వైద్య ప్రపంచంలో అద్భుతం.. మ్యాజిక్ మష్రూమ్స్’తో మతిమరుపు మాయం
అల్జీమర్స్‌తో ఐదేళ్లుగా మాట్లాడలేని స్థితిలో ఉన్న ఓ 80 ఏళ్ల వృద్ధురాలు, బ్రెజిల్‌లో మ్యాజిక్ మష్రూమ్స్ ప్రయోగం ద్వారా అద్భుతంగా కోలుకున్నారు. జ్ఞాపకశక్తి, శారీరక నియంత్రణను తిరిగి పొంది అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ కేస్ స్టడీ అల్జీమర్స్ చికిత్సలో కొత్త మార్గాలను సూచిస్తున్నప్పటికీ, మరింత పరిశోధన అవసరం.
అల్జీమర్స్ చికిత్సలో కొత్త ఆశలకు మార్గం చూపుతూ బ్రెజిల్‌లో జరిగిన ఓ అద్భుత సంఘటన అంతర్జాతీయ వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. పదేళ్లుగా అల్జీమర్స్‌తో బాధపడుతూ, ఐదేళ్లుగా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేని 80 ఏళ్ల వృద్ధురాలు మ్యాజిక్ మష్రూమ్స్ ప్రయోగంతో అద్భుతమైన మార్పును చవిచూశారు. బ్రెజిల్ సైంటిస్టులు ఆమెకు ఐదు గ్రాముల ఎనిగ్మా స్ట్రెయిన్ అనే మ్యాజిక్ మష్రూమ్స్ డోస్ ఇచ్చారు. దీనిని తీసుకున్న 19 గంటల తర్వాత, ఐదేళ్లుగా మౌనంగా ఉన్న ఆమె ఒక్కసారిగా కళ్ళు తెరిచి తన పాత జ్ఞాపకాల గురించి గంటల తరబడి అనర్గళంగా మాట్లాడటం ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే ఆమెలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఎవరి సాయం లేకుండానే నడవడం, బట్టలు వేసుకోవడం, కుటుంబ సభ్యులను గుర్తించడం వంటివి చేయగలిగారు. ఫ్రాంటియర్స్ ఇన్ న్యూరో సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ కేస్ స్టడీ ప్రకారం, మ్యాజిక్ మష్రూమ్స్‌లోని సిలోసిబిన్ మెదడులోని నరాల మధ్య సరికొత్త కనెక్షన్లను పునరుద్ధరిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే, ఇది కేవలం ఒక రోగిపై జరిగిన పరిశీలన మాత్రమేనని, దీనివల్ల అల్జీమర్స్ పూర్తిగా నయమైపోతుందని భావించలేమని స్పష్టం చేశారు. మ్యాజిక్ మష్రూమ్స్ వినియోగం భారత్‌తో సహా చాలా దేశాల్లో చట్టరీత్యా నేరం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
మరో హనీమూన్ తరహా మర్డర్ లోహగడ్ కోట మృతి కేసులో సంచలన విషయాలు!
డేంజర్ జోన్లో తెలుగు రాష్ట్రాలు..జూన్ 30 వరకు వణికించనున్నవానలు
బైకు కొనివ్వలేదని అమ్మమ్మపై మనవడి ఘాతుకం
రైతుల ఇంట సిరులు కురిపిస్తున్న కచిడి చేపలు!
భద్రాచలంలో దారుణం.. మూఢనమ్మకంతో ఇంటి యజమాని ఏంచేశాడో చూడండి..!
తిరుమలలో ఘరానా మోసం.. సుప్రభాత సేవ, వసతి పేరుతో 60 మందికి టోకరా !

