AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Song : ఏం పాట భయ్యా.. 29 ఏళ్లుగా ట్రెండింగ్.. మనసును హత్తుకునే సాంగ్.. వింటే వదలరు..

ప్రస్తుతం యూట్యూబ్ లో ఎన్నో పాటలు ట్రెండ్ అవుతున్నాయి. అటు ఫోక్ సాంగ్స్.. ఇటు సినిమా పాటలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. కానీ పాత పాటలకు ఉండే ఆ వైబ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సాంగ్ దాదాపు 29 సంవత్సరాలుగా ట్రెండ్ అవుతుంది. ఇప్పటికీ ఆ పాటను మరో సాంగ్ బీట్ చేయలేకపోయింది.

Trending Song : ఏం పాట భయ్యా.. 29 ఏళ్లుగా ట్రెండింగ్.. మనసును హత్తుకునే సాంగ్.. వింటే వదలరు..
Trending Song
Rajitha Chanti
|

Updated on: Mar 08, 2026 | 7:42 PM

Share

ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియాలో ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి. మరోవైపు సినిమాలు పాటలు సైతం అదే స్థాయిలో సత్తా చాటుతున్నాయి. కానీ ఒకప్పటి పాత పాటలకు సెపరేట్ వైబ్ ఉందనే చెప్పాలి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సాంగ్ దాదాపు 29 సంవత్సరాలుగా ఇండస్ట్రీని ఊపేస్తుంది. ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరు తమ ప్రేమికులను ఊహించుకుంటూ పాడే పాట ఇది. ముఖ్యంగా ఈ పాటలోని లిరిక్స్ యువతకు తెగ కనెక్ట్ అవుతాయి. అందుకే ఆ పాట వచ్చి దాదాపు పాతిక సంవత్సరాలు దాటినప్పటికీ ఆ సాంగ్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. మనసును హత్తుకునే మెలోడి సాంగ్. ముఖ్యంగా ఆ పాట మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. 1996లో విడుదలైన సినిమా. కానీ ఇప్పటికీ ఎక్కడ విన్నా ఆ మూవీలోని సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఇంతకీ ఆ పాట ఏంటా అని ఆలోచిస్తున్నారా.. ? అయితే గెస్ చేయండి.

1996లో డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, టబు హీరోహీరోయిన్లుగా నటించారు. అప్పట్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి విభాగాల్లో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాగా ఈ మూవీకి అక్కినేని పురస్కారం, ఉత్తమ గాయకుడిగా నంది అవార్డ్స్ వచ్చాయి. ఇంతకీ సినిమా పేరు గుర్తుచ్చిందా.. ? అదేనండి.. ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ మూవీ నిన్నే పెళ్లాడతా.

మనం మాట్లాడుకుంటున్న పాట పేరు కన్నుల్లో నీ రూపమే. “కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే.. నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే” అంటూ సాగే ఈ పాటకు ఇప్పటికీ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ పాటలోని ప్రతి చరణం కుర్రకారును కట్టిపడేసింది. ఈ చిత్రానికి సందీప్ చౌత సంగీతం అందించారు. ఇక ఈ పాటను చిత్ర, హరిహరన్ అద్భుతంగా ఆలపించారు. ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. ఇప్పుడు మరోసారి ఈ పాటను వినేయండి.

ఎక్కువమంది చదివినవి : Song Flashback: రాలిపోయే పువ్వా పాటకు నేషనల్ అవార్డ్.. కానీ వెనక్కు ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే..

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆశాపాశం సాంగ్ రాసింది నేనే.. కానీ అతడు సాంగ్ నా కెరీర్ మలుపు తిప్పింది.. లిరిసిస్ట్..

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!