AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Praful Hinge vs Hardik Pandya : ప్రఫుల్ హింగే వర్సెస్ హార్దిక్ పాండ్యా.. 100 రోజుల క్రితం ఆ ఇద్దరి మధ్య ఏం జరిగింది?

Praful Hinge vs Hardik Pandya : సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బౌలర్ ప్రఫుల్ హింగే, హార్దిక్ పాండ్యా మధ్య ఉన్న వైరల్ సీక్రెట్ ఏంటో తెలుసా? 100 రోజుల క్రితం విజయ్ హజారే ట్రోఫీలో అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది?

Praful Hinge vs Hardik Pandya : ప్రఫుల్ హింగే వర్సెస్ హార్దిక్ పాండ్యా.. 100 రోజుల క్రితం ఆ ఇద్దరి మధ్య ఏం జరిగింది?
Praful Hinge Vs Hardik Pandya
Rakesh
|

Updated on: Apr 14, 2026 | 11:38 AM

Share

Praful Hinge vs Hardik Pandya : ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కనుగొన్న అద్భుత ఆణిముత్యం ప్రఫుల్ హింగే. తన అరంగేట్రం మ్యాచ్‌లోనే, అది కూడా వేసిన మొదటి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన ఈ కుర్రాడి పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. అయితే ప్రఫుల్ హింగేకు, టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు మధ్య ఉన్న ఒక ఆసక్తికరమైన అనుబంధం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సరిగ్గా 100 రోజుల క్రితం వీరిద్దరి మధ్య జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విజయ్ హజారే ట్రోఫీలో ఆసక్తికర పోరు

సరిగ్గా 100 రోజుల క్రితం, అంటే జనవరి 3, 2026న విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ, బరోడా మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఆ మ్యాచ్‌లో బరోడా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. అప్పుడు విదర్భ కెప్టెన్ హర్ష్ దూబే బంతిని యువ పేసర్ ప్రఫుల్ హింగేకు ఇచ్చాడు. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న హార్దిక్ పాండ్యాకు బౌలింగ్ చేయాలంటే ప్రఫుల్ మొదట కాస్త కంగారు పడ్డాడు. కానీ, తనలోని భయాన్ని వదిలేసి కట్టుదిట్టమైన యార్కర్లు, ఖచ్చితమైన బౌన్సర్లతో హార్దిక్‌ను ఇబ్బంది పెట్టాడు.

హార్దిక్ పాండ్యా జోస్యం

ప్రఫుల్ హింగే వేస్తున్న బంతులను చూసి హార్దిక్ పాండ్యా ఆశ్చర్యపోయాడు. ఒక యంగ్ బౌలర్ అంత వేగంతో, అంత కంట్రోల్‌తో బౌలింగ్ చేయడం హార్దిక్‌ను బాగా ఆకట్టుకుంది. ఆ మ్యాచ్‌లో హార్దిక్ ఏకంగా 133 పరుగులు చేసినప్పటికీ, ప్రఫుల్ బౌలింగ్ స్టైల్ అతనికి నచ్చింది. దీంతో హార్దిక్ తన క్రీడా స్ఫూర్తిని చాటుకుంటూ.. మ్యాచ్ మధ్యలోనే ప్రఫుల్‌ను ఉద్దేశించి ఐపీఎల్‌లో కలుద్దాం అని అన్నాడు. హార్దిక్ అన్న మాటే నిజమైంది. కొన్ని రోజులకే ఐపీఎల్ వేలంలో ప్రఫుల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.

ఏప్రిల్ 29న అసలైన యుద్ధం

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తన డెబ్యూ మ్యాచ్‌లోనే ప్రఫుల్ హింగే చారిత్రాత్మక ప్రదర్శన చేశాడు. తన మొదటి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసి ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ లాంటి స్టార్ బ్యాటర్‌ను మొదటి బంతికే బౌన్సర్‌తో బోల్తా కొట్టించాడు. ఇప్పుడు అందరి కళ్లు ఏప్రిల్ 29న జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ మ్యాచ్‌పై ఉన్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రఫుల్ హింగే తన బంతులతో హార్దిక్ పాండ్యాను ఎలా ఎదుర్కొంటాడనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!