డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ యువకుడు.. రీడింగ్‌లో ఎంతొచ్చిందో తెలిస్తే..
మూడు కమిషనరేట్‌ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తరంగా కొనసాగుతున్నాయి. పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకున్న కొంతమంది తాగుబోతు వాహనదారులు మాత్రం ఎలాంటి మార్పు రావటం లేదు.

మూడు కమిషనరేట్‌ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తరంగా కొనసాగుతున్నాయి. పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకున్న కొంతమంది తాగుబోతు వాహనదారులు మాత్రం ఎలాంటి మార్పు రావటం లేదు. ఏకంగా 3,000 మంది డ్రంక్ అండ్ డ్రైవర్లు రెండోసారి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టబడ్డారు. గడిచిన రెండు సంవత్సరాల వ్యవధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన డ్రైవర్ల గణాంకాలను ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. సుమారు 3000 మంది రెండవసారి తాగి వాహనం నడిపి పోలీసులకు పట్టబడ్డారు.
వీరిలో రిపీటెడ్‌గా పోలీసులకు దొరుకుతున్న వారిలో ఎక్కువమందిని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. 2023 జనవరి నుండి ఇప్పటివరకు 1587 మంది మద్యం డ్రైవర్లను పోలీసులు పట్టుకున్నారు. వీరంతా రెండవసారి మద్యం సేవించి ఏదేచ్ఛగా వాహనం నడుపుతూ పోలీసులు తనిఖీల్లో బయటపడ్డారు. హైదరాబాద్ తర్వాత రెండో స్థానంలో సైబరాబాద్ ఉంది. సైబరాబాద్‌లో రిపీటెడ్‌గా మద్యం సేవించి వాహనం నడిపిన వారి సంఖ్య 956. వీరంతా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలోనే పోలీసులకు పట్టుబడ్డారు.
మూడు కమిషనరేట్‌ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పోలీసులు విస్తారంగా నిర్వహిస్తున్నారు. లోకల్ ట్రాఫిక్ పోలీసులు ప్రతి వీకెండ్‌లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. వాహనదారుల BAC(బ్లడ్ ఆల్కహాల్ కౌంట్) పరీక్షల ద్వారా పోలీసులు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీరిలో కొంతమందికి ఫైన్లతో సరిపెడితే మరి కొంతమందికి జైలు శిక్షను కోర్టులు విధిస్తున్నాయి. మొదటిసారి పట్టుబడితే ఫైన్‌తో సరిపెడుతున్నారు. రెండోసారి పట్టుబడితే ఫైన్‌తో పాటు జైలుకు పంపిస్తున్నారు.
ఒక జూలై నెలలోనే 2483 మద్యం వాహనదారులను పోలీసులు డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుకున్నారు. 15 రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో ఇంతమంది దొరికారు. వీరిలో 70 మందికి ఫైన్‌తో పాటు జైలు శిక్ష కూడా మెజిస్ట్రేట్ విధించారు. ఇందులో మొదటిసారి తాగి వాహనం నడిపిన వారే అధికంగా ఉన్నారు. వీరికి రెండు రోజుల నుండి 8 రోజుల వరకు జైలు శిక్షణ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేశారు.
పదేపదే తాగి వాహనం నడిపి పోలీసులకు పట్టుబడితే ఫైన్‌తో పాటు వీరి డ్రైవింగ్ లైసెన్స్ సైతం సస్పెండ్ చేస్తున్నారు అధికారులు. రిపీటెడ్‌గా దొరుకుతున్న వారి లైసెన్సులను రీజనల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్‌కు పంపిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నారు. BAC పరీక్షల్లో 200కు నుంచి వచ్చిన వారి సంఖ్య దాదాపు 100 మంది పైగా ఉన్నారు. సైబరాబాద్‌లో ఒక వాహనదారుడుని డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా అతడికి సుమారు 500 శాతం మోతాదుకు మించి వచ్చింది. అతడిని పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరపరిచారు. అతడికి ఫైన్‌తో పాటు జైలు శిక్షను విధించారు.