AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాస్‌పోర్ట్‌కి అప్లై చేయాలా? త్వరపడండి.. జులై 1 నుంచి ఫీజులు పెరుగుతున్నాయ్‌!

పాస్‌పోర్ట్‌కి అప్లై చేయాలా? త్వరపడండి.. జులై 1 నుంచి ఫీజులు పెరుగుతున్నాయ్‌!

Phani CH
|

Updated on: Jun 27, 2026 | 5:50 PM

Share

జూలై 1, 2026 నుంచి పాస్‌పోర్ట్ దరఖాస్తు, రీ-ఇష్యూ ఫీజులను కేంద్ర ప్రభుత్వం పెంచుతోంది. కొత్త నిబంధనల ప్రకారం సాధారణ, తత్కాల్ పాస్‌పోర్ట్ సేవల ఛార్జీలు పెరగనున్నాయి. అయితే 8 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వారికి తాజా పాస్‌పోర్ట్ దరఖాస్తుపై 10 శాతం రాయితీ ఉంటుంది. జూన్ 30లోపు దరఖాస్తు చేసుకుంటే పాత ఫీజులే వర్తిస్తాయి.

పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫీజులను పెంచుతూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాస్‌పోర్ట్ సవరణ నిబంధనలు–2026 లో భాగంగా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం జూలై 1, 2026 నుంచి కొత్త ఫీజులు అమలులోకి రానున్నాయి.ఈ పెంపు వల్ల సాధారణ పాస్‌పోర్ట్ దరఖాస్తులు, రీ-ఇష్యూ ఫీజులు గణనీయంగా పెరిగాయి. అయితే 8 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు తాజా పాస్‌పోర్ట్ దరఖాస్తులపై 10 శాతం రాయితీ కల్పించినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 36 పేజీల పాస్ పోర్ట్ సాధారణ దరఖాస్తు ఫీజు రూ.2,500 ఉండగా 60 పేజీల పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫీజు రూ.3,500గా ఉండనుంది..ఇక 36 పేజీల పాస్‌పోర్ట్ తత్కాల్ దరఖాస్తు రూ.5,000 ఉండగా 60 పేజీల తత్కాల్ పాస్ పోర్టు దరఖాస్తు రూ.6,000గా ఉండనుంది..పాస్ పోర్ట్ పోతే రీ-ఇష్యూ కోసం ఫీజులు 36 పేజీల పాస్‌పోర్ట్‌ దరఖాస్తు ఫీజు సాధారణంగా రూ.5,000 ఉంటే, 36 పేజీల రీ-ఇష్యూ తత్కాల్ ఫీజు రూ.7,500 గా ఉండనుంది. 60 పేజీల సాధారణ పాస్ పోర్ట్ రీ-ఇష్యూ ఫీజు రూ. 6,000 ఉండగా..60 పేజీల తత్కాల్ పాస్ పోర్ట్ రీ-ఇష్యూ ఫీజు రూ.8,500గా ఉండనుంది. జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకునే వారికి పాత ఫీజులు వర్తిస్తాయి. జూలై 1 నుంచి కొత్త రేట్లు అమలు అవుతాయి. పాస్‌పోర్ట్ దరఖాస్తులు passportindia.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో చేయవచ్చు. కొత్త ఫీజులు అమలులోకి వచ్చాక ఆన్‌లైన్ పేమెంట్ సమయంలో కొత్త రేట్లు వర్తించనున్నాయి.. ఫీజు పెంపు దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్ సేవల నాణ్యత, సాంకేతిక మెరుగుదలకు ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్ 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, పిడుగులు

Rashmika Mandanna: ట్రోలింగ్ భయంతో.. నోరు విప్పలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్

రూ.20 కడితే.. రూ.2 లక్షల బీమా.. అయినా ఎందుకింత నిర్లక్ష్యం?

ఖర్జూరం ప్రియులు తస్మాత్ జాగ్రత్త! గడువు ముగిస్తే.. ముప్పు తప్పదు!

అధిక బరువుతో గుండె జబ్బులే కాదు.. 19 రకాల క్యాన్సర్ల ముప్పు!

Follow Us