AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harish Shankar : రిప్లై ఇవ్వడంతో మొదలైన వివాదం.. అభిమానులకు సారీ చెప్పిన డైరెక్టర్ హరీష్ శంకర్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై ఇప్పటికే విపరీతమైన క్రేజ్ ఉంది. గతంలో ఇద్దరి మధ్య వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో ఇప్పుడు వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

Harish Shankar : రిప్లై ఇవ్వడంతో మొదలైన వివాదం.. అభిమానులకు సారీ చెప్పిన డైరెక్టర్ హరీష్ శంకర్..
Harish Shankar
Rajitha Chanti
|

Updated on: Mar 11, 2026 | 1:08 PM

Share

డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సినీ ప్రపంచంలో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం కలిగి ఉన్నారు. అలాగే ఇండస్ట్రీ నుంచి సోషల్ మీడియాలో అత్యధికంగా యాక్టివ్ గా ఉండేవారిలో హరీష్ శంకర్ ఒకరు. నిత్యం నెట్టింట చాలా యాక్టివ్ గా ఉంటూ సమాజంలో జరిగే విషయాలపై.. అలాగే సినిమా అప్డేట్స్ పై ఏదోక పోస్ట్ చేస్తుంటారు. ప్రస్తుతం హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాను మార్చి 26న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఈ చిత్రానికి సంబంధించి ఏదోక పోస్ట్ చేస్తున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ క్రమంలోనే సినిమాపై హైప్ పెంచే ప్రయత్నంలో ఆయన చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట భయ్యా.. 29 ఏళ్లుగా ట్రెండింగ్.. మనసును హత్తుకునే సాంగ్.. వింటే వదలరు..

ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల సందర్భంగా ఓ అభిమాని ట్విట్టర్ వేదికగా బాక్సాఫీస్ వద్ద BOB రికార్డులు బ్రేక్ చేయాలనే అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. ఇందుకు హరీష్ శంకర్ రియాక్ట్ అవుతూ తథాస్తు అంటూ స్పందించారు. ఆ వెంటనే రియలైజ్ అయ్యి ఆ ట్వీట్ డిలీట్ చేశారు. కానీ అప్పటికే ఆ ట్వీట్ నెట్టింట వైరలయ్యింది. ఈ ట్వీట్ పై మహేష్ బాబు అభిమానులు సీరియస్ అయ్యారు. (BOB అంటే Boss Of Blockbusters అని ప్రచారం).. ఈ వివాదంపై తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందిస్తూ ఓ నోట్ విడుదల చేశారు.

ఎక్కువమంది చదివినవి : Jr.NTR: ఆ విషయం పదే పదే చెప్పడం నాకు నచ్చదు.. ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే తెలుసుకోవాలి.. ఎన్టీఆర్..

“నిన్న నాకు చాలా బిజీగా ఉంది. సెన్సార్ తర్వాత బోర్డ్ అధికారులతో మీటింగ్ జరిగింది. అలాగే ఆశీర్వాదాల కోసం పెద్దమ్మ గుడికి వెళ్లాను. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకున్నాను. పాట ప్రోమోకు సంబంధించిన ఫైనల్స్ చెక్ పూర్తి చేశాను. అలాగే ప్రమోషన్లలో ఒక రౌండ్ ముగించుకుని బీజీఎమ్ కోసం తమన్ స్టూడియోకు వెళ్లాను. అప్పుడే ప్రోమోకు వస్తున్న శుభాకాంక్షల మెసేజ్ లకు రిప్లై ఇస్తున్నాను. అదే హడావుడిలో ఒక ట్వీట్ ను పూర్తిగా చదవుకుండానే పొరపాటున రిప్లై ఇచ్చాను. నా టీమ్ నాకు తెలియజేయడంతో ఆ ట్వీట్ చదవమన్నారు. వెంటనే ఆ ట్వీట్ డెలీట్ చేశాను. మహేష్ బాబు గారిపై నాకు చాలా గౌరవం ఉంది. పోకిరి రికార్డుల గురించి బర్త్ డే ట్వీట్‌లో ప్రత్యేకంగా చెప్పాను. పొరపాటును మన్నించి సినిమాను ఆదరించాలని మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. వారణాసి సినిమా ఎన్నో రికార్డులు కొల్లగొడుతుందని ఆకాంక్షిస్తున్నాను ” అంటూ రాసుకొచ్చారు.

ఎక్కువమంది చదివినవి : Actress : కృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు తెలుగులో బిజీ యాక్టర్.. ఆమె వాయిస్ చాలా స్పెషల్..

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆ సినిమా ప్లాప్.. దెబ్బకు రోడ్డున పడ్డా.. కార్లు అమ్ముకున్నా.. టాలీవుడ్

Follow Us
నారింజ పండ్లు తింటే ఫ్యాటీ లివర్‌ను నయం చేయవచ్చా?
నారింజ పండ్లు తింటే ఫ్యాటీ లివర్‌ను నయం చేయవచ్చా?
వేలిముద్రల సీక్రెట్స్.. 99శాతం మందికి ఈ విషయాలు అస్సలు తెలియదు..
వేలిముద్రల సీక్రెట్స్.. 99శాతం మందికి ఈ విషయాలు అస్సలు తెలియదు..
సారీ సార్ మీ నమ్మకం నిలబెట్టలేకపోయాను.. పంత్ ఆవేదన
సారీ సార్ మీ నమ్మకం నిలబెట్టలేకపోయాను.. పంత్ ఆవేదన
వాస్తు చిట్కాలు: ఇంటి పేర్లు ఇలా పెట్టండి.. సంతోషం, ఐశ్వర్యం ..
వాస్తు చిట్కాలు: ఇంటి పేర్లు ఇలా పెట్టండి.. సంతోషం, ఐశ్వర్యం ..
హీరోకు ఫేక్ మీసాలు.. దెబ్బకు 220 కోట్ల సినిమా అట్టర్ ప్లాప్..
హీరోకు ఫేక్ మీసాలు.. దెబ్బకు 220 కోట్ల సినిమా అట్టర్ ప్లాప్..
ఈ కాంబినేషన్‌ మీకూ ఇష్టమా..? అయితే ఈ విషయం మీకు చెప్పాల్సిందే..
ఈ కాంబినేషన్‌ మీకూ ఇష్టమా..? అయితే ఈ విషయం మీకు చెప్పాల్సిందే..
ఆడవాళ్ళు.. కొత్త చీరలకు అదేపనిగా గంజి పెడుతున్నారా?
ఆడవాళ్ళు.. కొత్త చీరలకు అదేపనిగా గంజి పెడుతున్నారా?
ఏసీ కొనాలనుకుంటున్నారా?3 స్టార్, 5 స్టార్ మధ్య తేడా తెలియకపోతే
ఏసీ కొనాలనుకుంటున్నారా?3 స్టార్, 5 స్టార్ మధ్య తేడా తెలియకపోతే
తమిళనాడులో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ.. OTTలో ఈ సినిమాను చూశారా?
తమిళనాడులో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ.. OTTలో ఈ సినిమాను చూశారా?
కార్టూన్లు చూస్తాను..బాదేస్తాను.. ప్లానింగ్ ఏం లేదన్న బుడ్డోడు
కార్టూన్లు చూస్తాను..బాదేస్తాను.. ప్లానింగ్ ఏం లేదన్న బుడ్డోడు