేసవికాలం ఈ మూడు నెలల పాటు రద్దు చేయాలని చూస్తోంది.

మే 1 నుంచి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు

ఇక మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనంతో పాటు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేయాలని టీటీడీ భావిస్తోంది. ప్రస్తుతం ఎస్‌ఎస్‌డీ టోకెన్ల దర్శనానికి 23 గంటల సమయం పడుతుంది. అదే వీఐపీ బ్రేక్ దర్శనానిని రద్దు చేసి సామాన్యులకు అవకాశం కల్పిస్తే త్వరగా సామాన్యులకు దర్శనం పూర్తవుతుంది. సుమారు 8 నుంచి 12 గంటల్లోనే దర్శనం చేసుకోవచ్చు. ఈ విధానం వల్ల రోజుకు 80 వేల మందికి దర్శనం కల్పించవచ్చని టీటీడీ అంచనా వేసింది. వివిధ దర్శనాలను పక్కన పెట్టి వైకుంఠ ఏకాదశి సందర్బంగా అనుసరించిన విధానాన్ని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాలకు రోజు 2 నుంచి 3 గంటల సమయం కేటాయిస్తున్నారు. దీనిని రద్దు చేస్తే ఆ సమయంలో 15 వేల మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించవచ్చు. వేసవిలో రద్దీ కారణంగా సామాన్యుల దర్శనానికి ప్రయారిటీ ఇవ్వాలని టీటీడీ ఆలోచిస్తోంది.

ఒకే కేటగిరీ కింద దర్శనం

మిగతా కేటగిరీల దర్శనాన్ని రద్దు చేసి ఒకే కేటగిరీ కింద దర్శనం కల్పించడం వల్ల భక్తులకు నిరీక్షించే సమయం తగ్గుతుంది. దీని వల్ల దర్శనాల్లో వేగం కూడా పెరుగుతుంది. సామాన్య భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటున్నారు. దీంతో వారికి ఊరట కలిగించే ఈ నిర్ణయాన్ని పరిశీలిస్తున్నారు. ఇందుకోసం గత మూడేళ్లలో వేసవికాలంలో భక్తుల రద్దీని పరిశీలిస్తోంది. మే, జూన్, జులైలో ప్రతీ నెలా 23 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నట్లు గుర్తించారు. కాగా ఈ ఏడాది వేసవిలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముంది. దీంతో టీటీడీ ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటోంది.

Follow Us
పాలు, పెరుగు కలిపి తింటే ఏమవుతుంది..? ఓర్నాయనో.. పెద్ద కథే ఉందిగా
పాలు, పెరుగు కలిపి తింటే ఏమవుతుంది..? ఓర్నాయనో.. పెద్ద కథే ఉందిగా
మీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ ఉందా? రూ.50 లక్షలు వస్తాయని తెలుసా?
మీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ ఉందా? రూ.50 లక్షలు వస్తాయని తెలుసా?
పిల్లలు వద్దనుకోవడం నిజంగా పాపమా? అసలు నిజం ఏమిటి?
పిల్లలు వద్దనుకోవడం నిజంగా పాపమా? అసలు నిజం ఏమిటి?
10 ఏళ్ల నాటి సీన్ రిపీట్.. హైదరాబాద్‌దే ట్రోఫీ.. ఇదిగో సాక్ష్యం
10 ఏళ్ల నాటి సీన్ రిపీట్.. హైదరాబాద్‌దే ట్రోఫీ.. ఇదిగో సాక్ష్యం
రోజంతా ఫోన్ చేతిలోనే ఉంటుందా..? మీ శరీరం ఇచ్చే 4 డేంజర్ సిగ్నల్స్
రోజంతా ఫోన్ చేతిలోనే ఉంటుందా..? మీ శరీరం ఇచ్చే 4 డేంజర్ సిగ్నల్స్
సంపద వరదలా వచ్చే గజకేసరి యోగం.. ఈ లక్కీ రాశుల్లో మీరు ఉన్నారా..?
సంపద వరదలా వచ్చే గజకేసరి యోగం.. ఈ లక్కీ రాశుల్లో మీరు ఉన్నారా..?
గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జూన్ 30లోగా ఇది చేయకపోతే..
గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జూన్ 30లోగా ఇది చేయకపోతే..
నాగార్జున నా ముఖం మీద సిగరెట్ పొగ ఊది ఐలవ్యూ చెప్పాడు
నాగార్జున నా ముఖం మీద సిగరెట్ పొగ ఊది ఐలవ్యూ చెప్పాడు
తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఎస్బీఐ అప్రెంటీస్ ఖాళీలు.. స్టైపెండ్..
తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఎస్బీఐ అప్రెంటీస్ ఖాళీలు.. స్టైపెండ్..
హైదరాబాద్‌లో లాయర్ దారుణ హత్య.. కారు ఎక్కుతుండగా..
హైదరాబాద్‌లో లాయర్ దారుణ హత్య.. కారు ఎక్కుతుండగా..