AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT : ప్రేక్షకుల ముందుకు మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే.?

ఓటీటీల్లో ఎన్నో రకాల సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలోకి ఓ ఇంట్రెస్టింగ్ సిరీస్ రాబోతుంది. అదే వీరభద్రుని రహస్యం. మూఢనమ్మకాల నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కిందని తెలుస్తుంది. తెలుగు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌ ZEE5 ఈ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

OTT : ప్రేక్షకుల ముందుకు మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్  ఎప్పుడు.? ఎక్కడంటే.?
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Jun 23, 2026 | 8:55 AM

Share

తెలుగు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌ ZEE5 ప్రేక్షకుల ముందుకు ఒక థ్రిల్లింగ్ మిస్టరీ కథను తీసుకురాబోతోంది. అదే ‘మ‌ర్మ‌దేశం అనే ప్ర‌పంచం నుంచి వీరభద్రుని రహస్యం. ఇది జూన్ 26 నుంచి జీ5లో ప్రీమియర్ కానుంది. 1990ల్లో టెలివిజ‌న్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ క‌ల్ట్ మిస్ట‌రీ సిరీస్ మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. అలాగే తెలుగు ఐఎండీబీ హ‌య్య‌స్ట్ రేటింగ్ సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. రహస్యాలతో నిండిన వీరభద్రపురం అనే గ్రామ నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌లో.. నమ్మకం ఆజ్ఞలను విధించే శక్తిగా మారి..భయం ప్రతి రోజూ అక్కడి ప్రజల జీవనాన్ని ప్రభావితం చేస్తుంది. దేవుడిపై ఉన్న గాఢ విశ్వాసం నీడలో దాగి ఉన్న ఎన్నో రహస్యాలు ఈ కథలో వెలుగులోకి రాబోతున్నాయి. కథ విషయానికి వస్తే.. తరతరాలుగా వీరభద్రపురం గ్రామ ప్రజలు తమ గ్రామ దైవం వీరభద్ర స్వామి అండలో జీవిస్తుంటారు. గ్రామాన్ని కాపాడే ఆ దేవుడు.. అదే గ్రామంలో ఎవరైనా తప్పు చేస్తే ఆయన శిక్షిస్తాడని అండ‌రూ గాఢంగా నమ్ముతుంటారు. ఆ ఆలయంలోని పవిత్ర గంట మోగినప్పుడల్లా..ఆలయ పరిసరాల్లో ఓ మృతదేహం కనిపిస్తుంది. గడ్డల గుట్టగా శపించబడిన కొండపై మృతదేహాలు క‌నిపిస్తుంటాయి. ఈ మరణాలను గ్రామస్తులు దైవ న్యాయంగా భావిస్తుంటారు. అయితే వాటి వెనుక నిజం ఏమిటో అని మాత్రం ప్రశ్నించడానికి ఎప్పుడూ ధైర్యం చేయరు. త‌ర‌త‌రాలు వారంద‌రూ పాటిస్తున్న సాంప్ర‌దాయం వారిని స్వామికి విధేయులుగా ఉంటూ మౌనంగా కొన‌సాగేలా చేస్తుంది. దీంతో వారు బ‌ల‌వంతంగా, ద‌శాబ్దాలుగా అక్క‌డి ప్ర‌జ‌లు ఆ సాంప్ర‌దాయాన్ని పాటిస్తుంటారు.

మూఢనమ్మకాలతో నిండిన వింత ప్ర‌పంచ‌లాంటి వీర‌భ‌ద్ర‌పురం అనే ప్ర‌పంచంలోకి సిటీ నుంచి ధైర్యమైన, విష‌యాన్ని తార్కికంగా ఆలోచించే యువతి వెన్నెల(అన్నీ) అడుగుపెడుతుంది. ఆమె వ‌చ్చిన స‌మ‌యంలో గ్రామంలో ఓ యువకుడు దారుణంగా హత్యకు గుర‌వుతాడు. అయితే అక్క‌డి ప్ర‌జ‌లు దాన్ని దైవ శిక్షగా చెబుతారు. కానీ వెన్నెల మాత్రం వారి అంధ విశ్వాసాన్నిఒప్పుకోదు. నిజాన్ని వెలికితీయాలనే ఆమె సంకల్పం గ్రామాన్ని కుదిపేస్తుంది, శతాబ్దాలుగా ఉన్న నమ్మకాల్ని సవాలు చేస్తుంది, గతాన్ని దాచిపెట్టాలని చూసే శ‌క్తివంతులైన వ్య‌క్తుల‌తో ఆమె పోరాటాన్ని ప్రారంభిస్తుంది. వెన్నెల లోతుగా అన్వేష‌ణ చేసుకుంటూ వెళ్లే కొద్దీ.. గ్రామంలోని ర‌హ‌స్యాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతుంటాయి. భక్తి పేరుతో దాగి ఉన్న దోపిడీ, వ్యవస్థీకృత నేరాలు, తరతరాల భయాల వెనుక దాచిన చీకటి గతం బయటపడుతుంది. 1970ల కాలానికి వెళ్లి ఈ ఘటనల మూలాలను అన్వేషించ‌టం ద్వారా ఈ గ్రామాన్ని నడిపిస్తున్న కథలు ఎలా శక్తి, ఆశ, మాయాజాలంతో రూపుదిద్దుకున్నాయో సిరీస్ నెమ్మదిగా బయటపెడుతుంది. ఇది విశ్వాసం, తర్కం మధ్య జరిగే గట్టిపోరు. ప్రతి సమాధానం కొత్త ప్రశ్నలను లేవనెత్తుతుంది, ప్రతి నిజం బయటపడే కొద్ది ఎవ‌రూ ఊహించ‌ని వాస్తవాలు బ‌య‌ట‌కు రాబోతున్నాయ‌నే ఉత్కంఠ‌త పెరుగుతుంది.

భీమగాని శ్రీ వర్ధన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌లో వెన్నెల పాత్రలో అన్నీ, యోగానందంగా రఘు కుంచె, కార్తికేయగా రఘు, అభినవ్‌గా ఎస్‌ఐ రవి, డా. నందగా కమల్ తూము, సింహవల్లిగా శిరీష‌, నాంచారిగా అనురాధ, గురునాధన్‌గా బాలచంద్ర, బ్రహ్మంగా కల్కి, యంగ్ కార్తికేయగా హార్విన్ రెడ్డి క‌నిపించ‌నున్నారు. క్రియేటివ్ టీమ్ విష‌యానికి వ‌స్తే సినిమాటోగ్రఫీకి సుభాష్, సంగీత దర్శకుడిగా సుధా శ్రీనివాస్, ఎడిటర్‌గా రాగం సత్య నితీష్, స్క్రీన్‌ప్లే రచయితగా రుద్రరాజు చాణక్య వర్మ, సంభాషణల రచయితగా అంజన్ మేగోటి పనిచేశారు. మొత్తం 60 ఎపిసోడ్‌లతో రూపొందిన వీరభద్రుని రహస్యం ఒక లాంగ్-ఫార్మ్ మిస్టరీగా క్రమంగా రహస్యాలు..ట్విస్టులను బయటపెడుతూ ముందుకు సాగుతుంది. ఈ సిరీస్ జూన్ 26న రెండు ఎపిసోడ్‌లతో ప్రారంభమై త‌ర్వాత‌ ప్రతి వారం కొత్త ఎపిసోడ్స్ యాడ్ అవుతాయి. దీంతో సస్పెన్స్, ఉత్కంఠ, అనూహ్య మలుపులతో నిండిన ఈ కథలో ప్రేక్షకులు మ‌రింత‌గా లీన‌మ‌వుతార‌న‌టంలో సందేహం లేదు. మ‌ర్మ‌దేశం ప్ర‌పంచం నుంచి వీర‌భ‌ద్రుని ర‌హ‌స్యం సిరీస్‌తో జీ5 తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఉండే, ఆకట్టుకునే కథలను అందించాలనే నిబ‌ద్ద‌త‌ను కొన‌సాగిస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. మిస్టరీ, జానపదం, సస్పెన్స్, ఎమోష‌న‌ల్ డ్రామాను ప్రత్యేకమైన తెలుగు నేపథ్యంతో కలిపిన ఈ సిరీస్, పురాణం.. వాస్తవం మధ్య ఉండే స‌న్న‌టి గీత‌ మరింత మసకబారేలా చేసే ఒక గాఢమైన అనుభూతిని ప్రేక్షకులకు అందించబోతోంది. వ‌ర‌ల్డ్ ఆఫ్ మ‌ర్మ‌దేశం నుంచి వీర‌భ‌ద్రుని ర‌హ‌స్యం’ సిరీస్ ఈ జీ5లో ప్ర‌త్యేకంగా స్ట్రీమింగ్‌కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us