AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్యాస్ ట్రబుల్ అని లైట్ తీసుకోకండి! గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లెక్స్ తగ్గించే నివారణోపాయాలు ఇవే!

ప్రస్తుత కాలంలో వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరినీ పీడిస్తున్న అతిపెద్ద ఆరోగ్య సమస్య 'గ్యాస్ ట్రబుల్'. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చాలామంది ఈ సమస్యతో సతమతమవుతుంటారు. అయితే వైద్య పరిభాషలో లేదా మెడికల్ టెక్స్ట్‌బుక్స్‌లో 'గ్యాస్ ట్రబుల్' అనే ప్రత్యేకమైన జబ్బు లేదా పదం ఎక్కడా ఉండదని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మరియు బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ రవికాంత్ కొంగర గారు స్పష్టం చేశారు.

Phani CH
|

Updated on: Jun 27, 2026 | 9:10 PM

Share
ఒక్కొక్కరు ఒక్కో రకమైన అసౌకర్యాన్ని గ్యాస్ ట్రబుల్‌గా భావిస్తుంటారు. కొంతమందికి తేపులు ఎక్కువ రావడం, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, గుండెల్లో లేదా ఛాతిలో మంట మరియు ఇర్రెగ్యులర్ మోషన్స్ వంటి విభిన్న లక్షణాలను కలిపి సాధారణ భాషలో గ్యాస్ సమస్యగా పిలుస్తారు. ఈ సమస్యలన్నింటిలో అత్యంత ప్రధానమైనది మరియు ప్రమాదకరమైనదిగా భావించేది 'యాసిడ్ రిఫ్లెక్స్' లేదా 'హార్ట్ బర్న్'.

1 / 5
మన జీర్ణాశయంలో ఆహారాన్ని అరిగించడానికి మరియు హానికరమైన క్రిములను చంపడానికి అత్యంత శక్తివంతమైన హైడ్రోక్లోరిక్ యాసిడ్ నిరంతరం ఉత్పత్తి అవుతుంది. ఈ యాసిడ్‌ను తట్టుకునేలా మన కడుపు లోపలి గోడలు సహజంగానే నిర్మితమై ఉంటాయి . కానీ మన గొంతు నుండి పొట్ట వరకు ఉండే అన్నవాహిక మాత్రం ఈ యాసిడ్‌ను తట్టుకోలేదు.

2 / 5
ఛాతికి, పొట్టకి మధ్యలో ఉండే వాల్వ్ లూస్ అవ్వడం లేదా అక్కడ హయాటస్ హెర్నియా వంటి లోపాలు ఏర్పడటం వల్ల పొట్టలోని యాసిడ్ పైకి తన్నుకుంటూ వస్తుంది. దీనివల్ల ఛాతిలో తీవ్రమైన మంట, ఎడమ భుజంలో నొప్పి వస్తుంది. చాలామంది దీనిని చూసి గుండె జబ్బు ఏమో అని భయపడి ఆందోళనకు గురవుతుంటారు. యాసిడ్ రిఫ్లెక్స్ సమస్యను నియంత్రించడానికి డాక్టర్ రవికాంత్ గారు కొన్ని ముఖ్యమైన జీవనశైలి మార్పులను సూచించారు.

3 / 5
మొదటగా, ఒకేసారి కడుపునిండా భారీగా ఆహారాన్ని తీసుకోకూడదు. కడుపు నిండిపోతే మిక్సీ లేదా గ్రైండర్ ఆన్ చేసినప్పుడు పైకి చిమ్మినట్లు యాసిడ్ పైకి తన్నుకొస్తుంది. కాబట్టి తక్కువ పరిమాణంలో, ఎక్కువ సార్లు (చిన్న చిన్న విరామాలలో) ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. రెండవ తప్పు ఏమిటంటే, ఆహారం తిన్న వెంటనే గ్లాసుల కొద్దీ నీళ్లు తాగడం. ఇలా చేయడం వల్ల పొట్ట పూర్తిగా నిండిపోయి యాసిడ్ సులభంగా అన్నవాహికలోకి ప్రవేశిస్తుంది. అందుకే నీళ్లను ఆహారానికి 10-15 నిమిషాల ముందే తగినంత తాగాలి, తిన్న వెంటనే నీళ్లు తాగడం తగ్గించాలి.

4 / 5
ఈ విధమైన జాగ్రత్తలు మరియు వైద్యులు సూచించే యాంటిసిడ్ మందుల ద్వారా 90 శాతం సమస్యను నయం చేయవచ్చు. ఒకవేళ వాల్వ్ పూర్తిగా లూస్ అయి మందులతో కూడా తగ్గని తీవ్రమైన 10 శాతం కేసులలో '24 అవర్ పిహెచ్ స్టడీ' అనే పరీక్ష ద్వారా నిర్ధారించి 'లాపరోస్కోపిక్ యాంటీ-రిఫ్లెక్స్ సర్జరీ' ద్వారా వాల్వ్‌ను టైట్ చేసి శాశ్వత ఉపశమనం కలిగించవచ్చు

5 / 5
Follow Us
ఆ ఒక్క పొరపాటుతో లక్ష రూపాయల జరిమానా విధించిన రైల్వే..!

గ్యాస్ ట్రబుల్ అని లైట్ తీసుకోకండి! నివారణోపాయాలు ఇవే

ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! వారానికి 4 రోజులే పని,3 సెలవులు?

రూ.1699కే ఫీచర్ ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్‌.. ఫీచర్స్ అదుర్స్‌

వామ్మో.. ఎంత పెద్ద పాములో.. ఒకేచోట రెండు నాగుల సయ్యాట..!

రాహు ప్రభావంతో వీరికి అన్నింట్లో విజయమే, ఊహించని డబ్బే డబ్బు

హోటల్ స్టైల్ స్పైసీ ఉల్లిపాయ ఊరగాయ.. ఇలా చేస్తే ముక్క కూడా వదలరు

అదిరే పెర్ఫామెన్స్‌తో మార్కెట్లోకి రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G

జాతకంలో సూర్యుడు ఏ ఇంట్లో ఉన్నాడు? 12 భావాల్లో సూర్యుని ఫలితాలు..

పప్పు, సాంబార్‌లోకి అదిరిపోయే సైడ్ డిష్ బెండకాయ రవ్వ వేపుడు..