AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐసీసీ వన్డే ప్రపంచకప్

ఐసీసీ వన్డే ప్రపంచకప్

ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ అనేది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మకమైన 50 ఓవర్ల క్రికెట్ టోర్నమెంట్. మొదటి వన్డే ప్రపంచ కప్ టోర్నీ 1975లో ఇంగ్లాండ్‌లో ప్రారంభమైంది.

ఈ మెగా టోర్నమెంట్ చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన ముఖ్యాంశాలు:

అత్యంత విజయవంతమైన జట్టు: క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా అత్యధికంగా 6 సార్లు (1987, 1999, 2003, 2007, 2015, 2023) ప్రపంచ కప్ టైటిళ్లను గెలుచుకుని అగ్రస్థానంలో నిలిచింది.

భారత్ రికార్డు: భారతదేశం రెండు సార్లు వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. మొదటిసారి 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో, రెండోసారి 2011లో ఎం.ఎస్. ధోని కెప్టెన్సీలో భారత్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అలాగే 2003, 2023లలో రన్నరప్‌గా నిలిచింది.

ఇతర విజేతలు: వెస్టిండీస్ (2 సార్లు – 1975, 1979), పాకిస్తాన్ (1992), శ్రీలంక (1996), ఇంగ్లాండ్ (2019) ఒక్కొక్కసారి చొప్పున ప్రపంచ కప్‌ను గెలుచుకున్నాయి.

డిఫెండింగ్ ఛాంపియన్: 2023లో భారతదేశంలో జరిగిన చివరి వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా ప్రస్తుత ఛాంపియన్‌గా కొనసాగుతోంది.

2027 ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 14వ ఎడిషన్ టోర్నమెంట్‌గా నిలవనుంది. దీనికి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈసారి టోర్నమెంట్‌ను 14 జట్ల విస్తృత ఫార్మాట్‌తో నిర్వహించనున్నారు. 2023లో ఆరోసారి టైటిల్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.

2027 ప్రపంచ కప్ ముఖ్య వివరాలు:

ఆతిథ్య దేశాలు: దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా.

పాల్గొనే జట్లు: 14 జట్లకు పెంపు.

డిఫెండింగ్ ఛాంపియన్: ఆస్ట్రేలియా.

అర్హత (క్వాలిఫికేషన్): ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మొదటి ఎనిమిది స్థానాల్లో ఉన్న పూర్తి స్థాయి సభ్య దేశాలతో పాటు, సహ-ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వేలు నేరుగా అర్హత సాధిస్తాయి. మిగిలిన జట్లు క్వాలిఫైయర్స్ ద్వారా పోటీ పడాల్సి ఉంటుంది.

అర్హత సంక్లిష్టత: ఐసీసీ కఠినమైన ర్యాంకింగ్ నిబంధనల కారణంగా, సహ-ఆతిథ్య దేశమైనప్పటికీ నమీబియా నేరుగా అర్హత సాధించలేదు. అది క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.

ఇంకా చదవండి

ఆలోచిస్తేనే భయమేస్తోంది.. వరల్డ్ కప్‌లో అతడి విశ్వరూపాన్ని తట్టుకోలేరు.. ప్రత్యర్థులకు ఏబీడీ మాస్ వార్నింగ్..!

AB de Villiers Comments on Virat Kohli: విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో మూడో పీక్ స్టేజ్‌లో ఉన్నాడు. ఒత్తిడి లేకుండా సహజమైన ఆటతో దూసుకుపోతున్న అతడి ఫామ్‌ను చూసి ఏబీ డివిలియర్స్ ఆశ్చర్యపోయాడు. 2027 వరల్డ్ కప్‌లో కోహ్లీ ప్రభావం ఎంత భారీగా ఉండబోతుందో ఊహించుకోవడం భయంకరమని డివిలియర్స్ పేర్కొన్నాడు. ఈ సహజమైన దూకుడు టీమ్‌ఇండియాకు ఎంతో బలం చేకూర్చనుంది.

రోహిత్, కోహ్లీ ఇన్.. వాళ్లకు మాత్రం మొండిచేయి.. వరల్డ్ కప్ 2027కు టీమిండియా స్వ్కాడ్ ఫిక్స్..?

2027 వన్డే వరల్డ్ కప్‌కు అధికారిక షెడ్యూల్ విడుదలైన వేళ టీమిండియా (Team India) కూర్పుపై చర్చ మొదలైంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరిగే టోర్నీ కోసం సమతూకమైన 15 మంది బృందాన్ని సిద్ధం చేసే దిశగా ఎంపికపై అంచనాలు ఉన్నాయి. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఉండే అవకాశం కనిపిస్తోంది.

IND vs NZ: వెస్టిండీస్ సిరీస్ తర్వాత.. కోహ్లీ, రోహిత్ మళ్లీ మ్యాచ్ ఆడేది ఎప్పుడంటే..?

India vs New Zealand ODI: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ముగిసింది. ఇప్పుడు భారత అభిమానుల దృష్టి విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) తదుపరి వన్డే మ్యాచ్‌లపై ఉంది. ఇద్దరూ న్యూజిలాండ్ పర్యటనలో తిరిగి బరిలోకి దిగనున్నారు. ఐదు వన్డేల సిరీస్ నవంబర్ 4న ఆక్లాండ్ వేదికగా మొదలవుతుంది.

ODI World Cup 2027: వరల్డ్‌కప్ 2027లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’ కలవరం.. బంగ్లాదేశ్ జట్టు పరిస్థితి అగమ్యగోచరం

ODI World Cup 2027: 2027 వన్డే వరల్డ్‌కప్ కోసం ఐసీసీ ప్రకటించిన గ్రూప్‌లలో గ్రూప్ బి అత్యంత ప్రమాదకరమైనదిగా నిలిచింది. ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక వంటి పటిష్టమైన జట్లు ఉండటంతో బంగ్లాదేశ్ జట్టు సూపర్-7 దశకు చేరడం కష్టంగా మారింది.

  • Rakesh
  • Updated on: Oct 2, 2026
  • 4:55 pm

World Cup 2027 Schedule: వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్.. భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే ?

ICC World Cup 2027: ఐసీసీ 2027 వన్డే ప్రపంచకప్ అధికారిక షెడ్యూల్‌‌ను నేడు కేప్ టౌన్‌లో విడుదల చేసింది. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఈ మెగా టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నాయి. టోర్నమెంట్ ప్రారంభానికి సరిగ్గా ఏడాది ముందు ఈ ప్రకటన వెలువడింది.

Team India: ఆ ఇద్దరిలో ఒక్కరికే ఛాన్స్.. 2027 ప్రపంచకప్ ప్లాన్స్‌‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు..!

రవీంద్ర జడేజా (Ravindra Jadeja) 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో ఇంకా ఉన్నాడా? వెస్టిండీస్‌తో సిరీస్ వేళ భారత స్పిన్ బౌలింగ్ కోచ్ సైరాజ్ బహుతులే చేసిన వ్యాఖ్యలు ఈ అంశంపై ఆసక్తి పెంచాయి. బ్యాటింగ్ సామర్థ్యం, అనుభవం, బౌలింగ్ మెరుగుదల కారణంగా జడేజాను మరోసారి పరిశీలిస్తున్నట్లు ఆయన సంకేతం ఇచ్చారు.

ODI World Cup: వన్డే ప్రపంచ కప్‌లో ‘స్టాప్ క్లాక్’ నియమం.. ఇకపై ఆ పప్పులు ఉడకవంతే..!

Stop Clock Rule: ఆధునిక క్రికెట్‌లో గంటల తరబడి సాగే మ్యాచ్‌లకు అడ్డుకట్ట వేయడానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఒక బృహత్ ప్రణాళికను రూపొందించింది. టీ20 మ్యాచ్‌ల వేగాన్ని పెంచడానికి ప్రవేశపెట్టిన విప్లవాత్మక 'స్టాప్ క్లాక్' నిబంధనను ఇప్పుడు వన్డే క్రికెట్‌లో కూడా అధికారికంగా తప్పనిసరి చేశారు.

ODI World Cup: కోహ్లీ ఇన్.. రోహిత్ డౌట్.. ప్రపంచకప్ కోసం 15 మంది ఆటగాళ్లు ఫిక్స్..?

Team Indias Probable Squad for the 2027 ODI World Cup: 2027 వన్డే ప్రపంచకప్‌నకు భారత జట్టు కూర్పుపై అప్పుడే చర్చలు ఊపందుకున్నాయి. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడటం ఖాయంగా కనిపిస్తుండగా, శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ చేసే ఛాన్స్ ఉంది. ఇక శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉంది.

2027 World Cup: గంభీర్, గిల్ కీలక ప్రతిపాదన.. వన్డే ప్రపంచకప్‌ కోసం బీసీసీఐ భారీ స్కెచ్..!

2027 World Cup: దక్షిణాఫ్రికాలో జరిగే ప్రపంచకప్‌నకు ముందు కీలక నిర్ణయం తీసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమ్‌ మేనేజ్‌మెంట్ అభ్యర్థనతో బీసీసీఐ.. క్రికెట్ సౌత్‌ ఆఫ్రికాతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ODI World Cup: ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం.. వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఎందుకంటే?

Australia Reshapes ODI Future with New Talent for 2027 World Cup: ఆస్ట్రేలియా 2027 ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే వన్డే సిరీస్ ల నుంచి కీలక ఆటగాడు మార్నస్ లబుషేన్‌ను తప్పించింది. గత కొంతకాలంగా ఫామ్‌ లేమితో ఇబ్బంది పడుతోన్న మార్నస్ లబుషేన్‌ స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని నిర్ణయించుకుంది. ఈ 2 సిరీస్ లు 2027 ప్రపంచకప్ సన్నాహకాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి.

Team India: 24 గంటల్లోనే మరో గాయం.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?

All Rounder Hardik Pandya Injury: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య మరోసారి గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో జరగనున్న ఆప్థానిస్తాన్ సిరీస్ కు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. బీసీసీఐ నుంచి ఎలాంటి అప్ డేట్ వస్తుందోనని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

వన్డే ప్రపంచకప్ 2027 కోసం దూసుకొస్తోన్న తెలుగోడు.. డేంజర్ జోన్‌లో సర్పంచ్ సాబ్ ప్లేస్..!

Shreyas Iyer Replacement for ODI World Cup 2027: వన్డే ప్రపంచ కప్ 2027 కోసం టీమిండియా జట్టు కూర్పుపై కసరత్తు ప్రారంభించింది. శ్రేయస్ అయ్యర్ స్థానంలో హైదరాబాదీ యువ బ్యాటర్ తిలక్ వర్మను నంబర్ 4కు సిద్ధం చేస్తున్నారు. అయ్యర్ ఫిట్‌నెస్, ఫీల్డింగ్‌పై ఆందోళనలు, తిలక్ ఎడమచేతి వాటం బ్యాటర్ అవ్వడం అతనికి అదనపు ప్రయోజనంగా నిలుస్తుంది.

సర్వీస్ పిస్టల్‌తో కానిస్టేబుల్ కాల్చుకుని మృతి!
సర్వీస్ పిస్టల్‌తో కానిస్టేబుల్ కాల్చుకుని మృతి!
అధిక వడ్డీ అని ఆశపడ్డారు..కట్‌చేస్తే ఏకంగా రూ. 10కోట్లతో జంప్
అధిక వడ్డీ అని ఆశపడ్డారు..కట్‌చేస్తే ఏకంగా రూ. 10కోట్లతో జంప్
జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? అసలు కారణం ఇదే..శాశ్వత పరిష్కారం
జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? అసలు కారణం ఇదే..శాశ్వత పరిష్కారం
కోర్టుల చుట్టూ తిరిగి అవకాశాలు, ఆస్తులు పోగొట్టుకున్నాడు
కోర్టుల చుట్టూ తిరిగి అవకాశాలు, ఆస్తులు పోగొట్టుకున్నాడు
టీమిండియా ప్లేయర్లపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..!
టీమిండియా ప్లేయర్లపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..!
నెమలి గురించి అసలు విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
నెమలి గురించి అసలు విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
వయస్సు 26 ఏళ్లు.. రూ.18 వేల జీతంతో రూ.75 లక్షల ఆస్తులు..
వయస్సు 26 ఏళ్లు.. రూ.18 వేల జీతంతో రూ.75 లక్షల ఆస్తులు..
సత్య సాయిబాబా బయోపిక్ చేయలేను.. కారణమేంటో చెప్పిన హీరో విజయ్
సత్య సాయిబాబా బయోపిక్ చేయలేను.. కారణమేంటో చెప్పిన హీరో విజయ్
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
ఆ హీరోయిన్ ను ఫంక్షన్ లో పిలిస్తే పట్టించుకోకుండా వెళ్లిపోయింది..
ఆ హీరోయిన్ ను ఫంక్షన్ లో పిలిస్తే పట్టించుకోకుండా వెళ్లిపోయింది..