AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాలు.. UPSCలో ఉద్యోగ అవకాశాలు

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 538 గ్రూప్ 'ఏ', 'బి' గెజిటెడ్ పోస్టుల భర్తీకి UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జులై 3, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాల ప్రకారం విద్యార్హతలు, అనుభవం, వయోపరిమితి మారనున్నాయి..

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాలు.. UPSCలో ఉద్యోగ అవకాశాలు
UPSC Group A and B Recruitment
Srilakshmi C
|

Updated on: Jun 23, 2026 | 10:07 AM

Share

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ ‘ఏ’, గ్రూప్ ‘బి’ గెజిటెడ్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 538 ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జులై 3, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌లో జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, రీజినల్ డైరెక్టర్, ఆపరేషన్స్ ఆఫీసర్ (డీజీసీఏ), ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్, అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ గ్రేడ్-2, అసిస్టెంట్ మైనింగ్ జియాలజిస్ట్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రిన్సిపల్ (సీనియర్ సెకండరీ స్కూల్), అసిస్టెంట్ రిజిస్ట్రార్, ప్రైవేట్ సెక్రటరీ తదితర పోస్టులు ఉన్నాయి.

యూపీఎస్సీ గ్రూప్ ‘ఏ’, గ్రూప్ ‘బి’ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

పోస్టుల వివరాలు

  • జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ పోస్టుల సంఖ్య: 9
  • రీజినల్‌ డైరెక్టర్‌ పోస్టుల సంఖ్య: 2
  • ఆపరేషన్స్‌ ఆఫీసర్‌ (డీజీసీఏ) పోస్టుల సంఖ్య: 19
  • ఏయిర్‌ సెఫ్టీ ఆఫీసర్‌ పోస్టుల సంఖ్య: 15
  • అసిస్టెంట్‌ లీగల్‌ అడ్వైజర్‌ పోస్టుల సంఖ్య: 12
  • అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టుల సంఖ్య: 15
  • అసిస్టెంట్‌ గ్రేడ్‌-2 పోస్టుల సంఖ్య: 50
  • అసిస్టెంట్‌ మైనింగ్‌ జియోలజిస్ట్‌ పోస్టుల సంఖ్య: 5
  • అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోస్టుల సంఖ్య: 5
  • ప్రిన్సిపల్‌ (సీనియర్‌ సెకండరీ స్కూల్‌) పోస్టుల సంఖ్య: 7
  • అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ పోస్టుల సంఖ్య: 11
  • ప్రైవేట్‌ సెక్రటరీ పోస్టుల సంఖ్య: 12

అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్న పోస్టును బట్టి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/బీటెక్, పీజీ, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌బీ వంటి అర్హతలు కలిగి ఉండాలి. కొన్ని పోస్టులకు సంబంధిత రంగంలో ఉద్యోగ అనుభవం కూడా తప్పనిసరి. అభ్యర్ధుల వయోపరిమితి పోస్టును బట్టి 30 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జులై 3, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుష అభ్యర్థులు రూ.25 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కల్పించారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అవసరమైతే రిక్రూట్‌మెంట్ టెస్ట్ నిర్వహించి, అందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేపడతారు. ఎంపికైన వారికి నెలకు రూ.44,900 నుంచి రూ.2,18,200 వరకు జీతంగా చెల్లిస్తారు.

యూపీఎస్సీ గ్రూప్ ‘ఏ’, గ్రూప్ ‘బి’ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us