AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీమిండియా నుంచి ఆ ముగ్గురు బ్యాగులు సర్దుకోవాల్సిందే.. వన్డే వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఔట్..?

ODI World Cup 2027: కాలం మారుతున్న కొద్దీ పాత తరం తప్పుకుని కొత్త తరం రావడం సహజం. భారత క్రికెట్ భవిష్యత్తు కోసం సెలెక్టర్లు తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు అభిమానులకు కొంత నిరాశ కలిగించినా, రాబోయే ప్రపంచకప్‌లో సరికొత్త టీమ్ ఇండియాని చూసేందుకు ఇవి అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Venkata Chari
|

Updated on: Jun 23, 2026 | 6:50 AM

Share
Indian Cricket Team Selection: భారత క్రికెట్‌లో ఇప్పుడు సరికొత్త శకం మొదలైంది. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లతో సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది మేనేజ్‌మెంట్. అయితే, ఈ మార్పుల వల్ల ముగ్గురు అగ్రశ్రేణి సీనియర్ ఆటగాళ్ల వన్డే కెరీర్‌కు దాదాపు తెరపడినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తు జట్టులో వారికి చోటు దక్కడం ఇక కల్వృక్షమేనా అనే చర్చ జోరందుకుంది.

1 / 5
మిషన్ 2027.. యువ రక్తం వైపే మొగ్గు..!: దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల వేదికగా జరగనున్న రాబోయే వన్డే ప్రపంచకప్ కోసం బీసీసీఐ ఇప్పటి నుంచే రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తోంది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కుర్రాళ్లు అద్భుత ప్రదర్శన చేయగా, తదుపరి ఇంగ్లాండ్ పర్యటనకు మరింత పటిష్టమైన యువ జట్టును ఎంపిక చేశారు. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని ఈ జట్టును గమనిస్తే, భవిష్యత్తు వన్డే ఫార్మాట్ అంతా వీరి చుట్టూనే తిరగనుందని స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే కొందరు దిగ్గజ ఆటగాళ్లను సెలెక్టర్లు పూర్తిగా పక్కన పెట్టడం గమనార్హం.

2 / 5
1. రవీంద్ర జడేజా: సర్ జడేజా శకం ముగిసినట్లేనా?: భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు వన్డేల్లో ఇక దారులు మూసుకుపోయినట్లే కనిపిస్తోంది. న్యూజిలాండ్ సిరీస్‌లో ఆడినప్పటికీ, ఆ తర్వాత అఫ్గానిస్తాన్, ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్‌లకు అతడిని పూర్తిగా విస్మరించారు. జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌కు పెద్దపీట వేస్తుండటం, యువ ఆల్‌రౌండర్లపై నమ్మకం ఉంచడం చూస్తుంటే 2027 ప్రపంచకప్ ప్రణాళికల్లో జడేజా లేడనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

3 / 5
2. రిషభ్ పంత్: కిషన్ మెరుపులతో కష్టాల్లో పంత్..!: టెస్టుల్లో తిరుగులేని రికార్డు ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు వన్డే ఫార్మాట్‌లో మాత్రం కాలం కలిసిరావడం లేదు. గత కొంతకాలంగా జట్టులో ఉన్నా తుది జట్టులో అవకాశం దక్కడం గగనంగా మారింది. అఫ్గానిస్తాన్ సిరీస్‌లో పంత్‌ను పక్కనపెట్టి ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇవ్వగా, అతను సెంచరీతో చెలరేగి తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ సిరీస్‌కు కూడా కిషన్‌నే ఎంపిక చేయడంతో, వన్డేల్లో పంత్ పునరాగమనం దాదాపు అసాధ్యంగా మారింది.

4 / 5
3. మహమ్మద్ షమీ: స్పీడ్‌స్టర్‌కు దక్కని చోటు..: భారత పేస్ దళంలో ఒకప్పుడు కీలకమైన మహమ్మద్ షమీ ప్రస్తుతం ఏ ఫార్మాట్‌లోనూ కనిపించడం లేదు. సీనియారిటీ పరంగా ప్రపంచకప్‌కు అతడి అనుభవం ఉపయోగపడుతుందని భావించినా, సెలెక్టర్ల ఆలోచనలు వేరేలా ఉన్నాయి. గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా వంటి యువ పేసర్లను మూడో సీనియర్ బౌలర్ ప్రత్యామ్నాయాలుగా సిద్ధం చేస్తున్నారు. దీంతో షమీ వన్డే కెరీర్‌కు కూడా సెలెక్టర్లు ముగింపు పలికినట్లేనని అర్థమవుతోంది.

5 / 5
Follow Us