AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోహిత్ శర్మ లేకుండానే స్వ్కాడ్.. 2027 వన్డే ప్రపంచకప్‌లో బరిలోకి దిగే భారత జట్టు ఇదే..?

India World Cup 2027 squad: కేవలం తన ఆటతీరుతోనే కాకుండా తన వ్యక్తిత్వంతో కోట్లాది మంది మనసులు గెలుచుకున్న రోహిత్ శర్మ లేని భారత జట్టును ఊహించుకోవడం ప్రతి క్రికెట్ అభిమానికి గుండెకోతే. అయినప్పటికీ భవిష్యత్తు కోసం కాలంతో పాటు వచ్చే మార్పులను స్వీకరించక తప్పదు.

రోహిత్ శర్మ లేకుండానే స్వ్కాడ్.. 2027 వన్డే ప్రపంచకప్‌లో బరిలోకి దిగే భారత జట్టు ఇదే..?
Team India 2027 Odi World Cup
Venkata Chari
|

Updated on: Jul 19, 2026 | 6:57 PM

Share

India World Cup 2027 Squad: భారత వన్డే క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చిన ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకుందనే వార్తలు కోట్లాది మంది అభిమానుల హృదయాలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డేతోనే రోహిత్ వీడ్కోలు పలికితే.. 2027 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు కూర్పు ఎలా ఉండబోతోంది? ఆ స్థానాన్ని భర్తీ చేసే 15 మంది ఆటగాళ్ల వివరాలు మీకోసం.

శుభ్‌మన్ గిల్ చేతికి పగ్గాలు.. ఓపెనర్‌గా జైస్వాల్..!

రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా ఎన్నో అద్భుత ఘనతలను సాధించింది. అయితే దక్షిణాఫ్రికాలో జరగబోయే ప్రపంచకప్‌నకు ముందు అక్కడి బౌన్సీ పిచ్‌లపై రోహిత్ ఇటీవలి రికార్డులు, అతని వయసును పరిగణనలోకి తీసుకుని భారత సెలక్టర్లు భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయాల వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఒకవేళ రోహిత్ వీడ్కోలు పలికితే, 2027 ప్రపంచకప్‌లో భారత జట్టు పగ్గాలు యువ సంచలనం శుభ్‌మన్ గిల్ చేపట్టే అవకాశం మెండుగా ఉంది. వన్డే ఫార్మాట్‌లో ఏకంగా 60కి పైగా అత్యుత్తమ సగటుతో దూసుకుపోతున్న గిల్‌కు తోడుగా.. డాషింగ్ ఓపెనర్, ముంబై స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ స్థానాన్ని భర్తీ చేయడం ఏ ఆటగాడికైనా అంత సులభం కానప్పటికీ, జైస్వాల్ అసాధారణ ప్రతిభపై జట్టు మేనేజ్‌మెంట్ పూర్తి నమ్మకంతో ఉంది.

విరాట్ కోహ్లీదే పెద్దన్న పాత్ర.. పటిష్టమైన మిడిలార్డర్..!

ఒకవేళ రోహిత్ శర్మ నిజంగానే జట్టుకు దూరమైతే.. బ్యాటింగ్ విభాగంలో పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఒక్కడే అత్యంత సీనియర్ ఆటగాడిగా మిగలనున్నాడు. రాబోయే ప్రపంచకప్ జరిగే దక్షిణాఫ్రికాలోని సవాలు విసిరే బౌన్సీ పిచ్‌లపై కోహ్లీకి ఉన్న అద్భుతమైన ట్రాక్ రికార్డు భారత జట్టుకు అతిపెద్ద బలం కానుంది. అక్కడ అతనికి దాదాపు 2,000 పరుగులు చేసిన ఘనత ఉంది. యువకులకు మార్గనిర్దేశం చేయడంలో కోహ్లీ అనుభవం జట్టుకు కీలకం కానుంది. ఇక మిడిలార్డర్ విషయానికి వస్తే, గత ప్రపంచకప్‌లో 500కు పైగా పరుగులతో అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్, నమ్మకమైన క్లాసిక్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ విభాగానికి వెన్నెముకలా నిలవనున్నారు. వీరితో పాటు 2026 టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టిన విధ్వంసకర బ్యాటర్ ఇషాన్ కిషన్ బ్యాకప్ వికెట్ కీపర్‌గా జట్టులో చోటు దక్కించుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

అదరగొట్టే ఆల్‌రౌండర్లు.. బుమ్రా సారథ్యంలో పేస్ దళం!

ఆధునిక వన్డే క్రికెట్‌లో ఆల్‌రౌండర్ల పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ జట్టుకు ప్రధాన బలం కానున్నాడు. హార్దిక్‌కు తోడుగా ఇటీవల అద్భుతంగా రాణిస్తున్న తెలుగబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి కూడా జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఇక స్పిన్ ఆల్‌రౌండర్లుగా ఎంతో నిలకడ కనబరుస్తున్న అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ స్క్వాడ్‌కు ఎంపిక కావడం లాంఛనమే.

దక్షిణాఫ్రికా పిచ్‌లు ఎప్పుడూ ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలిస్తాయి కాబట్టి, బౌలింగ్ విభాగానికి యార్కర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా సైన్యాధిపతిగా వ్యవహరించనున్నాడు. అక్కడ కేవలం 19 మ్యాచ్‌ల్లోనే 52 వికెట్లు తీసిన రికార్డు బుమ్రా సొంతం. అతడితో పాటు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో నిప్పులు చెరిగే బంతులు విసరగల పొడుగుపాటి ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్, ఐపీఎల్ స్టార్ బౌలర్ హర్షిత్ రాణా మూడో పేసర్‌గా జట్టుకు ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఎడమచేతి వాటం స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తన స్వింగ్‌తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టగలడు. ప్రధాన స్పిన్నర్‌గా మాయాజాలం చేసే బాధ్యతలను స్పిన్ మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ తీసుకోనున్నాడు.

కేవలం తన ఆటతీరుతోనే కాకుండా తన వ్యక్తిత్వంతో కోట్లాది మంది మనసులు గెలుచుకున్న రోహిత్ శర్మ లేని భారత జట్టును ఊహించుకోవడం ప్రతి క్రికెట్ అభిమానికి గుండెకోతే. అయినప్పటికీ భవిష్యత్తు కోసం కాలంతో పాటు వచ్చే మార్పులను స్వీకరించక తప్పదు. శుభ్‌మన్ గిల్ ఉత్సాహం, విరాట్ కోహ్లీ అపార అనుభవం, యంగ్ గన్స్ జోరు కలగలిపిన ఈ 15 మంది ఆటగాళ్ల బలమైన కూర్పు.. 2027 వన్డే ప్రపంచకప్‌లో సత్తా చాటి, సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే లార్డ్స్ మైదానంలో జరగబోయే మూడో వన్డే తర్వాతనే రోహిత్ భవితవ్యంపై అధికారికంగా పూర్తి స్పష్టత రానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
2027 వన్డే ప్రపంచకప్‌లో బరిలోకి దిగే భారత జట్టు ఇదే..?
2027 వన్డే ప్రపంచకప్‌లో బరిలోకి దిగే భారత జట్టు ఇదే..?
మీ చిట్టి గుండె గట్టిగా ఉండాలంటే నెలకు ఎంత నూనె వాడాలి..?
మీ చిట్టి గుండె గట్టిగా ఉండాలంటే నెలకు ఎంత నూనె వాడాలి..?
4 ఏళ్లు ఇంచు కదలకుండా జీవిస్తుంది.. నీళ్లు, తిండి అవసరమే లేదు!
4 ఏళ్లు ఇంచు కదలకుండా జీవిస్తుంది.. నీళ్లు, తిండి అవసరమే లేదు!
పీఠాధిపతికి కన్నీటి వీడ్కోలు పలికిన ఏనుగు
పీఠాధిపతికి కన్నీటి వీడ్కోలు పలికిన ఏనుగు
వై-ఫై ఉపయోగిస్తున్నప్పుడు ఇలా అస్సలు చేయవద్దు.. ఇంటర్నెట్ వేగం డౌ
వై-ఫై ఉపయోగిస్తున్నప్పుడు ఇలా అస్సలు చేయవద్దు.. ఇంటర్నెట్ వేగం డౌ
ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉండనుందంటే..?
ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉండనుందంటే..?
సోషల్ మీడియాలో దుమ్మురేపుతోన్న పాట.. ఏకంగా 10 లక్షల రీల్స్
సోషల్ మీడియాలో దుమ్మురేపుతోన్న పాట.. ఏకంగా 10 లక్షల రీల్స్
బలహీనంగా ఉన్న ఎముకలు 100 రెట్లు బలంగా అవ్వాలంటే ఒక స్పూన్ తింటే..
బలహీనంగా ఉన్న ఎముకలు 100 రెట్లు బలంగా అవ్వాలంటే ఒక స్పూన్ తింటే..
గ్యాస్ ఎంత ఉందో బయటి నుంచే చూడొచ్చు..సరికొత్త సిలిండర్ వచ్చేసింది
గ్యాస్ ఎంత ఉందో బయటి నుంచే చూడొచ్చు..సరికొత్త సిలిండర్ వచ్చేసింది
ఇంగ్లాండ్ ఓపెనర్ల విశ్వరూపం.. కట్‌చేస్తే 36 ఏళ్ల రికార్డ్ బ్రేక్
ఇంగ్లాండ్ ఓపెనర్ల విశ్వరూపం.. కట్‌చేస్తే 36 ఏళ్ల రికార్డ్ బ్రేక్