మే 27 రాశిఫలాలు: ఉద్యోగ, ఆర్థిక విషయాల్లో ఈ రాశులకు అదృష్టం
Horoscope Today (May 27, 2026): బుధవారం రాశిఫలాల ప్రకారం మేష రాశి వారు కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉండగా ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగాల్లో గుర్తింపు, అధికారుల విశ్వాసం పెరుగుతాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహం లభించి శుభవార్తలు వినే సూచనలు కనిపిస్తున్నాయి. ఇలా మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ రోజు గ్రహస్థితులు ఎలా ప్రభావం చూపనున్నాయో తెలుసుకోండి.

దిన ఫలాలు (మే 27, 2026): మేష రాశి వారు కుటుంబంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలలో ఆశించిన లాభాలు పొందుతారు. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. అధికారులు బాగా ప్రాధాన్యం ఇస్తారు. వ్యాపారాలు కూడా ఉత్సాహంగా పురోగతి చెందుతాయి. కుటుంబంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలలో ఆశించిన లాభాలు పొందుతారు. కొన్ని వ్యక్తిగత పనులు తేలికగా పూర్తవుతాయి. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. బంధుమిత్రులతో అనుకోకుండా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ప్రయాణాల్లో కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా అనుకున్న లక్ష్యాల్ని సాధిస్తారు. ముఖ్యంగా వృత్తి జీవితంలో యాక్టివిటీ, రాబడి బాగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సమయం అన్ని విధాలుగానూ బాగుంది. మంచి సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపట్టి బాగా లబ్ధి పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. దూర ప్రాంత కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. జీతభత్యాలు, పదోన్నతికి సంబంధించి అధికారులు సానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లల్లో ఒకరికి ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులు, ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మిత్రులను ఆదుకుంటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, వ్యాపారాల్లో కొన్ని లాభదాయక మార్పులు చేపడతారు. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. విదేశీయానానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలుంటాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుతాయి. దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా పురోగమిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. మంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలకు వెడతారు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో మీ మాటకు బాగా విలువ పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో పనితీరుతో అధికారులను బాగా ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలపరంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలను సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడే అవకాశముంది. సోదరులతో వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగి పోతాయి. కుటుంబ వ్యవహారాలు సానుకూలపడతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో కొద్దిగా పనిభారం, ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ లాభసాటిగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. కుటుంబ పెద్దల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. చేపట్టిన పనులన్నీ కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో నెరవేరుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయవద్దు.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో వివాదాలు, అపార్థాల నుంచి బయటపడతారు. వ్యాపార కార్యకలాపాలు, లావాదేవీలు లాభదాయకంగా పురోగమిస్తాయి. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. కుటుంబ సభ్యుల వల్ల సమస్యలుంటాయి. విశ్రాంతి కరువవుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థికంగా సమయం బాగా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను కూడా కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.