AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పసికందును బిడ్డకు అప్పజెప్పి పనికి వెళ్లిన తల్లిదండ్రులు.. తిరిగొచ్చి చూసేసరికి..

రెక్కాడితే గానీ డొక్కాడని ఆ గిరిజన కుటుంబంలో ఆకలి తీర్చుకోవడం కోసం తల్లిదండ్రులు పనులకు వెళ్తే.. తమ్ముడిని లాలించిన ఆ చిట్టితల్లి అనంతలోకాలకు వెళ్లిపోయింది. తమ్ముడిని నిద్రపుచ్చి సరదాగా ఊయల ఊగుదామనుకున్న ఆ చిన్నారికి, ఆ ఊయలే ఉరితాడుగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. అసలు ఏం జరిగిందంటే..?

Andhra Pradesh: పసికందును బిడ్డకు అప్పజెప్పి పనికి వెళ్లిన తల్లిదండ్రులు.. తిరిగొచ్చి చూసేసరికి..
Tribal Girl Dies In Tragic Mishap
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Apr 14, 2026 | 1:37 PM

Share

అది గిరిజన వ్యవసాయ కూలీ రైతు కుటుంబం.. రెక్కడితే గాని డొక్కాడని పరిస్థితి వారిది.. ఇద్దరు పిల్లలు.. ఒకరు పదేళ్లు, మరొకరు నెలల పసికందు. దీంతో కూడు తినాలంటే ఖచ్చితంగా పనికి వెళ్లాల్సిందే. మండుతున్న ఎండల్లో పసి పిల్లలతో పనులకు వెళ్లాలంటే భయపడిన ఆ కుటుంబం.. ఇంటి వద్ద నెలల పసికందును చిన్నారికి అప్పగించి వెళ్లారు. తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకోమ్మా.. వెళ్లి వచ్చేస్తాం అని బయలుదేరారు తల్లిదండ్రులు. ఆ పసికందును లాలించింది ఆ చిట్టితల్లి. తమ్ముడు పడుకున్న తర్వాత.. ఆమె ఊయల ఊగేందుకు ప్రయత్నించింది.. ఇంతలోనే ఊహించని ఘోరం జరిగింది.

అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలం కొదోంజొల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో లొకిరాం.. తన భార్య ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. ఆ గిరిజన దంపతులకు పదేళ్ల మాధవి, మరో మూడు నెలల పసికందు ఉన్నారు. తల్లి.. మూడు నెలల పసికందును చిన్నారి చేతిలో పెట్టి లాలించాలని గెడ్డకు వెళ్లింది. తండ్రి కూడా పనుల కోసం వెళ్లిపోయాడు. ఈ క్రమంలో తమ్ముడిని లాలించిన ఆ చిట్టి తల్లి.. పసికందు నిద్రబుచ్చిన తరువాత పక్కనే వేసింది. ఆ తరువాత సరదాగా ఊయల వైపు వెళ్లి ఊగుతూ ఉంది మాధవి. ఇంతలో ఏమైందో ఏమో కానీ.. ఊయల మాధవి మెడకు బిగించుకుని ఊపిరి వదిలేసింది. ఇంటికి తల్లిదండ్రులు వచ్చే చూసేసరికి.. మాధవి విగతజీవిగా పడి ఉంది. ప్రమాదవశాత్తు ఇరుక్కపోయి మృతి చెందిందని చిన్నారి తండ్రి లొకిరాం బోరున విలపించాడు. గ్రామంలో ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో చిన్నారిని కాపాడలేని పరిస్థితి ఏర్పడిందని గ్రామస్థులు అంటున్నారు. చిన్నారి మాధవి.. కొసొంగుడ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో అయిదో తరగతి చదువుతోంది. మాధవి మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Follow Us
పసికందును బిడ్డకు అప్పజెప్పి పనికి వెళ్లిన తల్లిదండ్రులు..
పసికందును బిడ్డకు అప్పజెప్పి పనికి వెళ్లిన తల్లిదండ్రులు..
చెప్పుకోండి చూద్దాం.! మనుషులను చూసి సిగ్గుపడే జంతువు ఏదో తెల్సా..
చెప్పుకోండి చూద్దాం.! మనుషులను చూసి సిగ్గుపడే జంతువు ఏదో తెల్సా..
పదేళ్ల విధ్వంసాన్ని తుడిచేస్తున్నాం.. అడ్డుపడితే అడ్రస్ లేకుండా..
పదేళ్ల విధ్వంసాన్ని తుడిచేస్తున్నాం.. అడ్డుపడితే అడ్రస్ లేకుండా..
ఏపీ రైతుల కోసం కొత్త యాప్.. అన్నీ ఒకేచోట
ఏపీ రైతుల కోసం కొత్త యాప్.. అన్నీ ఒకేచోట
మీ బంగారు నగలకు పెద్ద శత్రువు ఈ చిన్న పదార్థం ! జస్ట్‌ టచ్‌చేస్తే
మీ బంగారు నగలకు పెద్ద శత్రువు ఈ చిన్న పదార్థం ! జస్ట్‌ టచ్‌చేస్తే
కావ్యా కోసం క్యూ కట్టిన ప్రేమికులు.. స్టేడియంలోనే గులాబీలతో ప్రేమ
కావ్యా కోసం క్యూ కట్టిన ప్రేమికులు.. స్టేడియంలోనే గులాబీలతో ప్రేమ
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
శంషాబాద్‌లో బుల్లెట్ రైళ్ల కోసం భారీ టెర్మినల్.. 600 ఎకరాల్లో..
శంషాబాద్‌లో బుల్లెట్ రైళ్ల కోసం భారీ టెర్మినల్.. 600 ఎకరాల్లో..
ఎండాకాలంలో తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి..
ఎండాకాలంలో తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి..
50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌!
50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌!