ధర తక్కువని.. టమాటా ఎక్కువగా తింటే మీ కిడ్నీలు మటాష్!
11 March 2026
TV9 Telugu
TV9 Telugu
టమాటా అంటే అందరికీ ఇష్టమే. అసలు టమాటాలు లేకుండా ఏ వంట సాగదు. కూరల్లోనే కాదు సాస్ ఇతర రూపాల్లో కూడా టమాటా వినియోగం విరివిగా ఉంది
TV9 Telugu
రుచిలోనే కాదు.. పోషకాలు అందించడంలోనూ టమాటా టాప్‌లో ఉంటాయి. సూప్ నుంచి చారు వరకు ఏదైనా చేసుకోవచ్చు. చవకగా దొరికేస్తుంది కూడా. కానీ అతి సర్వత్ర వర్జయేత్ అనే మాట టమాటాకూ వర్తిస్తుంది
TV9 Telugu
అతిగా తింటే అజీర్ణం వస్తుంది. వీటిలోని సల్మోనిలా అనే రసాయనం వల్ల కడుపు ఉబ్బరంగా తోచవచ్చు. ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ ఉన్నవారికి ఆ సమస్య అధికం కావచ్చు
TV9 Telugu
ఎసిడిటీ సమస్య.. టమాటాల్ని మరీ ఎక్కువగా తింటే, ఎసిడిటీ పెరిగే ప్రమాదం ఉంది. ఫలితంగా తేన్పులు, ఛాతీలో నొప్పి ఇబ్బంది పెడతాయి
TV9 Telugu
కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. పొటాషియం, ఆక్సలేట్ ఈ రెండు పదార్థాలూ కిడ్నీలో రాళ్లను పెంచవచ్చు. టమాటాలో ఈ రెండూ ఎక్కువే
TV9 Telugu
రక్తపోటు పెరిగే అవకావం ఉంది. టమాటాలో సోడియం తక్కువే. కానీ వీటిని సూప్‌గా తీసుకుంటే మాత్రం.. అధిక మొత్తంలో సోడియం చేరి రక్తపోటును పెంచేస్తుంది
TV9 Telugu
నొప్పులు.. టమాటాలో హిస్టమిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తి మీద ప్రతికూల ప్రభావం చూపించి, ఆర్థరైటిస్ లాంటి సమస్యల్ని తీవ్రతరం చేస్తుంది
TV9 Telugu
టమాటా అధికంగా తీసుకుంటే తలనొప్పి పెరుగుతుంది. తరచూ మైగ్రెయిన్ బారిన పడేవారు, టమాటాకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు