గత్తరలేపుతున్న సీరియల్ విలన్.. నెట్టింట అరాచకమే..

Rajitha Chanti

Pic credit - Instagram

27 Jun 2026

తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే 'గుండెనిండా గుడిగంటలు' సీరియల్‌కు రేటింగ్స్ పరంగా భారీ రెస్పాన్స్ వస్తోన్న సంగతి తెలిసిందే.

మధ్యతరగతి కుటుంబాల భావోద్వేగాలు, ట్విస్టులతో సాగే ఈ సీరియల్‌లో ప్రతి పాత్రకూ ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో పాత్రలన్నీ ఫేమస్.

అయితే ఈ సీరియల్‌లో 'రోహిణి' పాత్ర ద్వారా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి అసలు రూపం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

సీరియల్‌లో నెగిటివ్ షేడ్స్ ఉన్న, ఎప్పుడూ కాస్త సాంప్రదాయబద్ధంగా కనిపించే రోహిణి పాత్రలో నటిస్తున్న ఈమె అసలు పేరు జ్యోతికా మునిరత్నం.  

సాధారణంగా స్క్రీన్‌పై పద్ధతిగా కనిపించే జ్యోతిక, తన రియల్ లైఫ్‌లో మాత్రం చాలా మోడ్రన్‌గా, స్టైలిష్‌గా ఉంటుందని మీకు తెలుసా.. 

ఇటీవల ఈమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన గ్లామరస్ ఫోటోలు చూసి "ఈమె మన సీరియల్ రోహిణేనా?" అని నోరెళ్లబెడుతున్నారు. 

నిజానికి, ఈ 'రోహిణి' పాత్రను మొదటగా ప్రముఖ నటి తులసి కృష్ణ పోషించారు. ఆమె కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సీరియల్ నుండి తప్పుకున్నారు. 

ప్రస్తుతం బుల్లితెరపై రోహిణిగా విలనిజం పండిస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ, ఇన్స్టాగ్రామ్‌లోనూ భారీగా ఫాలోయింగ్‌ను సంపాదిస్తోంది.