AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: అర్థరాత్రి పొలాల్లొని గుడిసెలోంచి గట్టిగా కేకలు.. ఉదయాన్నే వెళ్లి చూడగా..

మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఒంటరిగా నివస్తున్న ఓ 90 ఏళ్ల వృద్ధురాలిపై కొందరు గుర్తుతెలియని దుండగులు సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Crime News: అర్థరాత్రి పొలాల్లొని గుడిసెలోంచి గట్టిగా కేకలు.. ఉదయాన్నే వెళ్లి చూడగా..
90 Year Old Woman Assault
Anand T
|

Updated on: Mar 08, 2026 | 12:27 PM

Share

తల్లి వయస్సులో ఉన్న ఓ 90 ఏళ్ల వృద్దురాలిపై కొందరు మానవమృగాలు అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్య ప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రం నుండి దాదాపు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మారుమూల గ్రామానికి చెందిన ఓ 90 ఏళ్ల వృద్దురాలు తన వ్యవసాయ పొలం మధ్యలో ఓ చిన్న గుడిసె వేసుకొని నివాసం ఉంటుంది. అయితే ఇటీవల ముసుగులు దరించి అటుగా వచ్చిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఒంటరిగా ఉన్న వృద్దిరాలి గుడిసెలోకి చొరబడి ఆమెపై దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను సామాహిక అత్యాచారం చేసి అక్కడి నుంచి పారిపోయారు.

దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన వృద్దురాలు మరుసరి రోజు సమీప గ్రామంలో నివసిస్తున్న తన కుమార్తెకు విషయం చెప్పడంతో ఆమె వెంటనే తల్లిని స్థానిక హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికత్స చేయించింది. అయితే వృద్దురాలికి వైద్యం చేసిన డాక్టర్లకు అనుమానం రావడంతో విషయం తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితురాలి నుంచి వివరాలు సేకరించి ఘటనపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 70 కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు సూపరింటెండెంట్ నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుల ఆనవాళ్లు గుర్తించేందుకు ఫోరెన్సిక్‌ టీంతో ఘటనా స్థలానికి పరీశీలించారు పోలీసులు. నిందితులకు సంబంధించి కొన్ని వివరాలతో పాటు వారిని పట్టుకునేందుకు సహకరించిన వారికి రూ. 10,000 బహుమతిని అందిస్తామని రివార్డ్ ప్రకటించారు పోలీసులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us