AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inter Physics Exam 2026: ఇంటర్‌ ఫిజిక్స్‌ క్వశ్చన్‌ పేపర్లో ఆ ప్రశ్న మిస్సింగ్‌.. గుడ్‌న్యూస్ చెప్పిన ఇంటర్ బోర్డు

ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. మార్చి 18వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం (మార్చి 10) ఇంటర్‌ సెకండియర్‌ ఫిజిక్స్‌ పేపర్‌ 2 పరీక్ష జరిగింది. అయితే ఫిజిక్స్‌ పేపర్‌ 2 ఇంగ్లిష్‌ మీడియం క్వశ్చన్‌ పేపర్‌లో తప్పిదాలు చోటుచేసుకున్నాయి.

Inter Physics Exam 2026: ఇంటర్‌ ఫిజిక్స్‌ క్వశ్చన్‌ పేపర్లో ఆ ప్రశ్న మిస్సింగ్‌.. గుడ్‌న్యూస్ చెప్పిన ఇంటర్ బోర్డు
Telangana Inter EM Physics Paper 2 Exam
Srilakshmi C
|

Updated on: Mar 11, 2026 | 8:27 AM

Share

హైదరాబాద్‌, మార్చి 11: తెలంగాణ ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. మార్చి 18వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం (మార్చి 10) ఇంటర్‌ సెకండియర్‌ ఫిజిక్స్‌ పేపర్‌ 2 పరీక్ష జరిగింది. అయితే ఫిజిక్స్‌ పేపర్‌ 2 ఇంగ్లిష్‌ మీడియం క్వశ్చన్‌ పేపర్‌లో తప్పిదాలు చోటుచేసుకున్నాయి. ఇంగ్లిష్‌ మీడియం క్వశ్చన్‌ పేపర్, తెలుగు మీడియం వారి క్వశ్చన్‌ పేపర్‌ ఒకేలా లేకపోవడంతో విద్యార్ధుల్లో ఆందోళన నెలకొంది. ఇంగ్లిష్ మీడియం పేపర్లో ఒక ప్రశ్న మిస్‌ అయినట్లు విద్యార్ధులు గుర్తించారు. క్వశ్చన్‌ పేపర్‌లో 21వ ప్రశ్నలో ఈ పొరపాటు జరిగింది. తెలుగు మీడియం ప్రశ్నపత్రంలో 8 మార్కుల ప్రశ్నతోపాటు, 2 మార్కుల ప్రశ్నను కలిపి ఆడిగారు. ఇంగ్లిష్‌ మీడియంలో 8 మార్కుల ప్రశ్న మాత్రమే కనిపించింది.

తెలుగు మీడియం పేపర్‌లోని సెక్షని సిలో 19, 20 నెంబర్లలో ప్రశ్నలు సక్రమంగా వచ్చాయి. అయితే 21 ప్రశ్నలో 6 మార్కుల ప్రశ్న, 2 మార్కుల ప్రశ్నలు తెలుగు మీడియం పేపర్‌లో కనిపించాయి. ‘చక్కని పటం సహాయంతో ఒక కేంద్రక రియాక్టర్‌ సూత్రము, పనిచేసే విధానాన్ని వివరించండి? అనే 8 మార్కుల ప్రశ్న, ‘ఒకానొక పరమాణు బాంబు విస్ఫోటంలో ఒక మైక్రోగ్రామ్‌ యురేనియం సంపూర్ణంగా నాశనమైతే ఎంత శక్తి విడుదలవుతుంది?’ అనే 2 మార్కుల ప్రశ్న ఇచ్చారు. కానీ ఇంగ్లిష్‌ మీడియం పేపర్‌లో మాత్రం పరమాణు బాంబుకు సంబంధించిన 2 మార్కుల ప్రశ్న కనిపించలేదు. ఇంగ్లిష్‌ మీడియంలో 21వ ప్రశ్నకు కేవలం Explain the principle and working of a nuclear reactor with help of a labelled diag ram? అనే ప్రశ్న మాత్రమే ఇచ్చారు.

దీంతో తెలుగు మీడియం విద్యార్ధులు మొత్తం సమాధానాలు రాశారు. కానీ ఇంగ్లిష్‌ మీడియం విద్యార్ధులు మాత్రం సగం సమాధానం మాత్రమే రాసి వదిలేశారు. దీనిపై ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య స్పందించారు. ఫిజిక్స్‌ పేపర్ 2లో తప్పిదం జరిగిందని అన్నారు. 8 మార్కుల ప్రశ్న వరకు సమాధానం రాస్తే సరిపోతుందని వివరించారు. మూల్యాంకన ప్రక్రియలో జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. 21వ ప్రశ్నకు ప్రయత్నించిన, ప్రయత్నించకపోయినా విద్యార్ధులందరికీ 8 మార్కులను మూల్యాంకనంలో కలుపుతామని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఇంటర్ ఫిజిక్స్ క్వశ్చన్‌ పేపర్లో ఆ ప్రశ్న మిస్సింగ్‌.. ఇప్పుడెలా?
ఇంటర్ ఫిజిక్స్ క్వశ్చన్‌ పేపర్లో ఆ ప్రశ్న మిస్సింగ్‌.. ఇప్పుడెలా?
కాశీ నుంచి తెచ్చిన నీటిని ఇంట్లో ఉంచుకోవచ్చా..?
కాశీ నుంచి తెచ్చిన నీటిని ఇంట్లో ఉంచుకోవచ్చా..?
Team India: టీమిండియా విజయంలో కనిపించని హీరో అతనే..!
Team India: టీమిండియా విజయంలో కనిపించని హీరో అతనే..!
మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న మాజీ మంత్రి మల్లారెడ్డి!
మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న మాజీ మంత్రి మల్లారెడ్డి!
బెస్ట్‌ ట్రిక్స్‌..ఇలా చేశారంటే వంట గ్యాస్‌ను భారీగా ఆదా చేయొచ్చు
బెస్ట్‌ ట్రిక్స్‌..ఇలా చేశారంటే వంట గ్యాస్‌ను భారీగా ఆదా చేయొచ్చు
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా.. ఈ దేశాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసా
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా.. ఈ దేశాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసా
చెత్త అని తీసిపారేయకండి! సరిగ్గా వాడితే డబ్బులే డబ్బులు
చెత్త అని తీసిపారేయకండి! సరిగ్గా వాడితే డబ్బులే డబ్బులు
పీఎం కిసాన్ మీకు వస్తుందా..? రాదా..? ఇలా తెలుసుకోండి
పీఎం కిసాన్ మీకు వస్తుందా..? రాదా..? ఇలా తెలుసుకోండి
బాక్సింగ్ రింగ్‌లోకి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఫొటోస్ వైరల్
బాక్సింగ్ రింగ్‌లోకి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఫొటోస్ వైరల్
బుధవారం పుట్టినవారు మనీ మైండెడ్..! వీరు ఏ రంగంలో రాణిస్తారంటే..?
బుధవారం పుట్టినవారు మనీ మైండెడ్..! వీరు ఏ రంగంలో రాణిస్తారంటే..?