బాహుబలి, పుష్ప కాదమ్మా.. ధురంధర్ దారిలో..!
పాన్ ఇండియా సినిమాల్లో రెండు భాగాల ట్రెండ్ కొనసాగుతోంది. అయితే రాజమౌళి ‘వారణాసి’, ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’, అట్లీ-అల్లు అర్జున్ ‘రాకా’ వంటి భారీ ప్రాజెక్టులు నిజంగా సింగిల్ పార్ట్‌గా వస్తాయా? లేక ‘ధురంధర్’ ఫార్ములా తరహాలో తక్కువ గ్యాప్‌లో రెండు భాగాలుగా విడుదలవుతాయా? అనే చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అభిమానులు కూడా ఇదే ఫార్ములాకు మద్దతు తెలుపుతున్నారు.
2 పార్ట్ కల్చర్ అనేది కామన్ అయిపోయిందిప్పుడు. బడ్జెట్ పెరిగినా, కథ స్పాన్ పెరిగినా వెంటనే సీక్వెల్ అంటున్నారు మేకర్స్. అయితే రాబోయే కొన్ని సినిమాలు మాత్రం సింగిల్ పార్ట్‌గానే ప్లాన్ చేస్తున్నారు దర్శకులు. కానీ అవి నిజంగానే సింగిల్‌గా వస్తాయా అనేది అనుమానమే. ఒకవేళ వాటిని 2 పార్ట్స్ చేస్తే ధురంధర్ ఫార్ములా ఫాలో అవుతారా లేదంటే బాహుబలి వెంటే నడుస్తారా..? చూద్దాం ఎక్స్‌క్లూజివ్‌గా.. ప్యాన్ ఇండియన్ సినిమాలు చేయడం.. వాటిని 2 పార్ట్స్‌గా మార్చడం మన దర్శకులకు చాలా ఈజీ అయిపోయిందిప్పుడు. ఎవరు చూసినా బడ్జెట్ రికవరీ కోసమో లేదంటే కథ స్పాన్ పెరిగిందనో రెండు భాగాలు చేస్తున్నారు. అసలు ఈ ట్రెండ్‌కు తెరతీసిన రాజమౌళి మాత్రం బాహుబలి తర్వాత మళ్లీ అటువైపు వెళ్లలేదు. ట్రిపుల్ ఆర్ సింగిల్ పార్టే.. వారణాసి కూడా ఒకే భాగం అంటున్నారు జక్కన్న. వారణాసి కథను 3 గంటల నిడివితో రాజమౌళి చెప్పగలరా లేదంటే 2 పార్ట్స్ చేస్తారా అనే సందేహాలు వస్తున్నాయిప్పుడు. ఒకవేళ 2 భాగాలు చేస్తే బాహుబలిలా రెండేళ్లు కాకుండా ధురంధర్‌లా.. 3 నెలల్లో వారణాసి 2 భాగాలు వస్తే.. రాజమౌళి రేంజ్‌కు 3000 కోట్లు ఈజీగా వసూలు చేస్తుందంటున్నారు ఫ్యాన్స్. మరి జక్కన్న ప్లాన్స్ ఎలా ఉన్నాయనేది ఆసక్తికరంగా మారింది. వారణాసికి వచ్చిన అనుమానాలే డ్రాగన్ సినిమా విషయంలోనూ వస్తున్నాయి. టీజర్‌నే 4 నిమిషాలకు పైగా కట్ చేసారు ప్రశాంత్ నీల్. ఇంత పెద్ద కథను ఒకే పార్ట్‌లో చెప్తారా అనేది అనుమానమే. పైగా కేజియఫ్, సలార్‌ను ఒక భాగం కంటే 2 పార్ట్స్‌గా చెప్పడానికే ఇష్టపడ్డారు నీల్. ఒకవేళ డ్రాగన్ అలా చేస్తే.. ఒకేసారి 2 పార్ట్స్ షూట్ చేసి తక్కువ గ్యాప్‌లో విడుదల చేయాలంటున్నారు అభిమానులు. అల్లు అర్జున్ రాకా సైతం ఒకే భాగంలో వస్తుందా అనేది డౌటే.. అట్లీ ఈ కథను చెప్తున్న తీరు చూస్తుంటే 2 పార్ట్స్ ఖాయమనిపిస్తుంది. ఏం చేసినా ఒకే ఏడాది 2 భాగాలు రిలీజ్ చేస్తే చాలంటున్నారు ఫ్యాన్స్. బాహుబలి, పుష్ప, KGF సెకండ్ పార్ట్స్ రెండు మూడేళ్ళ తర్వాత వచ్చాయి.. కనీసం రాబోయే సీక్వెల్స్ అయినా ధురంధర్ ఫార్ములాను ఫాలో అయితే బెటర్. చూడాలిక ఏం జరగబోతుందో..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాస్‌పోర్ట్‌కి అప్లై చేయాలా? త్వరపడండి.. జులై 1 నుంచి ఫీజులు పెరుగుతున్నాయ్!
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్ 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, పిడుగులు
Rashmika Mandanna: ట్రోలింగ్ భయంతో.. నోరు విప్పలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్
రూ.20 కడితే.. రూ.2 లక్షల బీమా.. అయినా ఎందుకింత నిర్లక్ష్యం?
ఖర్జూరం ప్రియులు తస్మాత్ జాగ్రత్త! గడువు ముగిస్తే.. ముప్పు తప్పదు!
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
మరో హనీమూన్ తరహా మర్డర్ లోహగడ్ కోట మృతి కేసులో సంచలన విషయాలు!
డేంజర్ జోన్లో తెలుగు రాష్ట్రాలు..జూన్ 30 వరకు వణికించనున్నవానలు
బైకు కొనివ్వలేదని అమ్మమ్మపై మనవడి ఘాతుకం
రైతుల ఇంట సిరులు కురిపిస్తున్న కచిడి చేపలు!
భద్రాచలంలో దారుణం.. మూఢనమ్మకంతో ఇంటి యజమాని ఏంచేశాడో చూడండి..!
తిరుమలలో ఘరానా మోసం.. సుప్రభాత సేవ, వసతి పేరుతో 60 మందికి టోకరా !
పిట్టగోడపై కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న యువతి .. అంతలోనే
పాస్‌పోర్ట్‌కి అప్లై చేయాలా? జులై 1 నుంచి ఫీజులు పెరుగుతున్నాయ్
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్ 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
ట్రోలింగ్ భయంతో.. నోరు విప్పలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్
రూ.20 కడితే.. రూ.2 లక్షల బీమా.. అయినా ఎందుకింత నిర్లక్ష్యం?

