AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funky OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ఫంకీ.. అఫీషియల్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే..

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, ‘జాతి రత్నాలు’ ఫేం అనుదీప్ కాంబినేషన్‌ లో వచ్చిన రీసెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఫంకీ’. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది. విశ్వక్ సేన్ మార్క్ కామెడీ యాక్షన్, కయాదు లోహర్ అంద చందాలు, అనుదీప్ మార్క్ డైలాగులు ఫంకీ సినిమాలో హైలెట్ గా నిలిచాయి

Funky OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ఫంకీ.. అఫీషియల్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే..
Funky Movie
Rajeev Rayala
|

Updated on: Mar 08, 2026 | 11:54 AM

Share

విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఫంకీ. జాతి రత్నాలు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుదీప్ ఈ మూవీని తెరకెక్కించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానరర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో విశ్వక్ సేన్ సరసన డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అలాగే నరేష్, ఈశ్వరీరావు, సంపత్ రాజ్, వీటీవీ గణేశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 13న ఈ సినిమా థియేటర్స్ లో విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలకు ముందు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. కానీ థియేటర్స్ లో విడుదలైన తర్వాత అభిమానులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

ఇక ఈ సినిమాలో విశ్వక్ కామెడీతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదలై నెలరోజులు అవుతుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూశారు. ఎట్టకేలకు ఫంకీ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఫంకీ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఫంకీ సినిమాను నెట్ ఫ్లిక్స్ మంచి ధరకు సొంతం చేసుకుందని తెలుస్తుంది. మార్చ్ 13న ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకువస్తున్నారు. మరి ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఫంకీ సినిమాను నిర్మించారు. హీరో, హీరోయిన్లతో పాటు నరేష్, సంపత్ రాజ్, మురళీధర్ గౌడ్, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. .. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us