AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐసీసీ సంచలన నిర్ణయం.. ఇకపై ప్రపంచకప్‌లలో మరిన్ని భారత్ – పాక్ మ్యాచ్‌లు.. స్కెచ్ మాములుగా లేదుగా..!

India vs Pakistan World Cup Matches: క్రికెట్ అభిమానుల నాడిని పట్టుకోవడంలో జై షా నేతృత్వంలోని ఐసీసీ మరోసారి విజయం సాధించింది. సాంప్రదాయ ఫార్మాట్లను మారుస్తూ, అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే భారత్-పాక్ పోరాటాలను మరిన్ని చూసేలా చేస్తున్న ఈ సరికొత్త నిర్ణయాలు క్రికెట్ ప్రపంచంలో సరికొత్త జోష్ నింపడం ఖాయం. రాబోయే రోజుల్లో ఈ చారిత్రాత్మక మార్పులపై ఐసీసీ అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఐసీసీ సంచలన నిర్ణయం.. ఇకపై ప్రపంచకప్‌లలో మరిన్ని భారత్ - పాక్ మ్యాచ్‌లు.. స్కెచ్ మాములుగా లేదుగా..!
Ind Vs Pak Matches
Venkata Chari
|

Updated on: Jul 15, 2026 | 11:34 AM

Share

Jay Shah ICC World Cup Format Changes: ప్రపంచ క్రికెట్ అభిమానులకు అంతకు మించిన పండగ వార్త మరొకటి లేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సారథి జై షా నేతృత్వంలో ఒక చారిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నారు. వన్డే, టీ20 ప్రపంచకప్‌లతో పాటు టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫార్మాట్లలో విప్లవాత్మక మార్పులు చేయడం ద్వారా భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ల సంఖ్యను మరింత పెంచేందుకు ఐసీసీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.

క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే పోరుకు ఉండే క్రేజ్, భావోద్వేగాలు మరే మ్యాచ్‌కూ ఉండవు. రాజకీయ కారణాల వల్ల ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే ఈ దాయాదుల పోరును చూసే భాగ్యం అభిమానులకు కలుగుతోంది. ఈ మ్యాచ్‌ల ద్వారా వచ్చే విపరీతమైన ఆదరణ, భారీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని, జై షా నేతృత్వంలోని ఐసీసీ సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసింది. స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బరోలో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో ఈ మేరకు కీలక ప్రతిపాదనలపై చర్చలు జరిగాయి.

ఇది కూడా చదవండి: ఇంగ్లాండ్‌లో ఇరగదీసినా.. ఆ టీమిండియా స్టార్ ప్లేయర్‌కు 2027 వరల్డ్ కప్‌లో నో ప్లేస్.. ఎందుకంటే..?

ఇవి కూడా చదవండి

వన్డే ప్రపంచకప్‌లో ‘సూపర్ సెవెన్’.. సరికొత్త హంగులు..

విశ్వసనీయ సమాచారం ప్రకారం, రాబోయే వన్డే ప్రపంచకప్‌లలో జట్ల సంఖ్యను 14 నుంచి 12కి తగ్గించాలని ఐసీసీ యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న రౌండ్-రాబిన్, సెమీఫైనల్ పద్ధతికి స్వస్తి పలికి, దాని స్థానంలో ‘సూపర్ సెవెన్’ (Super Seven) దశను ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఈ కొత్త విధానం వల్ల టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు ఒకటి కంటే ఎక్కువసార్లు తలపడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. 2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల వేదికగా జరగబోయే వన్డే ప్రపంచకప్ నుంచే ఈ కొత్త రూల్ అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

టీ20 ప్రపంచకప్‌లో ‘సూపర్ టెన్’ హవా!

మరోవైపు, పొట్టి ప్రపంచకప్ (T20 World Cup) ఫార్మాట్‌లోనూ భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. గతంలో ఉన్న ‘సూపర్ ఎయిట్’ స్థానంలో ఇకపై ‘సూపర్ టెన్’ (Super Ten) దశను తీసుకురావడానికి ఐసీసీ మొగ్గు చూపుతోంది. మొదటి రౌండ్ ముగిసిన తర్వాత టాప్ జట్లతో ఈ సూపర్ టెన్ రౌండ్ నిర్వహిస్తారు. దీని ప్రధాన ఉద్దేశం కూడా భారత్-పాక్ మ్యాచ్‌లను గరిష్టంగా పెంచడమే. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే టీవీ రేటింగులు బద్దలైపోవడమే కాకుండా, స్పాన్సర్ల ద్వారా ఐసీసీకి కాసుల వర్షం కురుస్తుంది. అందుకే ఈ వ్యూహాత్మక మార్పులకు జై షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Kohli vs Gambhir: టీమిండియాలో ముదిరిన విభేదాలు.. కోచ్ గంభీర్, కోహ్లీ మధ్య మాటలు బంద్..?

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్స్..!

టెస్ట్ క్రికెట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఐసీసీ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. ప్రస్తుతం రెండు సంవత్సరాల సైకిల్ ముగిసిన తర్వాత టాప్-2 స్థానాల్లో ఉన్న జట్లు నేరుగా ఫైనల్లో తలపడుతున్నాయి. అయితే, ఇకపై ఫైనల్ కంటే ముందు సెమీఫైనల్స్ నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌లో తలపడతాయి, అందులో గెలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అయితే భారత్, పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్‌లు జరగనందున, ఈ ఫార్మాట్‌లో దాయాదుల పోరు చూడటం కష్టమే. అలాగే, టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో జట్ల సంఖ్యను 12కి పెంచాలనే ప్రతిపాదనను ఐసీసీ ప్రస్తుతానికి పక్కనబెట్టింది. మునుపటిలాగే 9 జట్లతోనే తదుపరి సైకిల్ కొనసాగనుంది.

ఇది కూడా చదవండి: ఆ ముగ్గురు దద్దమ్మలు ఇక ఇంటికే.. వచ్చేస్తున్నాడ్రోయ్ అసలైన పులి.. కోహ్లీ దోస్త్ గ్రాండ్ ఎంట్రీ?

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us