4 ఏళ్ల వయసులోనే లైంగిక వేధింపులు.. ఇప్పుడు నా బాడీపై ఎలాంటి మోహం లేదు

26 Mayl 2026

Basha Shek

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చాలామంది సినీతారలు చెబుతుంటారు. ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది.

చైనాలో ఎంబీబీఎస్ చదివిన ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో డాక్టర్‌గా సేవలందించారు. అయితే సినిమాలపై ఇష్టంతో డాక్టర్ కెరీర్‌ను పక్కనపెట్టేసింది.

మా ఊరి పొలిమేర సినిమాలో డీగ్లామర్ రోల్ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది కామాక్షి భాస్కర్ల. ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా, సహాయక నటిగానూ మెప్పించిందీ అందాల తార.

అయితే ఈ మధ్యన ఉన్నట్లుండి సినిమాలకు విరామం ప్రకటించింది కామాక్షి. ఇందుకు కచ్చితమైన కారణేమంటో చెప్పలేదు కానీ మానసిక ప్రశాంతత కోసమే ఈ బ్రేక్ అని చెప్పుకొచ్చింది.

అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ తన పర్సనల్ లైఫ్ లో ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ను చెబుతూ బాగా ఎమోషనలైంది.

 'నాకు 3 బ్రేకప్స్ అయ్యాయి.. అవన్నీ కూడా పరస్పర అంగీకారంతోనే జరిగినవే' అంటూ తన లవ్ ఫెయిల్యూర్స్ గురించి చెప్పింది కామాక్షి భాస్కర్ల.

4 ఏళ్ల వయసులోనే నేను లైంగిక వేధింపులకు గురయ్యానని,  టీనేజ్‌లో కూడా మూడేళ్ల పాటు వేధింపులను ఎదుర్కొన్నానని వాపోయిందీ అందాల తార.

 చిన్న వయసులోనే ఇలాంటి  పరిస్ధితులను ఎదుర్కొన్న అమ్మాయికి బాడీ మీద ఎలాంటి మొహం ఉంటుంది? అంటూ భావోద్వేగానికి లోనైంది కామాక్షి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.