రోజూ ఒక కప్పు బొబ్బర్లు తింటే ఆ రోగాలన్నీ మాయం!

26 May 2026

Jyothi Gadda

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. నిత్యం మనకు లభించే గింజ ధాన్యాలలో బొబ్బర్లు (అలసందలు) అత్యంత పోషక విలువలు కలిగినవి.

వీటిలో విటమిన్ బి9, విటమిన్లు ఎ, కె, బి1 లతో పాటు మాంగనీస్, కాపర్, ఐరన్, మెగ్నిషియం, ఫాస్ఫరస్, జింక్, పొటాషియం, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

బొబ్బర్లలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని అద్భుతంగా పెంచుతుంది. ఇది కడుపులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి సహాయపడుతుంది. ఫలితంగా మలబద్ధకం దూరం చేస్తుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

ఉడికించిన బొబ్బర్లలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీనివల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు, తద్వారా తక్కువ ఆహారం తీసుకుని సులభంగా బరువు తగ్గవచ్చు.

అలాగే, ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇది హార్ట్ ఎటాక్ రాకుండా గుండెను రక్షిస్తుంది.

బొబ్బర్లలో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగుపరిచి హైబీపీని అదుపులో ఉంచుతుంది. అలాగే, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడానికి ఒక మంచి మెడిసిన్‌లా పనిచేస్తాయి.

బొబ్బర్లలో ఫోలేట్ అధికంగా ఉండటం వల్ల గర్భంలో శిశువు ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది. రక్తహీనత (Anemia) సమస్యను తగ్గిస్తుంది. 

అంతేకాకుండా, ఇందులోని విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచి, ముఖానికి సహజమైన మెరుపును ఇస్తాయి. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది.