AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మవారి ఆలయంలో అదృశ్య మేక.. మూడు నెలలుగా ఒకే చోట ప్రత్యక్షం..? దగ్గరికెళితే మాయం!

ఆషాఢం అమ్మవార్ల పూజలకు అనువైన మాసం.. ఈ మాసంలో అమ్మవార్లకు విశేష పూజలు, పండుగలు నిర్వహిస్తుంటారు. అలాంటి ఆషాఢ మాసంలో అమ్మవారి ఆలయంలో ఒక అద్భుత దృశ్యం కనిపించింది. జోగ్ని మాత ఆలయంలో ఒక వింత మేక ప్రత్యక్షమైంది. గత మూడు నెలలుగా ఆ మేక ఒకేచోట కనిపిస్తూ అటు స్థానికుల్ని , ఇటు భక్తుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతేకాదు. ఎవరైనా దానికి దగ్గరగా వెళితే కనిపించకుండా అదృశ్యం కావటం మరింత ఆశ్చర్యంగా మారింది. ఈ ఆసక్తికర సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

అమ్మవారి ఆలయంలో అదృశ్య మేక.. మూడు నెలలుగా ఒకే చోట ప్రత్యక్షం..? దగ్గరికెళితే మాయం!
Mystery Goat
Jyothi Gadda
|

Updated on: Aug 10, 2026 | 4:42 PM

Share

హిమాచల్ ప్రదేశ్ అనగానే దేవుళ్ల భూమిగా పేరుగాంచింది. ఇక్కడి సంస్కృతి, ఆలయాలు, వాటితో ముడిపడి ఉన్న నమ్మకాలు ఎప్పుడూ విభిన్నంగానే ఉంటాయి. తాజాగా కులు జిల్లాలోని ఝీరి వద్ద గల ప్రముఖ జోగ్నీ మాతా ఆలయం సమీపంలో ఒక మేక కనిపిస్తున్న తీరు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ మేక ప్రవర్తన సాధారణంగా కాకుండా కాస్త వింతగా ఉండటంతో, దీనిని చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు, భక్తులు ఆలయానికి క్యూ కడుతున్నారు.

మూడు నెలలుగా ఒకే చోట ప్రత్యక్షం:

స్థానిక నివాసితులు, భక్తుల సమాచారం ప్రకారం, ఈ మేక దాదాపు గత మూడు నెలలుగా ఆలయ ప్రాంగణంలోనే క్రమం తప్పకుండా కనిపిస్తోంది. సాధారణంగా జంతువులు స్థలాలను మారుస్తూ తిరుగుతుంటాయి. కానీ, ఈ మేక మాత్రం రోజువారీగా ఒకే చోట కనిపిస్తూ ఆలయ పరిసరాల్లోనే ప్రదక్షిణలు చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీని ప్రవర్తన విభిన్నంగా ఉండటంతో ప్రజలు దీనిని నిశితంగా గమనించడం ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

దగ్గరకు వెళ్తే మాయమవుతుందా?:

ఈ మేకకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేక అసలు ఏమీ తినడం లేదా తాగడం ఎవరూ చూడలేదని, అలాగే ఎవరైనా దీనిని పట్టుకోవడానికి లేదా దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నిస్తే ఒక్కసారిగా కంటికి కనిపించకుండా మాయమవుతుందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, ఇవి కేవలం సోషల్ మీడియా ప్రచారాలా లేక నిజంగానే జంతువు మరేదైనా దారిన వెళ్తుందా అనేది స్పష్టంగా తెలియదు.

నెట్టింట వైరల్ అయిన వీడియోలు:

సోషల్ మీడియా X లో ది మోడర్న్ హిమాచల్ అనే ఖాతా ద్వారా ఈ మేకకు సంబంధించిన వీడియోలు, దృశ్యాలు షేర్‌ చేయడంతో ఇంటర్‌నెట్‌ వేధికగా విపరీతంగా వైరల్ అయింది. ఈ వీడియోలు చూసిన అనేకమంది నెటిజన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు, ఈ రహస్య మేక కోసం కూడా వెతకడం ప్రారంభించారు. స్థానిక ఆధ్యాత్మిక నమ్మకాల ప్రకారం కొందరు దీనిని దైవికమైన సంకేతంగా భావిస్తుంటే, మరికొందరు మాత్రం ఇది కేవలం జంతువుల సహజ ప్రవర్తన అని అంటున్నారు.

పెరిగిన భక్తుల రద్దీ:

ప్రస్తుతం జోగ్నీ మాతా ఆలయానికి వచ్చే భక్తులు తమ సాధారణ పూజా కార్యక్రమాలతో పాటు ఈ మేకను చూసేందుకు, దాని కదలికలను గమనించేందుకు ప్రత్యేకంగా వేచి చూస్తున్నారు. ఏదైనా శాస్త్రీయ ఆధారం లేదా అధికారిక కారణం లేకపోయినప్పటికీ, దైవక్షేత్రం వద్ద ఇలాంటి వింతైన అలవాట్లతో మేక సంచరిస్తుండటం స్థానికంగా ఒక ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

వీడియో ఇక్కడ చూడండి..

ప్రకృతి ఒడిలో ఉండే ఆలయ పరిసరాలు ప్రశాంతంగా ఉండటం వల్ల, మానవ సంచారం లేని సమయాల్లో లేదా ఆహారం దొరికే చోట జంతువులు ఇలా ఒకే చోట అలవాటు పడటం సాధారణమే అయినప్పటికీ, దైవక్షేత్రం వద్ద జరగడంతో ఈ ఉదంతం ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
వర్షాకాలంలో బొప్పాయి తింటే ఏమవుతుంది? ఈ పొరపాటు అస్సలు చేయొద్దు..
వర్షాకాలంలో బొప్పాయి తింటే ఏమవుతుంది? ఈ పొరపాటు అస్సలు చేయొద్దు..
అమ్మవారి ఆలయంలో అదృశ్య మేక ప్రత్యక్షం..దగ్గరికెళితే మాయం!
అమ్మవారి ఆలయంలో అదృశ్య మేక ప్రత్యక్షం..దగ్గరికెళితే మాయం!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో వారం పాటు వర్షాలు!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో వారం పాటు వర్షాలు!
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదాపై కేంద్రం కీలక ప్రకటన
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదాపై కేంద్రం కీలక ప్రకటన
షిర్డీ వెళ్లాలనుకుంటున్నారా? హైదరాబాద్ నుంచి 3 రోజుల టూర్..
షిర్డీ వెళ్లాలనుకుంటున్నారా? హైదరాబాద్ నుంచి 3 రోజుల టూర్..
అతనిలా నటించడం ఎవరివల్ల కాదు..!
అతనిలా నటించడం ఎవరివల్ల కాదు..!
గోధుమ పిండితో ఈజీగా చేసుకునే సూపర్ టేస్టీ వెజ్ ప్యాకెట్స్..
గోధుమ పిండితో ఈజీగా చేసుకునే సూపర్ టేస్టీ వెజ్ ప్యాకెట్స్..
100 గజాల స్థలంలో బేస్‌మెంట్ వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?
100 గజాల స్థలంలో బేస్‌మెంట్ వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?
బోనాల జాతరలో అమ్మవారి భవిష్యవాణి.. ఆచారాలను వీడితే అనర్థాలే అంటూ
బోనాల జాతరలో అమ్మవారి భవిష్యవాణి.. ఆచారాలను వీడితే అనర్థాలే అంటూ
ఫిట్‌గా ఉంటే పక్కన పెట్టొద్దు..సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన
ఫిట్‌గా ఉంటే పక్కన పెట్టొద్దు..సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన