ఆంధ్రా ఫేమస్ కర్రీ.. గుత్తి వంకాయ మసాలా కూర వండితే మాంసం కూర సరిపోదు. అంత రుచిగా ఉంటుంది.
గుత్తి వంకాయ మసాలా కూర
గుత్తి వంకాయలు 6, ఒక కప్పు పల్లీలు, ఒక టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక కప్పు చింతపండు రసాన్ని తీసుకోవాలి.
కావాల్సిన పదార్దాలు
ఉల్లిపాయ ముక్కలు, అర టీ స్పూన్ అల్లం పేస్ట్ , వెల్లుల్లి రెబ్బలు, రెండు టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ పసుపు తీసుకోవాలి.
కావాల్సిన పదార్దాలు
ముందుగా ఈ కూరను చేయడానికి మసాలా రెడీ చేసుకోవాలి. పల్లీలు, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి.
గుత్తి వంకాయ మసాలా కూర
ఇప్పుడు వంకాయలను తీసుకుని బాగా శుభ్రం పరిచి వాటిని మూడు భాగాలుగా కట్ చేసుకోవాలి.
స్టెప్ - 1
ఆ తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలా స్టఫ్ ను తీసుకుని గుత్తి వంకాయల్లో నింపాలి.
స్టెప్ - 2
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి తాలింపు గింజలు, కరివేపాకు ఆకులు వేసి స్టవ్ మీదే వేయించాలి
స్టెప్ - 3
ముక్కలు మగ్గిన తర్వాత మసాలా పొడి, ఒక గ్లాస్ నీళ్లు పోసి మీడియం మంటపై బాగా ఉడికించాలి. దించే ముందు కొత్తిమీర వేసి వడ్డించుకుని తినేయండి.