AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుట్టింటికి వెళ్లి ముఖం చాటేసిన భార్య.. ముగ్గురు పిల్లల కన్నీరు చూడలేకపోయిన తండ్రి ఏం చేశాడంటే!

ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో ఒక తీవ్ర విషాదకర సంఘటన వెలుగుచూసింది. అత్తగారింటికి తిరిగి రావడానికి భార్య నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఒక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కోత్వాలి సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దారానగర్ గ్రామంలో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పుట్టింటికి వెళ్లి ముఖం చాటేసిన భార్య.. ముగ్గురు పిల్లల కన్నీరు చూడలేకపోయిన తండ్రి ఏం చేశాడంటే!
Man Suicide
Balaraju Goud
|

Updated on: May 26, 2026 | 1:58 PM

Share

ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో ఒక తీవ్ర విషాదకర సంఘటన వెలుగుచూసింది. అత్తగారింటికి తిరిగి రావడానికి భార్య నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఒక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కోత్వాలి సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దారానగర్ గ్రామంలో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… దారానగర్‌కు చెందిన ఇంతేజార్ అనే వ్యక్తి జీవనోపాధి కోసం కాశ్మీర్‌లోని ఒక సెలూన్‌లో పనిచేస్తున్నాడు. అతని భార్య ఫాతిమా, ముగ్గురు పిల్లలతో కలిసి దారానగర్‌లోని అత్తగారింట్లోనే నివసిస్తోంది. అయితే, రెండు నెలల క్రితం ఫాతిమా తండ్రి మరణించారు. ఆ వార్త వినగానే ఇంతేజార్ కాశ్మీర్ నుండి సొంతూరికి తిరిగి వచ్చాడు.

కానీ, ఇంటికి వచ్చిన ఇంతేజార్‌కు ఊహించని షాక్ తగిలింది. భార్య ఫాతిమా తన ఎనిమిదేళ్లు, ఐదేళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలను, ఆరు నెలల పసికందు అయిన కుమారుడిని అత్తగారింట్లోనే వదిలేసి, తన పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లి లేకపోవడంతో చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఏడవడం చూసి ఇంతేజార్ మనసు వికలమైంది. పిల్లల కోసం, సంసారం కోసం భార్యను తిరిగి తీసుకురావాలని ఇంతేజార్ దాదాపు నాలుగైదు సార్లు ఆమె పుట్టింటికి వెళ్లాడు.

అయితే, ప్రతిసారీ ఫాతిమా అతనితో రావడానికి నిరాకరించింది. భర్త తనకు సరిగ్గా డబ్బులు ఇవ్వడం లేదని, తాను పేదరికంలో మగ్గుతున్నానని ఆమె ఆరోపించింది. దీనికి భిన్నంగా, తాను కష్టపడి సంపాదించిన డబ్బునంతా ఆమెకే పంపిస్తున్నానని ఇంతేజార్ వాదించాడు. ఎన్నిసార్లు నచ్చజెప్పినా, పంచాయితీలు పెట్టినా ఫాతిమా అత్తగారింటికి రావడానికి ససేమిరా అంది.

భార్య ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇంతేజార్ గత కొన్ని రోజులుగా తీవ్ర మౌనంలోకి జారుకున్నాడు. ఈ క్రమంలో, సోమవారం (మే 25) సాయంత్రం అతని ఎనిమిదేళ్ల కుమార్తె తండ్రి కోసం టీ తీసుకుని గదిలోకి వెళ్లింది. అక్కడ తండ్రి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతుండటం చూసి ఆ చిన్నారి గట్టిగా కేకలు వేసింది. కూతురి అరుపులు విని కుటుంబ సభ్యులు పరుగెత్తుకొచ్చి, ఇంతేజార్‌ను కిందకు దించారు. కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు.

సమాచారం అందుకున్న బిజ్నోర్ నగర పోలీస్ చీఫ్ రామ్‌ప్రతాప్ సింగ్, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్థల వల్లే ఇంతేజార్ కాశ్మీర్‌కు కూడా తిరిగి వెళ్లలేకపోయాడని, తీవ్ర మానసిక ఒత్తిడి, నిరాశతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us