ఖాళీగా ఓలా.. అయినా ఉబర్ కోసం అరగంట వెయిటింగ్! బెంగళూరులో వింత ఘటన
బెంగళూరు విమానాశ్రయంలో ఓలా క్యాబ్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రయాణికులు ఉబర్ కోసం క్యూలో నిలబడిన ఘటన చర్చనీయాంశమైంది. ఈ ఘటనను బ్రాండ్ లాయల్టీకి ఉదాహరణగా పేర్కొంటూ నిపుణులు వినియోగదారుల మానసికతను విశ్లేషిస్తున్నారు. ధర కంటే నమ్మకం, అలవాటు, సేవలపై ఉన్న విశ్వాసమే చాలాసార్లు వినియోగదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తుందని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.
బెంగళూరు విమానాశ్రయం టెర్మినల్ లో ఉబర్ క్యాబ్ కోసం దాదాపు 40 మంది ప్రయాణికులు క్యూలో నిలబడ్డారు. అదే సమయంలో ఓలా క్యాబ్‌లు సిద్ధంగా ఉన్నాయి. వెంటనే ప్రయాణం ప్రారంభించవచ్చని సిబ్బంది చెబుతున్నప్పటికీ ఎవరూ అక్కడికి వెళ్లలేదు. ఇది బ్రాండ్ లాయల్టీ అనే మానసిక భావనకు ఉదాహరణ అని ఆకాశ్ కొటాల్వార్ అనే వ్యక్తి తన లింక్డ్‌ఇన్ పోస్టులో ఈ పరిణామం పై విశ్లేషించారు. . కొత్త సేవకు మారితే ఏమవుతుందో తెలియని అనిశ్చితి, ఇప్పటికే అలవాటైన సేవను వదలాలంటే ఇబ్బంది వల్ల ఇలా ప్రవర్తిస్తారని చెప్పుకొచ్చారు. ఈ కేసులో జర్నీ కోసం మరో యాప్ డౌన్‌లోడ్ చేయడం, కొత్త సేవను ప్రయత్నించడం, అనిశ్చితిని ఎదుర్కోవడం కంటే ఇప్పటికే తెలిసిన సేవనే వినియోగదారులు ఎంచుకుంటారని వివరించారు. అంటే.. ప్రజలు కేవలం తక్కువ ధర కోసం కాకుండా, “ఏం జరుగుతుందో ముందే తెలిసిన నమ్మకం” కోసం కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారట. ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు ఉబర్ సేవలు గతంలో మరింత స్థిరంగా, వినియోగదారులకు అనుకూలంగా ఉండటంతో ప్రజలు దానిని ఎక్కువగా నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం వినియోగదారుల నిర్ణయం పరిస్థితిని బట్టి మారుతుందని, ధరలు, సౌలభ్యం, ప్రయాణ సమయం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డారు. మొత్తంగా.. బెంగళూరు విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ఒక విషయాన్ని స్పష్టం చేసింది. వినియోగదారుల చాయిస్ మన అంచనాలకు తగ్గట్టు ఉండదు. ఓలా క్యాబ్‌లు సిద్ధంగా ఉన్నా.. ఉబర్ కోసం ప్రయాణికులు క్యూలో నిలబడిన దృశ్యం ఇప్పుడు చర్చకు దారితీసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
11 ఏళ్లకే యూకే యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా రికార్డ్.. వైజాగ్ టు లండన్ కలశ నాయుడు ప్రయాణం
ఉద్యోగితో రూ. 2.5 లక్షల ఫిట్‌నెస్ బెట్ లో ఓడిన జెరోదా బాస్
ఫోన్ దొంగిలించి పారిపోతూ కుప్పకూలిన దొంగ.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో..
ఖాళీగా ఓలా.. అయినా ఉబర్ కోసం అరగంట వెయిటింగ్!
11 ఏళ్లకే యూకే యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా రికార్డ్..
ఉద్యోగితో రూ. 2.5 లక్షల ఫిట్‌నెస్ బెట్ లో ఓడిన జెరోదా బాస్
ఫోన్ దొంగిలించి పారిపోతూ కుప్పకూలిన దొంగ.. క్షణాల్లో
వీడు మామూలోడు కాదు.. పగలు ఇళ్లకు రంగులు.. రాత్రయితే చాలు..
అంతరిక్షంలో వింత.. 'ఆ గ్రహం' పై ఉప్పు వర్షం..
టీచర్‌గా మారిన ఎస్పీ.. క్లాస్‌లో పాఠాలు చెబుతూ..

