AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: మీకు తెలియకుండా మీ ఆధార్ ఎవరైనా ఉపయోగించారా..? మీ మొబైల్‌ ద్వారా సెకన్లలో ఇట్టే తెలుసుకోవచ్చు..

ఇటీవల ఆధార్ కార్డు జిరాక్సులతో మోసాలు జరుగుతున్నాయి. ఒక వ్యక్తి ఆధార్ జిరాక్సులను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు అనేక నేరాలకు పాల్పడుతున్నారు. దీనిని గుర్తించేందుకు యూఐడీఏఐ అనేక ఆప్షన్లు అందిస్తోంది. దీని ద్వారా మీ ఆధార్ ఎవరైనా ఉపయోగిస్తే వెంటనే తెలుసుకోవచ్చు.

Aadhaar Card: మీకు తెలియకుండా మీ ఆధార్ ఎవరైనా ఉపయోగించారా..? మీ మొబైల్‌ ద్వారా సెకన్లలో ఇట్టే తెలుసుకోవచ్చు..
Aadhaar Card
Venkatrao Lella
|

Updated on: Apr 14, 2026 | 11:51 AM

Share

ఆధార్ కార్డు అనేది ఎంత ముఖ్యమైన డాక్యుమెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభుత్వ సర్వీసులకే కాకుండా ప్రైవేట్ సేవలు పొందాలన్నా ఇది తప్పనిసరి అయింది. ఈ కార్డు లేనిది ఏ పని జరగడం లేదు. సిమ్ కార్డు పొందటం దగ్గర నుంచి హోటల్‌లో చెకింగ్ వరకు ప్రతీ పనికి ఆధార్ ఉపయోగపడుతోంది. అందుకే ఆధార్‌ను ఎల్లప్పుడూ మన వెంటే ఉంచుకోవాల్సి వస్తుంది. అయితే ఆధార్‌ను ఉపయోగించి అనేక మోసాలు కూడా జరుగుతున్నాయి. వీటిని నివారించి ఆధార్‌కు భద్రత కల్పించేందుకు యూఐడీఏఐ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా అనేక భద్రతా ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ల ద్వారా మీకు తెలియకుండా మీ ఆధార్ ఎవరైనా ఉపయోగించినా వెంటనే తెలుసుకోవచ్చు. అదెలా అనేది చూద్దాం.

ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ

యూఐడీఏఐ తన వెబ్ సైట్, యాప్‌లో ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ ఫీచర్ గతంలో తీసుకొచ్చింది. దీని ద్వారా మీరు ఆధార్‌ను ఎక్కడెక్కడ ఉపయోగించారు..? దేని కోసం వినియోగించారు..? ఎప్పుడు ఉపయోగించారు? అనే వివరాలు ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. దీని ద్వారా మీకు తెలియకుండా మీ ఆధార్‌ను ఎవరైనా ఉపయోగించి ఉంటే తెలిసిపోతుంది. దీంతో మీరు వెంటనే మీ ఆధార్ బయెమెట్రిక్ వివరాలను లాక్ చేసుకోవడం వల్ల మీరు ఆధార్‌ను వేరేవారు ఉపయోగించకుండా చర్యలు తీసుకోవచ్చు. ఐరిస్, వేలిముద్రలు, ఓటీపీ వెరిఫికేషన్ వంటి ట్రాక్ రికార్డులను మీరు తెలుసుకోవచ్చు. దీని వల్ల మీ ఆధార్‌ను వేరేవారు ఉపయోగించుకోకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

హిస్టరీ తెలుసుకోవడం ఎలా..?

-గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎంఆధార్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోండి

-మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి

-హోమ్ పేజీలో మై ఆధార్ అనే ఆప్షన్ ఎంచుకోండి

-మీ పిన్ నెంబర్ ఎంటర్ చేయండి

-ఆధార్ అథెంటిఫికేషన్ హిస్టరీ ట్యాబ్‌పై క్లిక్ చేయండి

-మీరు ఏ తేదీలకు సంబంధించిన హిస్టరీని తెలుసుకోవాలనుకుంటున్నారనే వివరాలను సెలక్ట్ చేసుకోండి

-మీ ఆధార్ ఎక్కడెక్కడ వాడారనే వివరాలు అందుతాయి

ఫిర్యాదు చేయండి

ఒకవేళ మీకు తెలియకుండా మీ ఆధార్ ఎక్కడైనా ఉపయోగించినట్లు తెలిస్తే వెంటనే యూఐడీఏఐ హెల్ప్ లైన్ నెంబర్‌కు ఫిర్యాదు చేయండి. 1947 నెంబర్‌కి ఫిర్యాదు చేయండి. ఇక వెంటనే మీ ఆధార్ బయెమెట్రిక్స్‌ను లాన్ చేసుకోండి. దీని వల్ల మీ ఆధార్‌ను ఇతరులు ఉపయోగించకుండా అడ్డుకోవచ్చు. మీరు ఎప్పటికప్పుడు ఇలా హిస్టరీ చెక్ చేసుకుంటూ ఉండాలి. దీని వల్ల మీ ఆధార్ సురక్షితంగా ఉంటుంది.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..