AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అధిక బరువుతో గుండె జబ్బులే కాదు.. 19 రకాల క్యాన్సర్ల ముప్పు!

అధిక బరువుతో గుండె జబ్బులే కాదు.. 19 రకాల క్యాన్సర్ల ముప్పు!

Phani CH
|

Updated on: Jun 27, 2026 | 5:18 PM

Share

అధిక బరువు కేవలం మధుమేహం, గుండె జబ్బులకే కాదు.. 19 రకాల క్యాన్సర్ల ముప్పును కూడా పెంచుతుందని తాజా అంతర్జాతీయ అధ్యయనం హెచ్చరించింది. బీఎంఐ పెరిగే కొద్దీ గర్భాశయ, ఆహారనాళం సహా పలు క్యాన్సర్ల ప్రమాదం అధికమవుతుందని పరిశోధకులు తెలిపారు. ఆరోగ్యకర ఆహారం, క్రమం తప్పని వ్యాయామంతో బరువును నియంత్రించుకోవడం అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

ఒకప్పుడు అధిక బరువు అనగానే గుండె జబ్బులు, మధుమేహం మాత్రమే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు ఆ జాబితాలోకి క్యాన్సర్ కూడా చేరింది. శరీర బరువు పెరిగితే ఏకంగా 19 రకాల క్యాన్సర్ల ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ అధ్యయనం ఒకటి హెచ్చరించింది. దాదాపు 15 లక్షల క్యాన్సర్ కేసులను విశ్లేషించి రూపొందించిన ఈ పరిశోధన వివరాలు ప్రముఖ జర్నల్ నేచర్ మెటబాలిజంలో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధన ప్రకారం.. ఎత్తుకు తగ్గ బరువును సూచించే బాడీ మాస్ ఇండెక్స్ పెరిగే కొద్దీ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా BMI ప్రతి 5 యూనిట్లు పెరిగినప్పుడు గర్భాశయ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ముప్పు 58% పెరుగుతుంది. ఆహార నాళానికి వచ్చే ఈసోఫేజియల్ అడెనోకార్సినోమా ముప్పు 47% పెరుగుతుంది. వీటితో పాటు లుకేమియా, నాన్-హాడ్జ్కిన్ లింఫోమా, మూత్రాశయ క్యాన్సర్, మెదడు గ్లియోమా ట్యూమర్ల ముప్పు కూడా అధిక బరువుతో ముడిపడి ఉందని తేలింది. శరీరంలో కొవ్వు పెరిగినప్పుడు దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్ ఏర్పడుతుంది. అలాగే ఇన్సులిన్, ఈస్ట్రోజెన్ హార్మోన్ల స్థాయిలు పెరిగి కణాల అసాధారణ ఎదుగుదలకు కారణమవుతాయి. ఇది జీవక్రియలను దెబ్బతీసి క్యాన్సర్‌కు దారితీస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాదు, కొన్ని అవయవాల పరిమాణం, పనితీరులో మార్పులు తీసుకురావచ్చు. దీంతో క్యాన్సర్‌కు దారితీసే కణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అన్ని రకాల క్యాన్సర్ల విషయంలో ఒకే ఫలితం రాలేదు. మెనోపాజ్‌కు ముందు వచ్చే కొన్ని రొమ్ము క్యాన్సర్ల ప్రమాదం అధిక బీఎంఐ ఉన్న మహిళల్లో కొంత తక్కువగా కనిపించింది. కానీ దీన్ని బరువు ఎక్కువగా ఉండటం మంచిదనే అర్థంలో తీసుకోవద్దని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం వేగంగా పెరుగుతున్న సమయంలో ఈ అధ్యయనం ప్రాధాన్యత సంతరించుకుంది. సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకర జీవనశైలి ద్వారా బరువును నియంత్రించుకోవడం చాలా అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కీర దోసకాయ వీరికి విషంతో సమానం!

వైద్య ప్రపంచంలో అద్భుతం.. మ్యాజిక్ మష్రూమ్స్’తో మతిమరుపు మాయం

చాక్లెట్‌ తినాలనిపిస్తోందా? మీ శరీరం ఏం చెబుతుందో తెలుసా!

Follow Us