AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Folk Song: ఏం సాంగ్ రా అయ్యా..! కుర్రాళ్లు తెగ పాడుకుంటున్న పాట.. యూట్యూబ్‌ను ఊపేస్తోంది

రీసెంట్ డేస్ లో ఫోక్ సాంగ్స్ కు విపరీతమైన క్రేజ్ వస్తుంది. సినిమా సాంగ్స్ ను మించి ఫోక్ సాంగ్ రచ్చ చేస్తున్నాయి ఎక్కడ చూసిన ఫోక్ సాంగ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్ లో ఫోక్ సాంగ్స్ ఓరేంజ్ లో దూసుకుపోతున్నాయి.

Folk Song: ఏం సాంగ్ రా అయ్యా..! కుర్రాళ్లు తెగ పాడుకుంటున్న పాట.. యూట్యూబ్‌ను ఊపేస్తోంది
Song
Rajeev Rayala
|

Updated on: Jun 22, 2026 | 8:45 AM

Share

ఇప్పుడు ఎక్కడ చూసిన ఫోక్ సాంగ్స్ హవ కనిపిస్తుంది. ప్రతి నెల పదుల సంఖ్యలో సాంగ్స్ విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అంతే కాదు సినిమా సాంగ్స్ కు మించి ఫోక్ సాంగ్స్ క్రేజ్ తెచ్చుకోవడంతో ఇప్పుడు చాలా మంది ఫోక్ సాంగ్స్ ను తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అంతే కాదు పాన్ ఇండియా రేంజ్ లో ఫోక్ సాంగ్స్ పాపులర్ అవుతున్నాయి. ఇప్పటికే ఎన్నో ఫోక్ సాంగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఓ రేంజులో ఫోక్ సాంగ్స్ సందడి చేస్తున్నాయి. రాను బొంబాయికి రాను అంటూ సాగే సాంగ్, ఓ పిలగ వెంకటేశు సాంగ్ మిలియన్స్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటూ దూసుకుపోయాయి. ఈ క్రమంలోనే మరికొన్ని సాంగ్స్ కూడా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి : ఇలాంటి హీరోను ఇన్నాళ్లు ఎందుకు మిస్ అయ్యానా అని ఫీల్ అయ్యా.. ఆయనతో మళ్లీ మళ్లీ సినిమా చేయాలనుంది

తాజాగా ఇప్పుడు ఓ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇటీవలే ఓ సాంగ్ విడుదలై సోషల్ మీడియాను ఊపేస్తోంది. కుర్రాళ్లు ఈ పాటను తెగ పాడుకుంటున్నారు. ఎక్కడ చూసిన ఇప్పుడు ఇదే పాట వినిపిస్తుంది. ఆ సాంగ్ లో డాన్స్ కూడా అదిరిపోయింది.ఆ సాంగ్ మరేదో కాదు “అబ్బబా గా పోరి ఏముందిరో.. జబ్బలు జాకెట్టు ఏసిందిరా..” అంటూ సాగే ఈ సాంగ్ విశేషంగా ఆకట్టుకుంటుంది.

ఇది కూడా చదవండి : అప్పుడు నాతో కలిసి హోటల్‌లో పని చేశాడు.. ఇప్పుడు పెద్దస్టార్ అయ్యాడు.. కలిస్తే ఎలా ఉంటాడంటే

ఇక ఈ సాంగ్స్‌లో మాధురి రాథోడ్ తన అందంతో ఆకట్టుకుంది. ఈశ్వర్ సాయి డాన్స్ తో ఆకట్టుకున్నాడు. మదివేను శ్రీనివాస్ ఈ పాటను రచించారు. అలాగే కళ్యాణ్ కీస్ సంగీతం అందించారు. జోగుల వెంకటేష్ ఈ సాంగ్ ను అద్భుతంగా పాడి ఆకట్టుకున్నారు. ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ కాంబినేషన్ అలరించింది. ఈ సాంగ్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే మిలియన్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఈ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :Anupama Parameswaran: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us