రైతుల పైనా అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం.. ధరలు పతనం
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ఉమ్మడి కర్నూలు జిల్లా అరటి రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. గల్ఫ్ దేశాలకు అరటి ఎగుమతులు నిలిచిపోవడంతో టన్ను ధర రూ.25,000 నుండి రూ.10,000 లోపుకు పడిపోయింది. దీంతో రైతులు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. యుద్ధం కారణంగా ఓడరేవులు మూసివేయడం ఈ ధరల పతనానికి ప్రధాన కారణం.
ఎక్కడో అమెరికా ఇరాన్‌పై దాడి చేస్తే.. ఆ దెబ్బ ఇక్కడ కర్నూలు జిల్లా రైతులకు తగిలింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అరటి సాగు చేసిన రైతుల పరిస్థితి ఇప్పుడు ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు’ తయారైంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు అరటి ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపడంతో, ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. కొన్ని రోజుల క్రితం వరకు టన్ను అరటి ధర రూ. 25,000 పలుకుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఎకరాకు అన్ని ఖర్చులు పోనూ రూ. 2 లక్షల వరకు లాభం వస్తుందని ఆశపడ్డారు. కానీ, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో కేవలం రెండు మూడు రోజుల వ్యవధిలోనే ధర 60 శాతానికి పైగా పడిపోయి, ప్రస్తుతం రూ. 10,000 లోపుకు చేరింది. గతంలో ధరలు లేక అరటిని రోడ్లపై పారబోసిన రోజులను రైతులు గుర్తు చేసుకుంటున్నారు. “ధర పెరుగుతుందేమోనని వేచి చూస్తే తోటలోనే కాయ మాగిపోయే ప్రమాదం ఉంది, కోసి అమ్ముదామంటే పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం కారణంగా ఓడరేవులు మూతపడటం, ఎగుమతులు ఆగిపోవడమే ఈ ధరల పతనానికి ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
150 శాతం పెరిగిన ఫ్లైట్ చార్జీలు.. ప్రయాణాలపై తీవ్ర ప్రభావం
బెంగళూరులో ‘గూగుల్’ టెకీ ఖర్చు నెలకు రూ.1.43 లక్షలా !! ఇలా అయితే బ్రతకడం ఎలా
అబ్బా.. మనోళ్లు పంపే డబ్బుపై యుద్ధం దెబ్బ..
వీధిలో నడుస్తున్నపెద్ద పులి.. చివరికి జరిగింది చూస్తే నోరెళ్లబెడతారు
బెంగళూరులో ‘గూగుల్’ టెకీ ఖర్చు నెలకు రూ.1.43 లక్షలా
వీధిలో నడుస్తున్న పెద్ద పులి.. చివరికి..
పొలంలో త్రిశూలాలు.. ఆశ్చర్యపోయిన జనం..
ఇదేం విడ్డూరం స్వామీ.. ఆటోలకు బేడీలా
స్కూల్ పిల్లలకు చెప్పుల దండ వేసిన టీచర్
గ్రామ సర్పంచ్‌లు తలలు పట్టుకునేలా చేస్తున్న కోతులు.. అయ్యో పాపం
బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం

