RBI: సైబర్ నేరాల్లో డబ్బులు కోల్పోయారా..? 5 రోజుల్లో ఇలా చేస్తే మీ అకౌంట్లోకి రూ.25 వేలు.. అందరూ పొందొచ్చు..
మీరు సైబర్ నేరంలో డబ్బులు కోల్పోయారా.. మీ బ్యాంక్ అకౌంట్లని నగదు మాయమైందా.. అయితే మీరు ఆర్బీఐ, బ్యాంకుల నుంచి ఆర్ధిక సాయం పొందవచ్చు. అవును.. ఇలాంటి బాధితులు రూ.25 వేల వరకు పరిహారం పొందవచ్చు. ఈ ఏడాది జులై 1 నుంచి అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది.

దేశంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. చదువుకున్న విద్యావంతులు కూడా వీటి ఊబిలో చిక్కుకుంటున్నారు. సైబర్ మోసాల కేసులు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ క్రమంలో వీటి కట్టడితో పాటు ఇలాంటి మోసాల బారిన పడి ఆర్ధికంగా నష్టపోయినవారికి సాయం అందించాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. తక్కువ మొత్తంలో డబ్బులు పొగొట్టుకున్న సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో సైబర్ మోసాల బారిన పడి డబ్బులు కోల్పోతే మీరు రూ.25 వేల వరకు పరిహారం పొందవచ్చు . ఇందుకోసం పలు నిబంధనలను రూపొందింది. ఈ పరిహారం పొందాలంటే ఏం చేయాలనే విషయాలను కూడా తెలిపింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
అర్హతలు ఇవే..
సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకురానుంది. ఇందుకోసం డ్రాప్ట్‌ను సిద్దంగా చేయగా.. ఆమోదం తర్వాత ఇది అమల్లోకి రానుంది. ఈ నిబంధనల ప్రకారం ఆన్ లైన్ మోసాలకు గురయ్యే కస్టమర్లకు నేరుగా ఉపశమనం కలగనుంది. దీని ప్రకారం ఎవరైనా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల్లో మోసానికి గురై అకౌంట్ల నుంచి డబ్బులు కట్ అయితే ఆర్ధిక సాయం అందిస్తారు. రూ.50 వేల వరకు డబ్బులు కోల్పోయినవారు పరిహారం అందుకోవడానికి అర్హులు. కష్టమర్ మొత్తం నష్టంలో 85 శాతం లేదా గరిష్టంగా రూ.25 వేల వరకు పొందవచ్చు. ఒక వ్యక్తికి జీవితకాలంలో ఒకసారి మాత్రమే ఈ పరిహారం పొందేందుకు అర్హులు. పదే పదే మోసానికి గురైతే లబ్ది పొందలేరు.
5 రోజుల్లో ఇలా చేస్తే..
ఇక పరిహారం ఎలా పొందాలనే దానిపై ఆర్బీఐ కొత్త నియమ, నిబంధనలను రూపొందింది. మోసపోయామని గ్రహించాక వెంటనే బ్యాంకులకు ఫిర్యాదు చేయాలి. మోసం జరిగిన ఐదు రోజుల్లోపు ఫిర్యాదు చేస్తేనే పరిహారం వస్తుంది. ఇక సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లేదా నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు దాఖలు చేయాలి. ఇక ఫిర్యాదును పరిశీలించాక పరిహారం అందుతుంది. ఫిర్యాదు అందిన తర్వాత కేవలం 5 రోజుల్లోనే బ్యాంకులు కస్టమర్లకు పరిహారాన్ని అందించాల్సి ఉంటుంది. ఆర్బీఐ, బ్యాంకులు కలిసి ఈ పరిహారాన్ని అందిస్తాయి. నష్టం రూ.29,412 కంటే తక్కువగా ఉంటే ఆర్బీఐ 65శాతం చెల్లిస్తుంది. మిగిలిన 20 శాతం కస్టమర్ బ్యాంకు, డబ్బులు జమ చేసిన బ్యాంక్ పంచుకుంటాయి. ఇక నష్టం రూ.29,412 నుంచి రూ.50 వేల మధ్య ఉంటే ఆర్బీఐ రూ.19,118 అందిస్తుంది. ఇక రూ.2,941 సబంధింత బ్యాంకులు చెల్లిస్తాయి. జులై 1వ తేదీ నుంచి ఈ ఆర్ధిక సాయం అందించే కార్యక్రమం అమల్లోకి రానుంది.
