ఇష్టమని ఆలూ వంటకాలు తెగ లాగించేస్తున్నారా? ఇలా తిన్నారో కథ కంచికే

11 March 2026

TV9 Telugu

TV9 Telugu

దుంప కూర‌గాయ‌ల‌ల్లో ఆలుగ‌డ్డ చాలా స్పెషల్. త‌క్కువ ధ‌ర‌లో ల‌భిస్తూ ఉంటాయి. వీటితో కూర‌, పులుసు, వేపుడు వంటివి ఎలా చేసినా భలేగా ఉంటాయి. ఆలుగ‌డ్డ చిప్స్ చాలా రుచిగా ఉంటాయి

TV9 Telugu

అయితే ఆలుగ‌డ్డల్లో కార్బొహైడ్రేట్స్ ఎక్కువ‌గా ఉంటాయి. అందువల్ల వీటిని వేయించి తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి హాని క‌లుగుతుందని చాలా మంది వీటికి దూరంగా ఉంటారు

TV9 Telugu

కానీ ఆలుగ‌డ్డల్లో కార్బొహైడ్రేట్స్ తో పాటు మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌ని వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు

TV9 Telugu

ఆలుగ‌డ్డల‌ను వేయించడానికి బ‌దులుగా ఉడికించి లేదా బేక్ చేసి తీసుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రయోజ‌నాలు పొందవచ్చు. నిజానికి ఆలుగ‌డ్డల్లో విట‌మిన్ సి, పొటాషియం, విట‌మిన్ బి6, మెగ్నిషియం, పొటాషియం, ఐర‌న్, ఫోలేట్ వంటి పోష‌కాలు ఎన్నో ఉంటాయి

TV9 Telugu

ఆలుగ‌డ్డల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కండ‌రాలు, న‌రాల ప‌నితీరు పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వీటిల్లో ఉండే కార్బొహైడ్రేట్స్ ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను వేగంగా పెంచ‌డానికి బ‌దులుగా ఇవి శ‌రీరానికి శ‌క్తిని అందిస్తాయి

TV9 Telugu

ఆట‌లు ఎక్కువగా ఆడేవారికి త‌క్షణ శ‌క్తి కోసం ఉడికించిన ఆలుగ‌డ్డల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శరీరానికి త‌క్షణ శ‌క్తి ల‌భిస్తుంద‌ని చెబుతున్నారు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తపోటు అదుపులో ఉంటుంది

TV9 Telugu

జీర్ణక్రియ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో ఆలుగ‌డ్డలు మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. దీంతో జీర్ణసంబంధిత ఇన్సెక్షన్‌లు, అనారోగ్య స‌మ‌స్యలు వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంది

TV9 Telugu

శ‌రీరంలోని ఫ్రీ రాడిక‌ల్స్ ను న‌శింపజేసి మ‌నం దీర్ఘకాలిక అనారోగ్య స‌మ‌స్యల బారిన ప‌డ‌కుండా మ‌న‌ల్ని కాపాడడంలో ఆలుగ‌డ్డలు మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. అయితే వీటిని ఎల్లప్పుడు మితంగానే తీసుకోవాలి