Telangana: ఆమ్యామ్యా తీసుకుంటూ.. అడ్డంగా బుక్కైన గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవో
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవో బోగోజు భిక్షమాచారి ఆదివారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. వరంగల్ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం..గుంజేడు ముసలమ్మ ఆలయ ఆవరణలో నల్లపు సాంబయ్య కొంత కాలంగా రాములు నుంచి షాపును సబ్లీజుకు తీసుకుని..
కొత్తగూడ, ఆగస్టు 19: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవో బోగోజు భిక్షమాచారి ఆదివారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. వరంగల్ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం..గుంజేడు ముసలమ్మ ఆలయ ఆవరణలో నల్లపు సాంబయ్య కొంత కాలంగా రాములు నుంచి షాపును సబ్లీజుకు తీసుకుని కిరాణం, కూల్ డ్రింక్ షాపు నిర్వహిస్తున్నాడు. ఇటీవల షాపులో గుట్కాలు, మద్యం దొరకడంతో షాపును సీజ్ చేశారు. అయితే ఎండోమెంట్కమీషనర్కార్యాలయంలో రూ.20 వేల ఫైన్చెల్లిస్తే షాపు లైసెన్స్పునరుద్ధరిస్తామని ఆలయ భిక్షమాచారి చెప్పారు. అయితే జరిమానాతోపాటు మరో రూ.20 వేలు అదనంగా చెల్లించాలని సాంబయ్యనుడిమాండ్ చేశాడు ఈవో భిక్షమాచారి.
దీంతో విసుగుచెందిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం ఆదివారం ఆలయ ఆవరణలో రూ.20 వేలు ఈవోకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రసాయన పరీక్షలు చేయగా.. నిందితుడి కుడి చేతి వేళ్లకు, లంచం డబ్బు దాచిన క్యాష్ కౌంటర్ డ్రాయర్‌లో కెమికల్ నమూనాలు ఉన్నట్లు తేలింది. దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. దీనిలో భాగంగా భిక్షామాచారి స్వగ్రామమైన మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఆయన ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసి, ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.70 వేల నగదు, 270 గ్రాముల వెండి, 4 గ్రాముల బంగారం, కొన్ని డాక్యుమెంట్లు లభ్యమైనట్టు ఏసీబీ సీఐ ఎస్ రాజు తెలిపారు. సోదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ ఎస్ రాజుతో పాటు ఏసీబీ సీఐ శ్యామ్సుందర్, సిబ్బంది పాల్గొన్నారు.
“Musalamma Temple E.O. Bhogoju Bhikshama Chary” was caught by #ACB officials for accepting ₹20,000/- bribe from the shop owner who came for permission to run a grocery shop in Gunjedu Village of Kothaguda Mandal in Mahabubabad District.#AntiCorruptionBureau #Telangana #Justice… pic.twitter.com/r4ov0g32OV
— ACB Telangana (@TelanganaACB) August 18, 2024